జన్మాష్టమి - క్రిష్ణ తత్వం? కృష్ణం కలయ సఖి, యమునా తటిలో నల్లనయ్య, గోవింద కృష్ణ జై, భజరె నంద గోపాల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1537 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1572 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*కృష్ణ జన్మాష్టమి - క్రిష్ణ తత్వం మనసారా? కృష్ణం కలయ సఖి, యమునా తటిలో నల్లనయ్య, గోవింద కృష్ణ జై గోపాల, భజరె నంద గోపాల*

గురువులకు క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు. క్రిష్ణ తత్వం మనసారా అనుభవములో ఆచరణలో పాటిస్తున్నామా? అందరమూ ఒకసారి, మన మనస్సునే ప్రశ్నించుకోవాలి. పూజలు పునస్కారాలు భాగవతము క్రిష్ణుని గురించి, మనలో చాలా మంది అనర్గళముగా మాట్లాడగలము. మాట్లాడితే ఓ 100 నమో క్రిష్ణ జై క్రిష్ణ అని సందేశాలు పెట్టగలము. ఇంకొంత మందిమి గంటల ధ్యానం/ పూజ చేయగలము.

కానీ, మనసు నియంత్రణ చేయలేము. అరిషడ్వర్గాల బానిసత్వం తప్పుకోలేము. క్రిష్ణుని మదిలో నింపి, ఆయన అడుగు జాడలలో నడవలేము? అప్పుడు అన్ని ప్రయత్నాల సాధనల ప్రయోజనం శూన్యం. ఎందుకంటారు? కేవలం చిత్తశుద్ది/ త్రికరణ శుద్ది లేకనే.

భగవద్గీత అర్ధము చేసుకుని ఆచరిస్తే, మరి క్రిష్ణుడు మనలోనే ఉన్నాడు, మరి మన ఇంట్లో మనశ్శాంతి ఏది? సమస్యలను ఎదుర్కునే, ఎక్కడైనా ఎవరిదగ్గరైనా నిజం మాట్లాడే, ధైర్యం ఏది? ఆత్మ పరమాత్ర మనమే అయినప్పుడు, దేనికోసం ఈ పరుగులు?

ఒకరు అంటారు ప్రతి నెలా, యాత్రకు వెళ్ళి దేవుని కళ్ళు నిండా దర్శించనిదే, శాంతి ఉండదు అంటారు. సరే 30 ఏళ్ళు దాకా తిరిగారు. మరి తర్వాత? పోనీ 60 ఏళ్ళు తిరిగారు తర్వాత? చేతులు కాళ్ళు కదలక, మూలన ఉంటారు. ఇదేనా దేవుని నుంచి నేర్చుకున్నది? అంటే 60 ఏళ్ళు దేవుడు బయట ఎక్కడో ఉన్నారనే, బలాదూరు గా తిరిగారా, వందలు ఖర్చు పెట్టి? ఇంక 100 జన్మలు ఎత్తినా, క్రిష్ణ తత్వం అర్ధం అవుతుందా? మది కి ఎక్కుతుందా?

దేవుడికి దేవాలయానికి తీర్ధ యాత్ర స్థలానికి, విలువ మహిమ ఉంది. మరి అది అందుకునే అర్హత, మనము ఎప్పుడు సంపాదిస్తాము? 30 ఏళ్ళ కా, 60 ఏళ్ళ కా, 100 వ జన్మకా?

మాకు త్రికరణ శుద్ది, ఉంది అంటారా? మరి మన స్నేహితులతో బంధువులతో, వీటికి జవాబులు పంచుకోండి - ఈ సద్ గుణాలు మనకు ఉన్నాయా? ఇదే మానసిక నైవేద్యం

1. దుష్టులకు తప్పుడు మార్గములో వెళ్ళే వారికి దూరముగా ఉండాలి ఎప్పుడూ, వారిని ప్రోత్సహించకూడదు, పాపం పెంచకూడదు - క్రిష్ణుడు ఎప్పుడూ అరిషడ్వర్గాల బానిసలైన కౌరవులతో కలసి తిరగలేదు. మరి మనం?

2. క్రిష్ణుడు, అసలు సంబందము లేని, అన్న దమ్ముల ఆస్తుల గొడవకు, రాయబారిగా వెళ్ళి నానా మాటలు పడ్డారు - మరి మనము ఇతరుల బాధవిని, ఓదార్చి, సరిచేసే ప్రయత్నం చేసామా, స్వార్ధం లేకుండా, ఏమీ ఆశించకుండా? అసలు ఇతరులకు బిజీ అనకుండా, మనకు అవసరం లేని వారితో, నెలకి ఒక్కసారైనా ఫోన్ లో పలుకుతామా?

3. భీకర యుద్దం జరుగుతుంటే, తాను సేవకుడై, రధసారధి అయి అర్జుని రధాన్ని తోలారు. తన ప్రాణాలనే పణము గా పెట్టారు - మరి మనము ఇలా ప్రాణాలకు తెగించి లేదా ధనము నష్టపోయి, లేదా ఏదైనా త్యాగముతో, ఎవరికైనా సహాయము చేసామా, నిస్వార్ధముగా?

4. తప్పుడు దోవలో వెళుతున్న, సొంత కొడుకు సాంబుడనే, దూరం గా పెట్టారు. అతని పతనాన్ని కూడా ఆపలేదు - మరి మనము నీతికి నియమానికి కట్టుబడి, తప్పుడు వారైన పిల్లలకు, తప్పులు చెప్పి, సరి చేసామా? వినకపోతే దూరముగా పెట్టామా?

5. అన్ని పోగొట్టుకున్న బలహీనులైన పంచ పాడవులకు, అడిగినప్పుడు మరియు అడగనప్పుడు కూడా సాయము చేసాడు - మరి మనము మన చుట్టు ఉన్నవారికి ఎల్లవేళలా అలా సాయము చేస్తున్నామా, నిస్వార్ధముగా? కనీసం మాట సాయం?

6. ఐశ్వర్యవంతులు, అధికార మదాంధులకు దూరముగా ఉన్నారు. కష్టాలు కన్నీళ్ళు బీదవారికి బలహీనులకు దగ్గరగా ఉన్నారు - మరి మనము ఎవరి వైపు ఉన్నాము?

7. కపటము లేకుండా, ఋజు మార్గములో ప్రయాణం చేస్తూ, మాట, చేష్టలు, నీతి నియమాలు, సంస్కారం తప్పకుండా ప్రవర్తించారు ఆయన - మరి మనము అలా ఉన్నామా? కనీసం 30 ఏళ్ళ వయసు తర్వాత?

8. బీదవాడైన కుచేలుని కాళ్ళు కడిగి, కావలసిన సహాయం చేసి, గౌరవించారు - మనము అలా చేస్తున్నామా? కనీసం సొంత ఇంటి ముదుసలి తల్లి దండ్రి/ అత్త మామ ని ఇంట్లో పెట్టామా?

9. రాచరికము లో పుట్టి కూడా, మామూలు పేద వారింట్లో (రాజులతో పోలిస్తే) పెరిగి, గోవులు కాశారు - మరి మనం కనీసం వారానికి 2 రోజులు ఇంట్లో చాప పై పడుకుంటూ, శాఖాహారం తింటూ, ఒంటి అలంకారాల ఆభరణాల ఆడంబరాల మోహము లేకుండా, సహజముగా సౌకర్యాలు లేకుండా, ఉండగలమా?

10. ఆయన చిటికెన వేలుతో కొండను మోసారు - మనము కనీసం అప్పు లేకుండా కుటుంబాన్ని మోయగలమా? పిల్లలకు సంస్కారం నేర్పగలమా? మనసు పరుగులు ఆపగలమా? అరిషడ్వర్గాల బానిసత్వం తెంపగలమా?

ఇలాంటి ఎన్నో గుణాలను, చెప్పుకుంటూ పోవచ్చు. మరి 30 ఏళ్ళ వయసు తర్వాత అయినా, ఈ మంచి లక్షణాలకు ఆచరిస్తూ, మనమే క్రిష్ణుని లా మారే ప్రయత్నం చేయగలమా? మానవ సేవ యే, మాధవ సేవ అని ఆయన చేసి చూపారు. మరి మనము ఎప్పుడు మొదలు పెడతాము?

