Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
రాము, సోము స్నేహితులు. ఇద్దరు చదువుకోటానికి అమెరికా వెళ్ళాలి అని బాగా కష్టపడి ఇంజినీరింగ్ చదివారు. రాము తెలివిగల వాడు, మంచి మార్కులతో మంచి అమెరికా యూనివర్సిటీ లో సీట్ సంపాదించాడు. అమెరికా వెళ్ళి హయిగా చదువుకుంటున్నాడు. తల్లి దండ్రులు కొంచెము డబ్బు గల వారు, ఒడిదొడుకులు తట్టుకో గలరు.
సోము సరిగ్గా చదవలేడు. గేట్ పరీక్షలో కూడా మార్కులు, ఎక్కువ రాలేదు. కానీ రాము వెళుతున్నాడు, నేను ఎలాగైనా వెళ్ళాలి అన్న పట్టుదల తో, అమెరికాలో ఉన్న తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసాడు ఇతర మార్గాల కోసము. వారు అతనికి ఒక విద్యా సంస్థ గురించి ఇలా చెప్పారు - మన వాళ్ళు చాలా మంది చేరారు. తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు. అక్కడ చదవాల్సిన పని లేదు, క్లాసులు ఉండవు, మాస్టారులు ఉండరు, ఎక్కడైన ఉండి పని చేసుకోని సంపాదించి హాయిగా రోజులు నెట్టేయవచ్చు అని.
సోము, రాము ని కూడా అడిగాడు సలహా, ఏమి చెయ్యమంటావు అని వచ్చే ముందు. రాము వివరము గా చెప్పాడు, అలా చెయ్యొద్దు, ఇబ్బంది పడతావు, తర్వాత అప్పులు తీర్చటము కష్టము. ఆ భారము మీ అమ్మ, నాన్న మీద పడుతుంది అని. క్లాసులు జరగవు, లేదా వారానికి 2 రొజులు అన్నా, మనము అనుమానించాలి. రొజూ వెళ్ళి చదివితేనే కష్టముగా ఉంది. పని చేస్తూ, చదవడము అంటే, ఇంకా కష్టము అని.
కాని సోము కు ఆ మాటలు నచ్చలేదు, నీకేమి అమెరికా వెళ్ళావు ఆల్రేడి , నేను రావడము ఇష్టము లేదు అని విసుక్కున్నాడు. సోము తల్లి దండ్రులు కూడా రాము మాటలు వినలేదు.
సోము తల్లి దండ్రులు ఇలా కొడుకును సమర్దించారు. మన రాష్ట్రములో కూడా ఫీజ్ రీయెంబర్స్మెంట్ కింద ఉన్న కాలేజీలో పిల్లలు ఉండరు, కాలేజీ వాళ్ళే హజరు వేసుకుంటారు డబ్బులు తీసుకుంటారు. అలాంటిదే మనకోసం మన వాళ్ళు పెట్టి ఉంటారు అని సమర్దించుకున్నారు. కొడుకును తప్పుగా వెళ్ళి తప్పు చేయమని ప్రొత్సహించారు.
సంఘములో గౌరవం కట్న లాభం. ఇక్కడ ఉన్నా చెడు సహవాసాలతో చెడిపోతాడేమో కూడా ఇంకో భయం. ఒకవేళ బాగా చదవగలిగితే మంచి ఉద్యోగం వస్తే, బతుకు బాగుంటుందని కూడా కొంత మంది ఆశ.
10 లక్షలు అప్పు చేసి, సోము ని అమెరికా పంపారు. కాలేజి ఫీజ్ కట్టి, హయి గా, ఎక్కడో వేరే ఉళ్ళో, పని చేసుకుంటూ ఆనందము గా రోజులు గడుపుతున్నాడు సోము. స్నేహితులతో, సరదాలు షికార్ల తో తెలీకుండానే సంవత్సరము గడచిపొయింది.
సోము కి , గోపి కూడా పరిచయము అయ్యాడు. గోపి వచ్చి 3 యేళ్ళు దాటింది. మొదటి చదువు అయిపోయి, ఉద్యొగము రాక, ఇండియా వెళ్ళటం ఇష్టము లేక, ఇదే కాలేజీ లో మరల చేరాడు తర్వాతి చదువుకు, ఎందుకంటే అలా చదివితే లీగల్ గా అమెరికాలో ఉండచ్చు అని. అలా వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరికీ తెలుసు, చేస్తున్నది తప్పు అని. అలాగే పేరెంట్స్ కీ తెలుసు లేదా తెలుసుకోనే బాధ్యత ఉంది.
