పంచాయతీ ఆదర్శ ఏకగ్రీవ ఎన్నికలు సాధ్యమేనా? అప్పుల పంపిణీ, సంక్షేమ రాజ్యం, గెలుపు భయం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,599; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒకరి ప్రశ్న, గ్రామ పంచాయతీ ఆదర్శ ఏకగ్రీవ ఎన్నికలు సాధ్యమేనా? ఈనాటి జగనన్న, ఆనాటి చంద్రన్న మర్యాద మాటల అప్పుల పంపిణీ, సంక్షేమ ఎదురు చూపుల రాజ్యం లో? గెలుపు భయం ఎవరికి?

జవాబు, జగనన్న ప్రభుత్వం, ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ల వాద ప్రతి వాదాలు, కోర్టు పరుగులు, నాయకుల విరుపులు, వాచ్ యాప్ లు, అబ్బో, ఎంత ఘోరము గా చిన్న పిల్లల ఆటలాగా సాగుతుందో, ప్రజలు నవ్వుతూ ఉన్నారు.

ఎవరివి తప్పులు ఒప్పులు పక్కన పెడితే, నిమ్మగడ్డ ను హీరోను చేస్తూ, 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు, తమ సొంత వైసీపీ అనుచరులు ను సీట్లు తక్కువ వస్తుందేమోనని భయపడుతున్నట్లు, సందేహం లో పడవేస్తూ ఉన్నారు.

కరోనా సమయంలో తెదేపా నాయకులు, బయటకు వచ్చి ప్రజలతో లేరని, ఇప్పుడు కూడా అధిష్టానం పలకరింపు కు వస్తూ, రాష్ట్రం బయటనే ఉందని తెలిసీ, ఇంత గొడవ భయం అవసరమా అని కొందరు.

ఆలయ విగ్రహా దాడులు ఆగాయి. ఎన్నికల సమయంలో, తెదేపా నాయకుల అరెస్ట్ లు దాడులు తో, వారికి సింపతీ పెంచేస్తూ ఉన్నామా, అని ఆలోచన చేయాలి.

కేంద్ర బడ్జెట్ మీద, విజయసాయి విరుపులు, అన్యాయం జరిగిందని. మరి జగనన్న మాట రాలేదు బయటకు. కొందరు సమర్ధన, దేశం మొత్తానికి బాగుంది, అని.

ఇక అసలు విషయం కు వస్తే, ఈరోజులలో ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే, వారికే పొత్తు సంయోధ్య కుదరడం లేదు.

మా ఊళ్ళో ఒకే పార్టీలో ని ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే కే పొత్తు కుదరదు. ఒకే పార్టీలో ఉంటూ, పెద్ద నాయకులు కూడా, ఒకరికొకరు పడదు. అంటే వీరి మధ్యలో నే, ఏకగ్రీవం లేదు.

అలాంటిది, గ్రామ పంచాయతీ లలో వైసీపీ తెదేపా బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ ఉంటే, ఏకగ్రీవం ఎలా వస్తుంది సాధారణ పరిస్థితి లో? ధనం తోనూ లేదా అధికారం తోనూ, ఒత్తిడి చేస్తే తప్ప, మామూలు గా సాధ్యపడదు.

ఇది ఇప్పుడు ఈ ఒత్తిడి బెదిరింపులు కొత్త ఏమీ కాదు, చంద్రన్న పాలనలో నూ ఇలాగే సాగింది, మరలా తర్వాత కూడా సాగుతోంది, ఎందుకంటే మనకు ఇలాంటి సంఘటనలు కావాలనే, మన అవ లక్షణాలు కు తగిన విధంగా, వీరినే ఎన్నుకుంటాము కదా?

సగం రోజులు వీరు, సగం రోజులు వారు అనుకొని, తర్వాత ఏమైనా పర్లేదు అనుకుని, ముందుకు వెళుతున్నారు, విధిలేక కొంతమంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,599; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 02-Feb-2021, Upd Dt : 02-Feb-2021, Category : Politics
Views : 790 ( + More Social Media views ), Id : 952 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : panchayat , ideal , unanimous , election , possible , debt distribution , welfare , state , fears , victory
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content