ఆనందయ్య మందుకు జగనన్న మరియు కోర్టు అనుమతి, అమాయకపు ప్రశ్నలు, సర్టిఫికేట్ లేని నాయనమ్మ - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కొవిడ్ వచ్చిన వారు రాకుండా, బంధువులు
* ఆన్లైన్ లో కూడా
* సోషల్ మీడియా లో ప్రశ్నలు, జవాబు?
* మేధావులు నాయకులు అధికారులు కోర్టులు
* మన పెద్దల వైద్యం
2 min read time.

ఎట్టకేలకు జగనన్న అలాగే కోర్టు కూడా, ఆనందయ్య గారి మందుకు అనుమతులు ఇచ్చారు, కంటి మందుకు తప్ప అంటున్నారు. బత్తిన సోదరుల చేప మందుకు లాగనే, ఇక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలి.

కొవిడ్ వచ్చిన వారు రాకుండా, బంధువులు వచ్చి తీసుకుంటే మంచిది అని చెపుతున్నారు. ఆన్లైన్ లో కూడా ఇస్తారు అంటున్నారు, దూర ప్రాంతాల వారికి.

నాయకులు మరియు అధికారులు, ఆనందయ్య గారి మందును తయారు చేయించుకుని, వారికి, వారి కుటుంబాలకు, బంధు మిత్రులకు నిర్విఘ్నంగా వాడుకుంటున్నారట, అని పుకార్లు వచ్చాయి.

అది నిజమే అయితే, నిబంధనల పేర, సామాన్య పేదలకు ప్రజలకు మాత్రమే ఆపిన పాపం, వారిని వదలదు, మందు వారికి అవసరానికి ఉపయోగపడదు.

ఆనందయ్య గారి, కరోనా మందు పంపిణీ లో ఒకటి ఆలోచించాలి - అన్ని కరోనా కిట్స్ వేసుకొని, రకరకాల మాస్కులు, శానిటేషన్తో పనిచేసే డాక్టర్లు, కరోనా తో చనిపోయారు అని విన్నాం.

కానీ ఆనందయ్య మరియు ఆయన శిష్యులు, కనీసం మాస్కులు కూడా లేకుండా, కరోనా రోగులకు మందులు ఇస్తున్నారు. ఆశ్చర్యం కదూ. వారూ ముందు జాగ్రత్త గా మాస్కులు వాడాలి.

*** సోషల్ మీడియా లో తిరుగుతూ ఉన్న అమాయకపు ప్రశ్నలు, ఎవరన్నా జవాబు చెప్పగలరా?

* ఫేర్ అండ్ లవ్లీ క్రీం వాడితే, ఎవరి ముఖం తెల్లగా కాలే

* కోల్గేట్ పేస్టు వాడితే ఎవరి పళ్ళు తళ తళ మెరసి పోలే

* క్లోజప్ పేస్టు వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలే

* ఏ బ్రాండ్ తల నూనె వాడినా, జుట్టు నల్లగా కాలే

* ఏ కూల్ డ్రింక్ తాగినా, ఉరిమే ఉత్సాహం రాలే

* బూస్ట్ తాగితే బలం రాలే, సెరిలాక్ తింటే చలాకీదనం రాలే

* కాంప్లెన్ తాగితే పొడుగు పెరగలే

* రిఫైండ్ ఆయిల్ వాడితే, గుండె జబ్బులు తగ్గలే

* అయోడైజ్డ్ ఉప్పు వాడితే, ధైరాయిడ్ సమస్యలు పోలే

* ఆర్వో లేదా ఫిల్టర్ వాటర్ తాగితే ఆరోగ్యాలు బాగుపడలే

* ఏ అల్లోపతి మందు వాడినా, సైడ్ ఎఫెక్ట్ లు ఎన్ని ఉన్నా, అవి పనిచేయక పోయిన కూడా దిక్కు లేదు

* ఆల్కాహాల్, సిగరెట్టు హానికరము అని చెపుతూనే, అమ్ముతున్నారు కదా?

కోట్ల మందుల మరియు ఆసుపత్రుల వ్యాపారం జరుగుతున్న కూడా, జనం మోసపోయిన కూడా, అయినా ఎవరినీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరు అడగరు కదూ?