హట్టాత్తుగా ఒక రోజు పొద్దున్నే 6 గంటలకు, రాము ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు రూల్స్ గట్టిగా అమలు చేస్తున్నారు జాగ్రత్త గా ఉండండి అని. వారు నవ్వారు, ఇలాంటివి చాలా చూసాము అని.
తెల్లారి పేపర్లో వార్త, 200(అంత కన్నా పెద్ద నంబర్ ఉండొచ్చు) స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు అని, అందులో నూ తెలుగు వాళ్ళే ఎక్కువని. ఆ యూనివర్సిటీ ఫేక్ అని పొలీసు లతో పెట్టబడింది అని. ఇద్దరు కంగారు పడ్డారు, ఇండియా నుంచి మరియు స్నేహితుల నుంచి ఫోన్ ల మీద ఫోన్ లు. ఏమి జవాబు చెప్పాలో తెలీదు.
ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి గిర్రున తిరిగింది. అటు చుట్టాల మాటలు, చేసిన అప్పు, భవిష్యత్తు అన్ని గుర్తుకు వచ్చి యెమి చేయాలో తెలీని పరిస్తితి. అక్రమం గా ఉన్నవారు, ఫిబ్రవరి 5(2019) కల్లా, వెళ్ళి పోవాలి అని ఎప్పుడో 6 నెలల క్రితం వచ్చిన వార్తను ఫ్రెండ్ పంపాడు.
గోపి, భయపడి వెంటనే, ఇండియా టికెట్ కొని విమానం ఎక్కాడు తిరుగు ప్రయాణానికి. బతికుంటే బలుసాకు తినొచ్చని, ఇంక ఈ బాధలు భరించలేను అని. జైలు లో పెడితే నరకము, ఇంక 3 లేదా 10 ఏళ్ళ దాకా రానివ్వరని తెలుసు. అదే వారు చెప్పినట్టు ముందుగా వెళ్ళిపోతే, మరలా వచ్చే అవకాశము ఉంటుంది అని. కానీ సోము, ఇంకా మొండి గా, అలాగే కూర్చున్నాడు, ఏమి జరుగుతుందో చూద్దాము అని. వేరే దారీ తెలీదు.
అమెరికా లోనే కాదు ఇండియా లో నైనా, విదేశాలలో ఎక్కడైనా తెలిసి చేరినా, తెలియాక చేరినా, ఇబ్బంది పడేది మనమే. అందుకే నమ్మకము ఉన్న వాళ్ళని సంప్రదించి, ముందు వెనుక ఆలోచించి, స్టూడెంట్ సామర్ధ్యము ను బట్టి, డబ్బు ఖర్చు పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి. లేకపొతే చివరికి నష్టము, కష్టము, కన్నీళ్ళు.
ముందు మనము క్లాసులు జరగవు అది చెత్త కాలేజి అని తెలిసి, చెప్పేవారు ఉండరని తెలిసి, హాజరు లేకుండా , కేవలము ఉద్యోగం కోసం రావడం తప్పు. అది నేరము అని ప్రతి విద్యార్దికి ముందే తెలుసు.
అలాగే చదువు అయ్యాక ఉద్యోగం రాకపోతే, వెంటనే తిరిగి వెళ్ళి పోవాలని కూడా తెలుసు. ప్రభుత్వాన్ని మాయ చేసి ఇక్కడే ఉంటే, ఏమి జరుగుతుందో కూడా ప్రతి విద్యార్దికి తెలుసు. ఇందులో అమెరికాను లేదా పొలీసులను తప్పు పట్టాల్సిన పని లేదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పొలీసులు స్టింగ్ ఆపరేషన్ చెయ్యడం తప్పా? లేక, మన పిల్లాడు తప్పు దోవలో తెలిసీ వెళ్ళడం తప్పా? ఆలోచన చెయ్యాలి.
6 నెలల ముందే చెప్పారు, వెళ్ళిపోండి అని మర్యాదగా, కాని మన వాళ్ళు కదల లేదు. ఎందుకంటే అది సహజము, ఎవరం కూడా వెనక్కి రావడానికి ఇష్టపడము. మరి దాని పర్యవసనాలు ఎదుర్కొనాలి. అమెరికా వాళ్ళను తిడితే ఎలా, మనము తప్పు తెలిసీ వచ్చాము.
ఇకనైనా మనము జాగ్రత్త పడదాము. ఎందుకంటే, ఇబ్బంది పడేది మన పిల్లలే.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,490,390; 104 తత్వాలు (Tatvaalu) and views 267,103
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments