జగన్ గారి అందరికీ సమాచార ఆశయము, పోలీసు వ్యవస్థలో కనీసం మండల స్థాయికి చేరితే నెరవేరినట్టే - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1161 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1190 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారు, ఏ సమాచారము మరియు ఏ పని అయినా, ప్రతి కుటుంబానికి వెంటనే చేరాలన్న సదుద్దేశముతో, ప్రతి 20 మందికి ఒక గ్రామ వాలంటీర్ ను నియమించారు. కొన్ని చోట్ల, ఆ అంకె సంఖ్య మారవచ్చు. ప్రారంభములో, ఏ వ్యవస్థలో అయినా కొన్ని తప్పులు జరగవచ్చు, సరి చేసుకుని ముందుకు పోవాలి.

అది అద్భుతమైన ప్రయోగం, సమాచార పరంపర కు, ప్రపంచములో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదు అని అంటున్నారు. ప్రతి కుటుంబానికి వెను వెంటనే సమాచారం చేరుతుంది, అంతా అనుకున్నట్టు గా, సక్రమంగా పనిచేస్తే.

జగన్ గారు ఎంతో నమ్మకం తో, తన పోలీసు టీం ను ఎంచుకున్నారు, తన ఆలోచనల ను కార్యరూపం లో చూపిస్తారు, అనే ఆత్మ విశ్వాసం తో.

ఆయన అడుగు జాడలు లో, ఆశయాల తో నడిచే మన పోలీసు సోదరులు, కనీసం ప్రతి గ్రామానికి, పోనీ ప్రతి పట్టణానికి, పోనీ కనీసం ప్రతి మండలానికి అయినా, ఒక వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజీ, ఉంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

ఈ కరొనా రక్కసి విలయ తాండవము చేసే సమయములో, అది ప్రజలకు ఎంతో ఉపయోగము గా ఉంటుంది. మన మండలములో/ పట్టణములో ఎన్ని గంటలకు మార్కెట్ తెరుస్తారు? ఎక్కడ పోలీసు బందో బస్తు ఉంది? ఎక్కడ జనము ఎక్కువ గా తిరుగుతున్నారు?

దోపిడి ఎక్కడ జరిగింది? మన ఊరు జనము ఏమి తప్పు చేస్తున్నారు? మన హీరోలు అయిన పోలీసులు, ఈ రోజు ఎలా ఎవరిని రక్షించారు? ఈ రోజు పోలీసుల కొత్త నిబంధన ఏమిటి, లేదా సడలింపు ఏమిటి? ఎవరు మన కొత్త ఎస్సై/ సీఐ/ డీఎస్పీ అని అందరికీ తేలికగా చేరుతుంది సమాచారము. ఫేస్బుక్ లో ఆటొమాటిక్ గా మెస్సేజ్ వస్తుంది.

నిధులు లేవు, టెక్నాలజీ వ్యక్తులు లేరు అందామా? అందుకోసం వాయిదా వేద్దామా? అది పూర్తి మండల వెబ్సైట్ విషయంలో కరెక్ట్ కావొచ్చును. కానీ మండల/ పట్టణ ఫేస్బుక్ పేజీ ఉచితం గా సిద్ధము చేయవచ్చును.

ఇప్పుడు ప్రతి హెడ్, ఎస్సై, సీఐ, డీజీపీ గార్లు స్మార్ట్ సెల్ ఫోన్ లు కలిగి ఉన్నారు. వారే ఫోటోలు తీసి అప్లోడ్ చేయవచ్చును. ఇంట్లో లేదా బయట చదివే పిల్లల ను అడిగినా లేదా వాలంటీర్ సహాయము తీసుకున్నా, ఫేస్బుక్ అప్డేట్స్ ఎలా చేయాలో చెపుతారు, అది చాలా తేలిక పని. న్యూస్ పేపర్ కటింగ్ లు కూడా అప్లోడ్ చేయవచ్చును. మండల జనం కూడా ఆనందముతో, కొన్ని ఫోటోలు వీడియోలు పంపుతారు.

కనీసం గ్రామ, పట్టణ లేదా మండల లెవల్లో పేజీలు ఎందుకు ఉండాలి?

ఎందుకంటే, లోకల్ పోలీసుల త్యాగాలు, చర్యలు, సేవలు, రక్షణ గురించి, తమ మండల ప్రజలకు చేరాలి వెను వెంటనే ఆటొమాటిక్ గా, బయట మీడియా సహాయము లేకుండానే. లోకల్ పోలీసుల గొప్పతనం, ప్రజల హృదయాలు ను గెలవాలి.

కనీసం తమ పోలీసు స్టేషన్ ఎస్సై ఎవరు ఇప్పుడు అంటే, తెలియని జనం చాలా మంది ఉన్నారు. పోలీసులు అంటే భయపడే జనం కూడా ఉన్నారు. పోలీసు మన మిత్రుడు, మన రక్షకుడు అన్న భావన మన పట్టణ, గ్రామ ప్రజల హ్రుదయాల లో నిండిపోవాలి.

పోలీసు జనం కు దగ్గర అయితే లాభం ఏమిటి?

చాలా లాభాలు ఉన్నాయి. మన ఇంట్లో పోలీసు ఉంటే, మంచి చెడు చెప్పుకుంటాము కదా ధైర్యముగా. అలాగే, జనం నిర్భయంగా సమస్యలు పంచుకుంటారు. కొన్ని చిక్కు కేసులలో, జనం క్లూలు కూడా ఇస్తారు. తేలికగా పరిష్కారం అవుతాయి చాలా సమస్యలు, కేసులు, మండల లేదా పట్టణ ప్రజల భాగస్వామ్యముతో.

విదేశాల్లో పోలీసు ప్రజల సంబంధం ఎలా ఉంది?

విదేశాల్లో పోలీసులు జనం తో బాగా కలసి పోతారు. చాలా మర్యాదగా మాట్లాడుతారు సామాన్య జనముతో. పోలీసులకు ప్రాణ హాని లేనంత వరకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. జనం టాక్స్ ల తో జీతాలు వస్తున్నాయి, అని వారికి తెలుసు.

సంవత్సరం కు ఒకటి రెండు సార్లు, ప్రతి పేటలో చిన్న పార్టీ పెట్టి, ఆ బజారు లేదా పేట జనాన్ని ఆహ్వానిస్తారు. సరదాగా మాట్లాడుతారు, ప్రజలకు టీ బిస్కెట్ లు అందిస్తారు. ప్రజలు అడిగే అన్ని ప్రశ్నలకు, ఓపికగా జవాబులు చెపుతారు. నెలకి రెండు సార్లు, కాఫీ విత్ కాప్ అని, చిన్న రెస్టారెంట్ లో కలుస్తారు. ప్రజలతో మమేకం అవుతారు.

ప్రతి పోలీసుతో బాడీ కెమేరా ఉంటుంది, పౌరుడితో మాట్లాడే మరియు వ్యవహరించే తీరు అన్ని రికార్డ్ అవుతాయి. పై అధికారులు వాటిని చూస్తారు అన్న భయము ఉంటుంది. అలాగే, ప్రజలు కూడా వీడియోలు, ఫోటోలు తీసి ఆన్లైన్లో అందరికీ షేర్ చేస్తారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1190 General Articles, 47 Tatvaalu
Dt : 29-Mar-2020, Upd Dt : 29-Mar-2020, Category : Request
Views : 324 ( + More Social Media views ), Id : 455 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , Mandal Police info , Mandal facebook page , District , Andhra Pradesh , DGP , SP , DSP , CI
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content