కలియుగ పాపం పెంపులో, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం నుండి బయటకు రాని, ప్రతి ఇల్లు బాధ్యత? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,936,997; 104 తత్వాలు (Tatvaalu) and views 230,572.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*కలియుగ పాపం పెంపు లో, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం నుండి బయటకు రాని, ప్రతి ఇల్లు బాధ్యత వహిస్తుందా?*

In Kaliyuga sin increase, is every house responsible for not coming out of Arishadvargas Ashtavyasana slavery? link

నిన్న అష్ట వ్యసనాల గురించి వివరముగా తెలుసుకున్నాము. ఋణాను బంధం-యోగి జ్ఞాన ఉపదేశం -తస్మాత్ జాగ్రత కూడా గతములో విన్నాము. #ashtavyasan #saptavyasan

పురాణాలు వేదాలు భగవద్గీత ల గురించి ఎన్ని సార్లు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని తీర్ధ యాత్రలు తిరిగినా, ఎన్ని నదులలో మునిగినా, ఎన్ని ఆశ్రమములో నిద్ర చేసినా, చివరకు మన దేహమే దేవాలయము, జీవుడే దేవుడు గా నిరూపించనిదే, మనము మన మనసును నియంత్రించి మన గుణాలను మార్చుకుని, ఎవరో ఒకరిని ఆదర్శముగా తీసుకుని సాధన చేయనిదే, ఒక రాముని గా, క్రిష్ణునిగా, బ్రహ్మం గారిలా, వేమనలా, రాఘవేంద్రస్వామి లా ఏనాటికీ కాలేము, ముక్తి పొందలేము.

కోటి రూపాయలు ఇచ్చినా, క్షణములో సాధకులు గా కాలేరు, మార్చలేము. కనీసం సజీవ గురువులు సొంత తల్లి దండ్రులకు, ముదుసలి వయసులో ఉపయోగపడలేము. పంచభూతాలతో శిక్షలు తప్పవు, ఇంకా నీచమైన స్తితిలో మరు జన్మ తప్పదు. గరుడ పురాణం మాటలు ఇవి సుమా.

ఇంక ఇవన్నీ 1 నుంచి 30 ఏళ్ళు వినీ, చూసి, తరించి, మనలో మార్పు రానిదే, గుణ కర్మల మార్పు ఇంకెప్పుడు వస్తుంది? 30-60 వారూ ఇంకా వినడం, తిరగడం, చూడడమేనా? ఇంక చేతలలో ఆచరణ ఎప్పుడు? సాధన ఎప్పుడు? ఎన్ని జన్మల తర్వాత వస్తుంది? చేదు దోసకాయ ఎన్ని తీర్ధాలు తిప్పినా తీపి రాదు అని ఒక కధ, అర్హతలేని మనిషి యూనివర్సిటీ చుట్టూ ఎన్ని సార్లు పొర్లు దండాలు చేసినా, దండగే అన్న కధ చూసాము.

అరిషడ్వర్గాలు మరియు అష్టవ్యసనాల బానిసత్వం నుండి బయటకు వచ్చే లేదా లొంగకుండా ఉండే, మీ కఠోర సాధనలు ఎలా జరుగుతున్నాయి అని ప్రతి వారం, ఎందుకు చెప్పడం లేదు? మీరు ఉత్తమ గురువులు గా, మాలాంటి అజ్ఞాన శిష్యుల ఆత్మ జ్ఞాన సాధనకు, ఎందుకు ఆదర్శముగా ఉండలేకపోతున్నారు. సాధన దాచుకునే మనం, భక్తులము సాధకులము ఎలా అవుతాము?

లేదా మేము, వాటికి బానిసలు కాదు అని అయినా చెప్పాలి, ఉదాహరణ లతో, ధైర్యముగా అందరిముందు సోషల్ మీడియా స్టేటస్ ల లో, ఒకవేళ దేవుని పూజిస్తూ, సజీవ గురువులైన తల్లి దండ్రుల సేవ చేస్తూ, సంతానానికి సంస్కారం నేర్పుతూ ఉంటే, సనాతన ధర్మం ఆచరిస్తూ, భగవద్గీత ఆచరిస్తూ స్తితప్రజ్ఞత పొంది, ఆత్మలు జీవులు సమానమని, దేహమే దేవాలయమని జీవుడే దైవమని, అందరూ దేవుని సంతానమని నమ్మితే.