ఎవరితో మొదలు పెడదాము? ముందు ఇంటి ముదుసలి అమ్మా నాన్న తో? స్నేహితులు, బంధువులతో? రేపు మనది కాదు, నేడే నిజం, సమయము లేదు మిత్రమా, మన నిస్వార్ధ మంచి పనికి.

ఆ దేవ దేవుని స్మరిస్తూ, కొన్న భక్తి గీతాలు పాడుకుందామా, ప్రయత్నం చేసి, స్నేహితులకు పంపుతారు కదూ, వారిని ప్రోత్సహిస్తూ . . .

1) కృష్ణం కలయ సఖి.. సుందరం, బా.ల కృష్ణం, కలయ సఖి.. సుందరం
కృష్ణం గత విషయ, తృష్ణం ...2 జగత్ప్రభ,
విష్ణుం., సురారిగణ జిష్ణుం.
సదా. బాల కృష్ణం, కలయ సఖి.. సుందరం.

శృంగా.ర రస భర, సంగీ.త సా.హిత్య 2
గంగా.ల హరికేళ, సంగం,
సదా. బాల కృష్ణం, కలయ సఖి.. సుందరం.
బా.ల కృష్ణం కలయ సఖి.. సుందరం

రాధా. రుణాధర, సుతా.పం సచ్చిదానంద 2
రూపం జగత్రయ, భూపం,
సదా. బాల కృష్ణం, కలయ సఖి.. సుందరం.
బా.ల కృష్ణం కలయ సఖి.. సుందరం

అర్థం శిధిలీ కృతా, నర్ధం శ్రీ నారాయణ 2
తీర్థం పరమ, పురుషా.ర్థం,
సదా. బాల కృష్ణం, కలయ సఖి.. సుందరం.
బా.ల కృష్ణం కలయ సఖి.. సుందరం

Krishnam Kala Sakhi, Pelli Pustakam, Singers : S.P. Sailaja, Rajeswari, Actors - Divyavani, Sindhuja, Rajendra Prasad
పెళ్లి పుస్తకం, గాయకులు : S.P. శైలజ, రాజేశ్వరి, నటీనటులు - దివ్యవాణి, సింధూజ, రాజేంద్ర ప్రసాద్

2) యమునా తటిలో, నల్లనయ్యకై, ఎదురు చూసెనే, రా.ధా
ప్రేమ పొంగులా., పసిడి వన్నెలే, వాడిపోయెనూ,కా.దా

రేయి గడిచెనూ, పగలు గడిచెనూ, మాధవుండు రా.లే.దే..
రాసలీలలా, రాజు రానిదే, రాగబందమే లే.దే

యదుకుమారుడే లేని వేళలో.., వెతలు రగిలేనే రాధ గుండెల్లో.. 2
పా.పం రా..ధా.

యమునా తటిలో, నల్లనయ్యకై, ఎదురు చూసెనే, రా.ధా
ప్రేమ పొంగులా., పసిడి వన్నెలే, వాడిపోయెనూ,కా.దా

Actor : Mammooty / మమ్ముట్టి , Rajinikanth / రజనీకాంత్ ,
Actress : Bhanupriya / భాను ప్రియ , Sobhana / శోభన ,
Music Director : Ilayaraja / ఇళయరాజా , Lyrics Writer : Kulashekar / కులశేఖర్ , Singer : Swarnalatha / స్వర్ణలత, Dalapathi దళపతి


3) గో.వింద కృష్ణ జై, గో.పాల కృష్ణ జై
గోపాల బాల, బాల బాల, రా.ధ కృష్ణ జై (2)
కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, రామ కృష్ణ జై..

రంగ రంగా, నువ్వూ ఒక దొంగ,
ఇంటి దొంగ.., చిలిపిచంటి దొంగ,
చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ
వెతికి వెన్నలెన్నో, మింగినావు అవలీలగా..రంగ రంగా..,
రంగ రంగా, నువ్వూ ఒక దొంగ, రంగ రంగా .. ..

ఉట్టిపాల చట్టి, పట్టి తూటు కొట్టి, నోట పెట్టి నట్టి, చంటి దొంగ, రంగ రంగా..
చీరకొంగు పట్టి, సిగ్గు కొల్లగొట్టి, గుట్టు బయట పెట్టి, శుబ్బరంగా రంగ రంగా..
గోకులాన ఆ.డినావు, నాడే. రాసలీల,
ఇప్పుడీ గోల, ఇలా నీలా ఎలా, గోపాల బాల, రంగా..., రంగ రంగా..
రంగ రంగా, నువ్వూ ఒక దొంగ, కృష్ణుడల్లే దోచుకున్న దొంగ..

