తానా ఎన్నికల్లో నాయకులు ధైర్యంగా, 3 సార్లు ముఖాముఖి వాదనలకు, పానెల్ సభ్యుల ఆరోగ్యం? - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1586 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* తన టీం మెంబర్ల ఆరోగ్యం
* గుట్టుగా, బానిసత్వ ఏకగ్రీవాలకు
* రాజకీయ వాసన పెత్తందారీ ముఠాలు
* గొప్ప నాయకుడు, మీడియా సైజులో
* ఎలా ఎదిగారు? గాడ్ ఫాదర్ తో?
* ఇంకో కొత్త సంఘం, కొత్త మోసం
* గోగినేని, కొడాలి సవాల్, నిరంజన్?
* పోరాడి ఓడినా వీరుడే
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

తానా ఎన్నికల్లో, మార్పులు కోసం, మరింత ప్రవాస తెలుగు బిడ్డల సేవ కోసం, నిలిచి పోరాడుతున్న కొత్త నాయకులు ధైర్యంగా, ఓ 3 సార్లు అయినా ముఖాముఖి వాదనలకు దయచేసి దిగండి. మిగతా పానెల్ సభ్యుల ఆరోగ్యం కాపాడండి, ప్రయాణాలతో కరోనా బారిన పడకుండా అని శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

అదే ఉత్తమ నాయకత్వ మొదటి లక్షణం. తన టీం మెంబర్ల ఆరోగ్యం కాపాడలేని వాడు, మిగతా తెలుగు వారిని ఎలా కాపాడతాడు, అండగా ఉంటారు?

ఎందుకంటే కొన్ని తప్పులు పొరపాట్లు, మొదటి వాదనలో జరగవచ్చు. కాబట్టి ఓ 3 దాకా ఉంటే, ముందు తప్పులు సరిచేసుకుని జవాబులు వెరిఫై చేసుకుని, మరలా కొదమ తెలుగు సింహాలులా పోరాడవచ్చు.

మిగతా సంఘాల లాగా, మనము దాంకుని లేదా చాటుగా గుట్టుగా, బానిసత్వ ఏకగ్రీవాలకు పోము, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆచరణలో పెడుతూ, మనమే ఆదర్శముగా ఉండాలి.

అమెరికా తెలుగు సంఘ ఎన్నికల, చిత్ర విచిత్రాలు గత కధనాలు లో చూసాం, మన లోకం తీరులో, లింక్ లో కొత్త మార్పులు చూడగలరు. అలాగే గోగినేని గారి, ఛాలెంజ్ లు చూడగలరు. ఆ లింకు లో పాత కధనం లో, మిగతా వీడియో లు చూడగలరు. link.

తానా గొప్ప సంస్ధ, సేవలు అద్వితీయం, అందులో సందేహం లేదు. ఆ బయట ప్రజా సేవ 50 శాతానికి దిగువన ఉండి, సొంత నాయకుల బానిస సేవ 50 శాతం పైకి దాటింది గత కొద్ది సంవత్సరాలుగా, రాజకీయ వాసనలతో పెత్తందారీ వ్యవస్థ తో, తమ ముఠాలు ను పైకి తెస్తూ అని అంటున్నారు.

మేము ముగ్గురు నాయకులు కు, నేరుగా మన కధనాలు లింకు పంపి, ముఖాముఖి వాదన గురించి, ధైర్యంగా సమాధానం వస్తుంది ఏమోనని చూసాము, చూస్తున్నాము.

కానీ ధైర్యంగా ఎవరూ నేరుగా జవాబు చెప్పలేదు, భయంతో సైలెంట్ గా ఉన్నారు. వారికి తెలిసిన ప్రజాస్వామ్యం లో చిన్న లేదా ఇతర మీడియా ను గౌరవించరు, ఇదే ఉదాహరణ కదూ. గొప్ప నీతి ఉన్న నాయకుడు, మీడియా సైజులో తేడాలు చూడరు, మాటల చేతల నిబద్దత చూస్తారు. ఎవరినైనా, ఆదరముగా పలకరిస్తారు, భేషజాలు లేకుండా. అమెరికన్ లీడర్లు, చిన్న మీడియా కు కూడా, మీడియా పాస్ ఇస్తారు, పెద్ద ఈవెంట్లు అయినా, తేడాలు చూపరు.

