APLatestNews.com top Banner

Social Media links
ఆణిముత్య నాయకుల కోర్టు కేసులు ఆన్లైన్లో విచారణ? సమస్యలపై విలేఖరుల పాండిత్యం - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

మన ఉత్తమ కడిగిన ఆణిముత్య నాయకులు మీద, అన్ని రకాల కోర్టు కేసు లు విచారణకు వస్తాయి, త్వరలోనే అంటున్నారు. అందుకే ముందు గా, ఎవరికి వారు తమ బాక్గ్రౌండ్, సిద్ధం చేసుకుంటున్నారు, ఎదుటివారి మీద నెట్టడం కు, లేదా పక్క దారి పట్టించడం కోసం. అందుకే మనం జడ్జి ల మీద లేదా మిగతా వారి మీద ఆరోపణలు చూస్తున్నాం, ఇంకా ఎక్కువ చూడబోతున్నాం, రెండు పార్టీల వైపులా నుంచి. ఒక సమస్య ముందు, ఇంకో కొత్త సమస్య పెడితే, జనం మరచి పోతారు మొదటి సమస్య ను, అనుచరులు తప్పు తెలిసీ వంత పాడుతారు.

ఆంధ్రాలో రాజకీయాలు, పతనమైన విలువ లు, నిర్లక్ష్య ప్రజల మైన మన బాధ్యతా రాహిత్యం, బహుశా ఎక్కడ కూడా ఉండవేమో. వర్గం కులం అవకాశం అవసరం అంతే, ఇక విలువ లకు మంచి కి స్ధానం లేదు, మన ఇళ్లు లో కూడా. తెలంగాణ వాళ్ళు విడిపోయి, మంచి పని చేశారు.

రాజకీయాలు వద్దు అని చదువు కుని ఉద్యోగం చేసుకునే వారు, స్వార్ధముగా గమ్ముగా ఉంటే, మన బంధువులు స్నేహితులు ఇంట్లో వాళ్ళు, అక్కడ ఆ రాజకీయాలు లోనే తెల్లార్చుకోవాలి కదా. చదువు కున్న నువ్వు చెప్పకపోతే, నీవాళ్ళకు, ఎవరు చెపుతారు? వేరే వాళ్ళు చెపితే, వింటారా?

ఉండవల్లి గారు చెప్పారు, కోర్టు విచారణ, అంతా డైరెక్ట్ గా ప్రజలు చూడాలి, టీవీలో ఆన్లైన్లో అని. తమ నాయకుల, నిజ స్వరూపం నేరుగా, తెలుసుకోవాలి అని. అది నిజం, ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఇది చాలా తేలిక. అమెరికా లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, అన్ని పెద్ద కేసు లకి.

ఎందుకంటే పేపర్లు టీవీ లు కూడా, అధికార ప్రతిపక్షాలు కు అనుకూలంగా ఉంటున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా, సామాన్య ప్రజలకు తెలియడం లేదు.

ఉదాహరణ చూడండి, మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళో ఉండరు, నెలలో తీరినప్పుడు అతిధిగా రాక, గెలిచిన మొదటి రోజు నుంచి, ఇది వాస్తవం. ఇప్పుడు పేపర్లో ఎలా రాయవచ్చో చూడండి, మా విలేఖరుల పాండిత్యం.

ఇప్పుడు అదే వార్త, పచ్చ పత్రికలలో ఏనాడు ఇంద్రజ్యోతి లో వస్తే, వార్త నిజమైనా కూడా జనం నమ్మరు, కావాలని అధికార పక్షం మీద ఇది అపవాదని అబ్టారు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు అలాగే రాస్తారు, మంచి కూడా పొగడరు.

ఎమ్మెల్యే లేకుండా ఉండడాన్ని సమర్ధన చేస్తూ, అధికార పత్రికలో, ఇలా కూడా రాస్తారు , కొంత మంది పిచ్చి జనం అయినా నమ్ముతారు అని.

కలెక్టర్ కు మరియు మంత్రుల కు, దగ్గరగా జిల్లా రాజధాని లో ఉండి, ఎన్నో పరిశ్రమ లు, పోర్టు లు, చేనేత పార్కు లు తేవడానికి, ప్రజలకోసం చెమటోడ్చి నిరంతరం కష్టపడుతున్న, ఎమ్మెల్యే పై ప్రతిపక్షాల నీలాపనిందలు.

పై లైన్లో ఏమైనా అర్ధం అయిందా? ఊళ్ళో లేరు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటూ, దానిని నేర్పు గా, తెలిగా చెప్పారు. కలెక్టర్ మరియు మంత్రుల, రోజూ ఒక ఎమ్మెల్యేతో కూర్చుని ఉండరు కదా.

మాయలో ఉన్నాము. జరుగుతుంది అంతా, మాయాజాలం. మాయలో మనం వేసే, మన ఓటు దగ్గర మొదలౌతుంది, ఆ తర్వాత 5 ఏళ్ళు సాగుతోంది. మరలా కొత్త మాయ. మనము మన పిల్లలు మనవళ్లు, అలా మాయలో ఈదుతూ ఉంటాము. మన ఇంట్లో ఉండే చాలా మాయలకు తోడుగా, ఇది అదనపు మాయ మిత్రమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 18-Oct-2020, Upd Dt : 18-Oct-2020, Category : Politics
Views : 75 ( + More Social Media views ), Id : 764 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : court cases , leaders , online , journalism , mastery , issues , andhra , jagan , babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content