Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అందరూ చదవ వచ్చు, సాత్విక జవాబు మాత్రమే.
కామి కాని వాడు మోక్షగామి కాడు అంటారు, అది నిజమే 100 శాతం, దాని అర్ధము తెలిస్తే.
మరి మన చుట్టుపక్కలా, ఎంత మందికి పెళ్ళి అయిన కామికులకు మోక్షము వచ్చింది? మీ స్నేహితులు బంధువులు లో ఉంటే, కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి.
అసలు మోక్షము స్టేటస్, మనము పోయిన తర్వాత తెలుస్తుందా? లేక బతికి ఉన్నప్పుడే ఆ మనిషి నడతను బట్టి తెలుస్తుందా?
పెళ్ళి అయి, 5 గురు పిల్లల్ని కని, చచ్చే వారు కూడా, నా ఆస్తి నా సంతానం నా భాగస్వామి నా పదవి నా ధనం, ఏమౌతుందో అంటున్నారు భోరు మంటున్నారు, మోహ వ్యామోహ బంధులై.
ఇంకో పక్క పిల్లలే తల్లి దండ్రులను గాలికి వదిలేస్తున్నారు, తూ మా లాంటి పాపాత్ములను కన్న మిమ్మల్ని, మా పిల్లలు తో సమానం గా మా ఇంట్లో ఉంచి చూడటమా, కల్ల అని.
ఇంక మోక్షం ఎలా వస్తుంది? మన సంతానమే మనల్ని ఇంట్లో తోడు ఉంచి, పసి పిల్లలు గా గౌరవించకపోతే, మనది సంస్కారం లేని చెత్త పెంపకమే కదా, భూమికి భారమే కదా? అంటే నరకమే కదా? ఇంక మోక్షం కు దారి ఎక్కడ ఉంది?
మొన్న ఎవరో అన్నారు, కరోనా రాని వాడు ఆసుపత్రులకు ఉదారం గా సహాయం చేయలేడు, కాటికి తొందర గా కానరాడు అన్నారు. ఒప్పుకుందామా?
ఊరక వచ్చిన ధనాన్ని, ఆసుపత్రులకు, మందులకు, రోగానికి దుబారా ఖర్చు చేద్దామా? కరోనా రానంత మాత్ర పోమా తొందరగా, సమయం వస్తే?
అసలు పెళ్ళి కి, కామానికి, మోక్షానికి సంబంధం ఉందా? ఉంటే మరి పెళ్ళిగాని ఒంటరి వారి పరిస్థితి? వారికి మోక్షం రాదా? దేవుడు అన్యాయం చేస్తాడా? పక్షపాతా?
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. అసలు పెళ్ళి కి, మోక్షానికి సంబంధం లేదు.
మరి ఏమిటి కామం అంటే? సంస్క్రుతం భాష రాని వారితో ఇదే చిక్కులు. కామము అంటే కోరిక. కొరిక అంటే, ఆడ మగ బంధము ఒక్కటే కాదు సుమా, పదవి కావాలి, ఆస్తి కావాలి, ధనం కావాలి, ఇవి అన్ని కూడా కొరికలే.
చంద్రన్న కు సీయెం కావాలని కోరిక ఉంది, అది కామమే. దాని గురించి తీవ్రమైన క్రుషి చేసారు. దగ్గర దోవ వెన్నుపోటుతో సీయెం అయ్యారు. అంటే, ఆ పని కి ఫలితాన్ని పొందారు కదా? ప్రాపంచిక మోక్ష గామి అయ్యారు కదా? 3 పంటల మాగాణిని కాంక్రీట్ చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ధనం సంపాదిద్దాము అనుకున్నారు, సాధించారు కదా? ప్రజాధనము తో, పంచుతూ, తన కుటుంబ పేర్లు పెట్టుకోవాలని తపన పడ్డారు, సాధించారు కదా? కరోఅనా తగ్గ ఆసుపత్రి లేక జనం ఇబ్బందులు పడాలి, హైదరాబాద్ కు ధనం ఉన్న వారు పోవాలి అని క్రుషి చేసారు, సాధించారు కదా?
జగనన్న కి కూడా అదే కోరిక, అదీ కామమే. దాని గురించి తీవ్రమైన క్రుషి లో, సోనియమ్మ తో తగవు, జైలు, తర్వాత పదవి. ప్రాపంచిక మోక్ష గామి అయ్యడు కదా? పై చంద్రన్న కోరికలు, జగనన్న కూడా తీర్చు కున్నారు కదా?
అలాగే ఐయేయస్, ఐపీయస్ కావాలని కోరికలతో, సాధించిన వారు లేరా? అలాగే పెళ్ళి ఆస్తులు ఆనందాలు, ఇవన్ని ప్రాపంచిక మోక్ష ఫలితాలు.
కానీ ఆధ్యాత్మిక మోక్షము? మన అరిషడ్వర్గాల సాధన ద్వారా వస్తుంది. దేని మీదా మమకారం ఉండకూడదు, అది ఇంట్లో వస్తువులు తిండి సుఖాలు మనుషుల సౌకర్యాలు సేవల మీద కూడా.
దానికి పెళ్ళి కి సంబంధము లేదు. అసలు ఇంకో మనిషి తో సంబంధము లేదు.
అది ప్రతి వ్యక్తి తనంతట తాను సాధించాల్సిందే. అది మనకు మనిషి బ్రతికి ఉన్నప్పుడే వారి రోజూ పని, మాటలు, చేతలు, సేవలు, త్యాగలను బట్టి స్పష్టము గా అర్ధము అవుతుంది.
ఉదాహరణ కు, వీరబ్రహ్మం, యోగి వేమన, రాఘవేంద్ర స్వాములు మోక్షాన్ని పొందుతారని, అరిషడ్వర్గాలను సాధించారని, మనకు వారు బ్రతికి ఉన్నప్పుడే తెలుసు కదా?
Is it true that a non-Kami is not a MokshaGami? what about singles without marriage? Will salvation come to them? What is your answer?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,800; 104 తత్వాలు (Tatvaalu) and views 256,775 Dt : 19-Apr-2022, Upd Dt : 19-Apr-2022, Category : General
Views : 1001
( + More Social Media views ), Id : 1357 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
kami ,
mokshagami ,
singles ,
marriage ,
salvation ,
moksham Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments