ఇంట్లో పలుగు, పార, సుత్తి, కొడవలి కూడా నిషేధం చేయకపోవడం, జగనన్న చంద్రన్న ది తప్పా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,129,884; 104 తత్వాలు (Tatvaalu) and views 239,543.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన ఇంట్లో పలుగు, పార, సుత్తి, కొడవలి కూడా నిషేధం చేయకపోవడం, జగనన్న చంద్రన్న ది తప్పా? ఇల్లు ఇల్లు వెతికి వాటిని తీయని, మన పోలీసు సోదరుల ది తప్పా? ఆలోచన చేస్తే, వీరెవరిదీ తప్పు కాదు.

ఇంట్లో పిల్లలకు, కుటుంబ సభ్యులకు అనుచరులు కు, వాటి వల్ల అసలు ఉపయోగం ఏమిటి? పొలానికి, చెట్లు కు, గోడ కడటనికి మాత్రమే వాడాలని, చిన్నప్పటి నుంచి సంస్కారం, బాధ్యత, సమాజం అంటే గౌరవం నేర్పని, మనది తప్పు కాదా? అసలు మన ఇళ్ళలో తల్లి దండ్రుల మాట విని, బుద్ధి గా ఉండి, కనీసం వారిని గౌరవించే, పిల్లలు ఉన్నారా?

మన ఇల్లు బాగుచేసుకోవడం చాతగాని మనకు, ప్రభుత్వం ని, పోలీసులు ను, అధికారులు ను ప్రశ్నించే హక్కు ఉందా? ముందు మనం మారదాం, మన కుటుంబం ను, బంధువులు ను, స్నేహితులు ను చేతనైతే మార్చుకుందాం.

ఊరకే ప్రభుత్వం ను, పోలీసులు ను విమర్శలు చేయవద్దు. బాధ్యత గల పౌరుడు వైతే, వైన్ షాపు దగ్గర నిల్చుని, కరోనా కి బలి అవ్వాలని, కుటుంబం ను రోడ్డు న వేయాలని పరితపించే, ఆ అమాయక చక్రవర్తి కి, దండం పెట్టి బతుకు విలువ చెప్పి, ఇంటికి పంపు. మనకు కాపలా ఉండే పోలీసు అన్న అక్క కు, కాఫీ టీ బిస్కెట్ మజ్జిగ ఇవ్వు, అవీ లేకపోతే కనీసం తలవంచి దండం పెట్టు.

ఒక పౌరుడు అడిగారు, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, వచ్చి కలుస్తాను అని. ఏవండీ, మన ఊళ్ళో పనులు అవడానికి, ముఖ్యమంత్రి గారు, మన ఊళ్ళో ఉండాలా? డీఎస్పీ గారు, తాహసిల్దారు గారు, మన ఇంటి పక్కన ఉండాలా? అవసరం లేదు కదా, మంచి మనసు ఉండి, మన ఊరికి ఉపకారం చేద్దాం, అనుకుంటే చాలు కదా. ఈ కరోనా రోజుల్లో ఫోన్, వాట్సాప్ మెస్సేజ్ తోనే, అన్ని పనులు సాగుతున్నాయి, సామాజిక దూరము వ్యక్తులు కలవాల్సిన పని లేదు కదా. ఎవరు ఎక్కడ ఉన్నా, ఇబ్బంది లేదు.

మీరు బాధ్యత గ మంచి పౌరుడు లేదా అధికారి అయి సమస్యలు ఉంటే, ఫోటో వీడియో సాక్ష్యం ఉంటే పంపండి. ఏ బాధ్యత గల విలేఖరి అయినా, సమస్యకు ప్రధాన్యము ఇచ్చి, మీ వివరాలు బయట పెట్టరు, గోప్యంగా ఉంచుతారు. ముందు అసలు వ్యక్తి లేదా అధికారితో విడిగా మాట్లాడి నిర్ధరణ చేసుకుని, ఆ తర్వాత మాత్రమే, బహిరంగంగా అడగవచ్చు. కానీ, అంత అవసరము రాదు, మీరు పై అధికారులను సంప్రతిస్తే, ముందు ఆ పని చెయ్యండి.

ప్రభుత్వ వెబ్సైట్ లు చూడండి. మీకు అధికారుల ఫోన్ నంబర్, ఈమైల్ అన్ని వివరముగా ఇచ్చారు. ప్రతి అధికారికి, పైన అధికారులు ఉంటారు, కొంతమంది అయినా మంచి వారు ఉంటారు. మన ఊరి అధికారులు కు, పైన డివిజన్ మరియు జిల్లా అధికారులు ఉంటారు. ఆర్డీవో గారు ఉన్నారు, రెవెన్యూ వారికి. జిల్లా స్ధాయిలో, మున్సిపల్, పంచాయతీ, ఆరోగ్య అధికారులు ఉన్నారు. మనము పట్టనట్లు గా గమ్మున ఉంటే, ఎవరూ పనులు చేయరు కదా, మన ఇంట్లో అయినా.

కలెక్టర్ గారికి కూడా, పైన అధికారులు ఉంటారు. వీళ్ళు ఎవరూ విననప్పుడు, ఇంకా పైన ఆ తర్వాత రాజకీయ నాయకులు. ముందు సౌమ్యంగా, మర్యాద గా, వినయముగా నమస్కరించి అడగండి. తర్వాత మాత్రమే, పై వారికి కంప్లైంట్ ఇవ్వవచ్చు. ముందు మీ ప్రయత్నం మీరు చేయండి, బాధ్యత గల వ్యక్తి గా, పని అయినా కాకపోయినా. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,129,884; 104 తత్వాలు (Tatvaalu) and views 239,543
Dt : 07-May-2020, Upd Dt : 07-May-2020, Category : General
Views : 953 ( + More Social Media views ), Id : 538 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : no ban on house pickaxe , shovel , hammer , sickle , mistake of jagan , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content