APLatestNews.com top Banner

Social Media links
జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ, జిల్లా లేదా శాఖ లేకుండానే అస్సెంబ్లీ నాయకులు సంతకం చేసారా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

పేపరు వార్తలో ఎర్ర భాగం చదవండి ఫోటోలో - కోన గారు, పార్లమెంటు పరిధిలోని అధికార, ప్రతిపక్ష శాసన సభ్యుల ద్వారా కూడా, బాపట్ల ను భావపురి జిల్లా గా, చేసేందుకు ఒప్పించి, అందరితో సంతకాలు చేయించి, ముఖ్యమంత్రి కి సమర్పించారు.

వార్త, అర్థం అయిందా? నిజమే అనుకోవాలి కదా? ఇందులో కోన గారిని తప్పు పట్టాల్సిన పని లేదు, బాపట్ల కు తను మంచి చేస్తున్నారు‌, తన ఇమేజ్ అక్కడ పెంచుకుంటూ. శభాష్ అని వారి మీద, ఆర్టికల్ కూడా రాశాము విలేఖరి గా.

మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, మన మిగతా అసెంబ్లీ నియోజకవర్గ, తమ సొంత ప్రజలను మాయచేసే, ఇలాంటి సంతకాలు చేసే, మన నాయక స్వార్థ బుద్దావతారాల గురించి. కోనా గారిని చూసి కూడా, బుద్ది తెచ్చుకోరా? ఆయన చేసినట్లుగా మేము అభివ్రుద్ది చేయాలి, మా ప్రాంతాన్ని అని?

అన్నా, ఎటూ పార్లమెంటు కింద ఆటోమేటిక్ గా మీది జిల్లా కిందకే వస్తుంది, మీకెందుకు తొందర, మేము కదా పరుగులు తీయాల్సింది అని అనలేదా? జనం, మమ్మల్ని ఊస్తారు చాతగాని దద్దమ్మలు గా, అసెంబ్లీ పరిధిలో ఏమి చేసావు, కొత్తగా ఏమి తెచ్చావు అని? రేపు ఏ మొఖం పెట్టుకుని, ఓట్లు అడుగుతాము. సంతకం పెట్టలేము, ధర్నా చేసి, పేరు సంపాదిస్తాము అనలేదా?

సంతకాలు కావాలసింది మాకు కదా, మా చీరాల పేరు పెట్టి, మాకూ కొన్ని జిల్లా శాఖలు ఇవ్వమని అడగడానికి, ఇన్నాళ్ళు చీరాలకు ఆన్యాయం జరిగింది, అని మన చీరాల నాయకులు అనలేదా? చీరాల జిల్లా సాధన జేయేసీ అని కొత్తగా నిన్న సమావేశం జరిగింది అంట, మరి వారికి ఇది తెలుసా, ఫోటో చూడండి? మనం ఇవే విన్నపాలు 6 నెలలుగా మంత్రులు, కలెక్టర్ లు, ఎమ్మెల్యే లు, ఎంపీలు కు పంపుతుంది తెలుసా వారికి?

ఇలా సంతకాలు చేయడం, జిల్లా మంత్రులు మరియు పార్టీ పెద్దలు బాలినేని, విజయ సాయి, సురెష్, వైవీ లకు చిన్నతనము కాదా?

అలాగే అద్దంకి, వేమూరు, పర్చూరు, రేపల్లె మరియు మిగతా నాయకులు, మా పరిధిలో కి ఏ జిల్లా శాఖ వస్తుంది, జగనన్న 3 రాజధానుల ప్రక్రియ అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా, అని అడగకుండానే, పసి పిల్లలు లా సంతకం చేసారా? అవ్వ. అందరూ కలసి, తమ నియోజకవర్గ జనం కు తెల్లటోపీ పెడుతున్నారు కదూ, అని ప్రజలు విస్తుపోతున్నారు.


ఆంధ్రరత్న దుగ్గిరాల, స్వాతంత్ర్య చీరాల పేరాల పన్ను నిరాకరణ ఉద్యమ, పాల సముద్ర తీర క్షీరపురి, వస్త్ర సామ్రాజ్య ఆదాయ చినబొంబాయి, టంగుటూరి ప్రకాశం జిల్లా రెండో పెద్ద పట్టణం, చీరాల చుట్టు మండలాల ప్రజలు ఆశగా 1980 నుంచి, ఇవి తెచ్చే చేవ, కృతజ్ఞతలు, ధైర్యం, పట్టుదల, ఆత్మాభిమానం, ఉన్న ఉత్తముడు కోసం, ఎదురు చూస్తూనే ఉన్నారు.

జగనన్న రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా 3 రాజధానులు, అలాగే కొత్త జిల్లా లో వికేంద్రీకరణ భాగంగా, మీ వివిధ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కి, జిల్లా ఆసుపత్రి, జిల్లా కోర్టు, జిల్లా ఇతర శాఖలు, జిల్లా పోలీసు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు రావాలి. మరి తెచ్చే చేవ గల వారు ఎవరు? జిల్లా కేంద్రం కు అవే వస్తాయి, కానీ మిగతా వారు, అడిగితే నే రావచ్చు.

దయచేసి మీ ఊరి కోసము కూడా ఇలాంటివి - 1. చీరాల జిల్లా, 2. చీరాల పార్లమెంటు, 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, 4. బడుగు నేతన్నల చేనేత పార్కు, 5. అభివృద్ధి తో స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్, 7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : General
Views : 78 ( + More Social Media views ), Id : 806 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , decentralized , development , signed , chirala , parchur , addanki , repalle , vemuru , assembly leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content