లేదంటే మన పిల్లల కు, మనం సంస్కారం నేర్పడం లేదని, ఒప్పుకున్నట్లే కదా. మనకు తెలియనిది ఇతరులకు ఎలా చెబుతాం. మనము ముదుసలి తనము లో, ఇన్నాళ్ళ సంస్కార పెంపకమునకు, పిల్లల దగ్గర ఉండము, వారు మనల్ని చూడరు, తెలియని విశ్వసనీయత క్రుతజ్ఞతలు తో అని ఒప్పుకుంటున్నామా?

ఎందుకు మనము, మన చుట్టు ఉన్నవారు, తమ పిల్లల సంస్కారం గుణాల గురించి చెప్పలేకపోతున్నారు? తమ ముదుసలి తల్లి దండ్రులకు చేస్తున్న సేవలను ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదేనా మన ఉత్తమ సమాజం? గుండెల మీద చెయ్యి వేసుకుని, మా ముదుసలి అమ్మా నాన్న మా ఇంట్లో గౌరవముగా మాతో తిరుగుతు వున్నారు అని, అలాగే, మేము మా పిల్లలతో ఉంటాము మా ముదుసలి వయసులో అని, ఎందుకు చెప్పలేము?

అంటే మన జీవితము కపట, నాటక బతుకులో వ్రుధాయేనా? అసలు మనకు ఆచరణ సాధన లేవు అని తెలియదు అని ఒప్పుకున్నట్లేనా?

స్నేహితులు బంధువులు అంటే హాయ్ బాయ్ అంతవరకే, మంచి చెడు చెప్పరు అడగరు అంటే, అది అవకాశం అవసరం కపటం నటన మాత్రమే, దానికి బంధుత్వం స్నేహితం అవసరం లేదు. ముక్కు మొఖము తెలియని, రోడ్ న పోయే, ఎవరైనా ఒకటే కదా అప్పుడు. వారినీ మనము అడగము, వారు చెప్పినా వినము.

అదే నటన. రేపు మన పిల్లలు, మన ఇంట్లో వారు తప్పు చేస్తున్న కూడా, వారికి తెలిసిన కూడా, ఇతరులు మనకు చెప్పరు, అలాగే మనమూ వారికి చెప్పము, అంతేనా? ఇదేనా బంధుత్వం స్నేహితం? అవ్వ, నష్టం మనకే కదా? నటన బంధం వలన?

ఆహర నిద్ర భయ మైథునంచ సామాన్య మేతు త్పశుభి ర్నరాణాం దర్మోహి తేషా మధికో విశేషో ధర్మేణ హీనాః పశుభి స్సమానాః

ఆహారాన్ని తీసుకోవడం, నిద్ర, భయం, భోగానుభవం అనేవి మానవులకు జంతువులకు కూడా సమాన లక్షణాలు.

మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ధర్మాచరణ, సంస్కారం! ఇవి కొన్ని అయినా జయించే వాడు, మనో నిగ్రహం కలవారు.

ఆ ధర్మాన్ని గనుక విడిచిపెడితే, మనిషి జంతువు కంటే అధికుడు కాదు, ఇద్దరూ ఒకటే ! కలియుగంలో నూటికి 75 మంది, అదే భావనలో. కాబట్టే, మనము మన నాయకులుగా, మనకన్నా అధములను, అంటే పులి పాము నక్క తెలివి ఉన్నవారిని ఎన్నుకుని, వారి చేతిలో, నానా కష్టాలు పడుతున్నాము. బురద లో ఆనందించే వరాహానికి, ఎంత చెప్పినా, అది ఆ సువాసన విడువదు, కుక్క తోక వంకరలాగా, అంతేనా?

కాబట్టి కలియుగ పాపం పెంపు లో, ప్రతి ఇల్లు బాధ్యత వహిస్తుంది, అనే కదా అర్ధం. జై శని రాహు కేతు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,936,997; 104 తత్వాలు (Tatvaalu) and views 230,572
Dt : 31-Oct-2022, Upd Dt : 31-Oct-2022, Category : General
Views : 426 ( + More Social Media views ), Id : 1602 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kaliyuga , sin , increase , house , responsible , arishadvargas , ashtavyasana , slavery
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content