కానీ వారు చిన్న నాయకులు నుంచి, పెద్ద నాయకులు గా, ఎలా ఎదిగారు మరి? గాడ్ ఫాదర్ తో నే గా, అర్ధం? ఆ కష్టాలు అవమానాలు విలువ తెలిసి, మరి చిన్న మీడియా కు, గాడ్ ఫాదర్ లేకుండా లేదా బయటకు మేము చెప్పకుండా, పలకరా?

మిగతా సంఘాల ఏకగ్రీవ ఎన్నికలు కూడా, మోసం కుట్ర గుంపు ఆధిపత్య మే నా? ఎందుకంటే అభివృద్ధి బహిరంగ పోటీ తోనే వస్తుంది, ఆరోపణలు జవాబులతోనే, నిజమైన ప్రజాస్వామ్యం లో.

అమెరికా లో కూడా, మన మోసపు కుట్ర బలవంతుల రాజ్యం ఏలుతోంది ఇన్నాళ్లు గా. ఇప్పుడు అయినా, బానిస సంకెళ్ళు విప్పి, వాస్తవం మాట్లాడాలి అందరూ మనసుతో.

లేదంటే ఇంకో కొత్త సంఘం, కొత్త మోసం తో, తమ అక్కడ మరియు ఇక్కడ రాజకీయ కపట నాయకుల, భజన సేవల కోసం, జన్మను ఇస్తుంది సుమా.

అమెరికా తానా తెలుగు సంఘ ఎన్నికల్లో, గోగినేని, మొదటగా ముఖాముఖి వాదనకు సవాలు విసిరారు, రెడీ గా ఉన్నారు, వెనక్కు తగ్గకుండా నీతి గా అని విన్నాం. తానా లోని లోపాలను, బహిరంగంగా తూర్పార బడుతున్నారు, నిజమైన మార్పు కు నాంది పలుకుతూ.

ఇప్పుడు కొడాలి నరేన్ కూడా, ధైర్యంగా సవాల్ అంగీకరించారు, అని వార్తలు వచ్చాయి.

మరి మూడో అభ్యర్థి, నిరంజన్ కూడా ధైర్యంగా, ముఖాముఖి వాదనలకు సిద్ధంగా ఉన్నారా? తప్పదు తన టీం ఆరోగ్యం కోసమైనా, తానా పరువు నిలవడానికి అయినా ముందుకు రావాలి.

కరోనా సమయంలో, విమానాలలో రాష్ట్రా లలో తిరగడం, అందరినీ అనారోగ్యం పాలు చేయడం, ఉత్తమ నాయకత్వ లక్షణాలు కావు. వచ్చే ఓటర్లవి కూడా, మనలాంటి కుటుంబాలే, మనలాంటి ప్రాణాలే సుమా.

మీరు ముగ్గురు కాన్ఫరెన్స్ లో వాదించండి, డమ్మీ లు ఎవరో, అసలైన వాదనలు ఏవో, జనం తెలుసుకుంటారు, ఓటు వేస్తారు. గెలుపు ఓటములు, దైవాధీనం, పోరాడి ఓడినా వీరుడే. పారిపోయి లేదా దాంకుని గెలిచినా, పిరికి వాడే. మిగతా టీం సభ్యులు, ఆరోగ్యం గా ఇంట్లో ఉండి, ఫోన్ మరియు ఆన్లైన్ ప్రచారం చేస్తారు.

తానా ఆరోగ్యం, సంపద, శ్రమ, సమయము, ప్రాణాలు ను కాపాడుదాం.

ఈ సమాచారం లో తప్పులు ఉంటే, తెలియచేయగలరు. అందుకే ఆ ముగ్గురు నాయకులు కే, నేరుగా పంపే ప్రయత్నం చేస్తున్నాము.

Update : March 31 onwards

నరేన్, నిరంజన్, శ్రీనివాస్ గారు, ధైర్యంగా జవాబు ఇవ్వగలరు, మీకు పంపిన ఆర్టికల్ ప్రశ్నలకు.

కింద నుంచి ఎదిగి ఉంటే మీరు, చిన్న మీడియా నైనా గౌరవించాలి, నాయకుని లా తోటి తెలుగు వ్యక్తి ని పలకరించాలి, లేదా ఇక్కడ తెలుగు లో జవాబు టైప్ చేసి చెప్పగలరు. మీడియా సైజు కాదు ముఖ్యం, మాటల నిబద్ధత.

పచ్చ లేదా అనుకూల మీడియా కు తప్ప, వేరే వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వమని, ఉన్న మచ్చ ను ధైర్యంగా తుడపండి. మాకు కావాల్సింది పాత తప్పులకన్నా, జరగబోయే సవరణలు మిన్న.

మేము నేరుగా ఫోన్ చేయవచ్చు, కానీ మీరు ప్రచారం లో తీరిక ఎప్పుడో తెలీదు. మీకు తీరిక దొరికిన సమయంలో నే, మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు. మీ ప్రైవసీ కి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు పాత ఆర్టికల్స్ లింక్ కూడా పంపాము.

లేదా గాడ్ ఫాదర్ తో ఎదిగామని అంగీకరించాలి, అప్పుడు మీతో మాట్లాడాల్సిన అవసరము లేదు. లేదా ఎవరి పర్మిషన్ అయినా కావాలంటే చెప్పగలరు, వైకాపా లేదా తెదేపా లేదా బీజేపీ అధిష్టానం నుంచి. వారంతా కూడా ఆసక్తి గా, మన మెసేజ్ లు చూస్తున్నారు.

లేదా తాళ్ళూరి లేదా జయరాం. ఎప్పుడూ వారితో మాట్లాడలేదు, మీకోసం కావాలంటే ఫోన్ చేస్తాం, మెసేజ్ పంపుతాం వారికి.

ఏదో ఒకటి రాయవచ్చు బయట వీడియో ల మీ పలుకుల నుంచి, కానీ మీ మంచితనం మీ పలుకు మర్యాద అర్థం అయితే, రాత పొరపాటు ను దిద్దుకుంటాం ముందే.

మీ ముగ్గురు మాకు మిత్రులే. ఎవరికీ ఇబ్బంది కలిగించాలని కాదు. మీ మంచి, పదిమంది కి పంచుదాం అని మాత్రమే, తానాని కాపాడుకుందాం.

ఈ గందరగోళం, ఈ ప్రశ్నలు అనుమానాలు, ఆంధ్రా లో డీజీపీ అలాగే అన్ని పార్టీల అధిష్ఠానం కు అక్కడ సమస్యలు పంపిన విధంగా, ఇక్కడ కూడా అమెరికా అధికారులుకు మరియు పార్టీ నేతలకు పంపితే, దాని ఫలితాలు తీవ్రత మీకు తెలుసు, మన తెలుగు జాతి పరువు పోతుంది.

మీరు దయచేసి అటువైపు మమ్మల్ని మరలించరు, అని ఆశిస్తున్నాము. ఇప్పటి దాకా మా ద్రుష్టి కేవలము ఆంధ్రా వరకే, అమెరికా ఉద్దెశ్యము లేదు. ఎదురు చూస్తున్నాము మీ మర్యాద నాయక మాటల కోసం. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1586 General Articles, 54 Tatvaalu
Dt : 31-Mar-2021, Upd Dt : 31-Mar-2021, Category : America
Views : 587 ( + More Social Media views ), Id : 1065 , Country : USA
Tags : tana , elections , leaders , brave , 3 , face to face , debate , panel , members , health , naren , srini , niranjan

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content