ఏవండీ బయట నడక, గుడి ప్రదక్షణ ఒకటేనా? సాక్స్ తో, చెవి ఆడియో స్త్రోత్రం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,887; 104 తత్వాలు (Tatvaalu) and views 225,802.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జవాబు, బయట సాక్స్ బూట్లు లేదా చెప్పులు వేసుకుని సౌఖ్యముగా తిరుగుతాము. అందులో పాదాలు కంది పోవడము, బొబ్బలు కట్టడము వాయడము, పగలడము, చీలడము, చలికి వణుకు వానకి జారడం లాంటి ఇబ్బంది కష్టము ఉండవు గదా? ఇప్పుడు సుఖము చూసుకుంటే, శని రాహు కేతు దశలలో, మాడు పగులుతుంది. ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాలి.

బయట రోడ్ మీద, ఒక రాయి చూపించి, పూజించు నైవేద్యం పెట్టు అంటే మీరు పెడతారా? అంటే రోడ్ మీద రాయి వేరే, గుడిలో ఉన్న ప్రతిష్టించిన విగ్రహము వేరే అని మీకు తెలుసు. నడక కూడా అంతే కదా?

మన ఇంట్లో కూర్చొని చేసిన భోజనము, రోడ్ మీద తిన్న భోజనము ఒకటేనా? ఇంట్లో భోజనానికి ఎక్కువ విలువ ఇవ్వరా మీరు? ఆరోగ్యం కాదా?

సౌఖ్యముగా బూట్లు చెప్పులతో, బయట లేదా జిం లో, నియమము ఏమీ లేకుండా నడిచే పద్దతి అది. ఇప్పుడు కరోనా భయము కూడా.

కానీ ప్రదక్షిణ అంటే, నియమాలు ఉంటాయి, ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహము చుట్టూ తిరుగుతాము, అంటే ఆ శక్తి కిరణాలను మనము అన్ని వైపుల నుంచి అందుకుంటాము, అది ఆరోగ్యానికి మంచిది.

108 అనో లేక తక్కువ ఎక్కువలతో, ఏదో ఒక సంఖ్య అనుకుని తిరుగుతారు. ఉత్త పాదాలతో మాత్రమే తిరగాలి, సాక్స్ ఉండకూడదు. ఈ చిన్న కష్టము కూడా పడకపోతే, ఇక జీవితము లో, ముందు ముందు వచ్చే పెద్ద కష్టాలను మనము, మన పిల్లలు ఎలా ఎదుర్కొంటారు?

తిరుపతి మెట్ల దారి కష్టము కదా? మోకాళ్ళ మీద ఎక్కుతారు కొందరు. అలా సుఖానికి అలవాటు పడబట్టే, పిల్లలు ఎదిగాక, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఏమి చెయాలో తెలీక, చిన్ని చిన్ని విషయాలకే విడాకులు ప్రాణత్యాగాలు చేస్తున్నది. అయ్యప్ప మాల కష్టాలు పడితే, ఇలా మాట్లాడరు. అంటే, భవిష్యత్ లో ఏదో పెద్ద కష్టము ఎదుర్కోవాలి మరి.

ప్రదక్షిణలో, నారాయణ లేదా శివ లేదా ఇష్ట దైవ మంత్రము, నోటితో లేదా మనసులో చదువుతూ తిరగాలి. కాబట్టి, ఆడియో ఉపయోగించకూడదు. దాని వలన ఫలితము, ఆడియో కంపెనీ వారికి, దాని గాయకులకు వెళుతుంది. మన మనసుకు నోరుకి మన సొంతము గా పని కల్పించి భగవంతుని వైపు తిప్పాలి. ధ్యనము లో కూడా ఆడియో కావాలి అంటే, ఇక మనము ఎప్పటికీ ఆధ్యాత్మికముగా ఎదగము.

ఎలా లెక్కపెట్టాలి అన్నది ఇంకో మల్టి టాస్క్ ప్రశ్న. కరమాల అని చేతి వేళ్ళ గీతలు భాగాలతో 108 లెక్కపెట్టాలి. అంటే, మన మనసు ఎంత ఆధీనము లో, ఏకాగ్రతతో ఉండాలో ఆలోచన చేయండి?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,887; 104 తత్వాలు (Tatvaalu) and views 225,802
Dt : 08-Jan-2021, Upd Dt : 08-Jan-2021, Category : General
Views : 769 ( + More Social Media views ), Id : 914 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 108 , walking outside , temple pradakshina , socks , ear , audio , stotra , devotional song
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content