గోపికామా.ల హారి ప్యారి, మాయ మీర వన విహారి
మదన మోహన, మురళీ ధారి కృష్ణ జై (2)
కృష్ణ జై, రామా కృష్ణ జై, రాధా కృష్ణ జై, రామ కృష్ణ కృష్ణ కృష్ణ జై

పల్లె భామతెచ్చే, చల్లకుండలన్నీ, చిల్లుకొట్టి తాగు,దారి దొంగ, రంగ రంగా..
కాలనాగుపడగ, కాలుకింద నలగ, కధముతొక్కినావు, తాండవంగ, రంగ రంగా..
వేణువూది కాసినావు, ఆవుమందలెన్నో, అల్లరే, ఇంటా వంటా,
నీ తోటి జంటా, తెచ్చేను తంటా, రంగా.. రంగ రంగా..

గో.వింద కృష్ణ జై, గో.పాల కృష్ణ జై
గోపాల బాల, బాల బాల, రాధకృష్ణ జై (2)
కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, రామ కృష్ణ జై..

Song: Govindha Krishna Jai, Movie: Paandurangadu, Music: M.M.Keeravani, Singer: S.P.Balasubrahmanyam, Lyrics: Veturi, Balakrishna, Sneha, Suhasini, Tabu, Veda Song Lyrics
పాట: గోవింద కృష్ణ జై, చిత్రం: పాండురంగడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం: వేటూరి, బాలకృష్ణ, స్నేహ, సుహాసిని, టబు, వేద

4) భజరె నంద గోపా.ల హరె, భజరె నంద గోపా.ల హరె 2

మురళి, గాన లోల, దూరమేల, దిగి రా, కృష్ణ
కడలై, పొంగుతున్న, ప్రేమ నీల, కద రా, కృష్ణ
అందుకొ, సంబారల, స్వాగాతాల, మాలిక
ఇదుగో, నిన్ను చూసి, వెలుగుతున్న, ద్వారకా
భజరె నంద గోపా.ల హరె, భజరె నంద గోపా.ల హరె 2

మా ఎద మాటున, దాగిన ఆశలు, వెన్నెల విందనుకొ
మా కన్నులు కందనీ, మాయని చూపుతో, మెల్లగ దొచుకుపో
గిరినె, వేలి పైన, నిలిపిన మా కన్నయ్య
తులసి, దళనికే, ఏల తూగినావయ్యా
కొండంత భారం, గోరంత చూపిన, లీల కృష్ణయ్య
మా చీరలు దొచిన, అల్లరి ఆటలు, మా పైన ఏ మాయా ...
భజరె బజరె బజరె , భజ….. భజ
భజరె నంద గోపాల హరె, భజరె నంద గోపాల హరె 2

మాయది కావని, మాధవడా అని, చేరిన ప్రాణమిది
మా మాయని బాదని, పిల్లన గ్రోవిలా, రాగం చెయెమని
ఎవరిని, ఎవరితోటి, ముడి పెడుతూ,నీ ఆట
చివరికి, ప్రతి ఒకరిని, నడిపెదవు, నీ బాట
తీరని వేదన, తియ్యని లాలన, అన్ని నీవ్వయ్యా
నీ అందెల, మువ్వల సవ్వడి, గుండెలొ మోగించి రావయ్య
భజరె నంద గోపాల హరె, భజరె నంద గోపాల హరె 2

Bhajare Nanda Gopala, Movie: Dwaraka, Cast: Pooja Jhaveri ,Vijay Deverakonda
భజరే నంద గోపాల, చిత్రం: ద్వారక, తారాగణం: పూజా ఝవేరి, విజయ్ దేవరకొండ

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1572 General Articles, 54 Tatvaalu
Dt : 18-Aug-2022, Upd Dt : 18-Aug-2022, Category : Songs
Views : 235 ( + More Social Media views ), Id : 1498 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : janmashtami , tatvam , krishnam , kalaya , sakhi , yamuna , tatiloa , nallanayya , govinda , jai , gopala , bhajare , nanda
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content