మేధావులు నాయకులు అధికారులు కోర్టులు లోకాయుక్త సుమోటొ గా కేసులు వేయరు. శాస్త్రీయంగా నిరూపితం అయిన దాకా, అమ్మకాలు ఆపమనరు?

కానీ నెల్లూరు ఆనందయ్య గారి, ఉచితంగా ఇచ్చిన పసరు ఆయుర్వేద ప్రసాద మందు మాత్రం ఖచ్చితమైన రిజల్ట్, అర్జంటుగా ఇవ్వాలని నిరూపణ జరగాలి, శాస్త్రీయము గా రుజువు కావాలి, అప్పుడే సామాన్య జనానికి పంచాలి?

ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు పెట్టిన కూడా, మనిషి పోతే, దైవాధీనం, అంతేనా? కేసులు కూడా లేవు కదూ?

మరి పై వాటికి, శాస్త్రీయ ప్రమాణాలు నిరూపణలు, ఎందుకు మేధావులు ఎవరూ అడగరు?

ప్రాపంచిక మోహం లో, మనం కొనడం కూడా, ఆగము కదూ? అంతా ప్రభుత్వమే చెయ్యాలి అని, ప్రభుత్వం ని మాత్రం విమర్శలు చేస్తాము.

*** ఇంకొకరు మన పెద్దల మీద ఎంత బాగా రాసారో చూడండి, ఇప్పటి మేధావుల తీరు ను నిరసిస్తూ : -

* నేను పుట్టినపుడు గట్టిగా గొంతు చించుకుని ఏడ్వలేదని, ఏ సర్టిఫికేట్ లేని మా నాయనమ్మ, ఏ విధమైన క్లీనికల్ ట్రయల్స్ జరపని, వస, నా గొంతులో పోసింది

* నాకు జ్వరం వస్తే, స్పృహలేని స్థితిలో ఉన్న, నా భుజంమీద, పసివాడిననే జాలికూడా లేకుండా, దీపం మీద పిన్నీసు, ఎర్రగా కాల్చి వాతపెట్టింది

* తాగిన పాలు జీర్ణం చేసుకోలేక, వాంతి చేసుకున్నానని, పొట్టమీద అడ్డంగా వాతపెట్టింది

* కడుపు నొప్పిలేస్తే, గొంతు మంట మండే, వాము పాలు పోసింది

* చెవి పోటుకు, సొరాకు పసరు పోసింది

* తేలు కుడితే, తగరవిశ ఆకుపసరు పోసి, క్షణంలో నయంచేసింది

* కామెర్లయితే, కటిక చేదైన, నేల ఉసిరి పసరు తాగించింది

* పైత్యపు దద్దులు వస్తే, అల్లపు రసం తాగించింది

* ప్రతి తొలకరి ముందు బలవంతాన, విషం లాంటి ఆముదం తాగించింది

ఇలా అశాస్ర్రీయమైన, హింసాత్మకపు పనులు, నామీద చాలా చేసింది, రూపాయి ఫలం ఆశించకుండా, నిస్వార్ధముగా. కానీ నన్ను బ్రతికించింది, ఇన్నేళ్ళ ఆయుష్షు ఇచ్చి.

కానీ నాకు, మన ఇప్పటి మీడియా రాతలు మాటలు చూశాక, ఈ మధ్యనే తెలిసింది. నన్ను ఇన్నాళ్ళు బ్రతికించిన మా నాయనమ్మ నేరస్తురాలని, ఆమె చేసిన పనికి అరెస్టుచేసి, చట్టపరంగా శిక్షించవచ్చని.

అవ్వ బాగుంది కదూ వెటకారం. అయితే ఒక్కటి ఒప్పుకోవాలి, మనము ఇంట్లో సొంతగా చేసుకునేది వేరు, బయట వారికి ఇచ్చేది వేరు. జాగ్రత్త ల తో ఉండటం మంచిది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 31-May-2021, Upd Dt : 31-May-2021, Category : Health
Views : 114 ( + More Social Media views ), Id : 1184 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , court , permission , anandayya , drug , innocent , questions , uncertified , grandmom
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content