Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. *** అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పశ్చిమగోదావరి జిల్లాలో, మహిళా పోలీసు ఉద్యోగులకు కల్పించిన సెలవు దినాన్ని పురస్కరించుకుని, మహిళా పోలీస్ అధికారులు, ప్రజాసేవలో క్షణం తీరిక లేకుండా గా నిర్వహిస్తున్న ఉద్యోగ నిర్వహణలో, కుటుంబ లో ఉన్న పిల్లల యొక్క ఆలనాపాలన విషయంలో, ఈ రోజు సెలవు దినం కావడం వలన, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో, వారి యొక్క తల్లిదండ్రులతో ఆహ్లాదభరితంగా గడిపారు.
*** మ్యూజికల్ ట్రీట్: సింగర్ గీతా మాధురి, ఉమెన్స్ డే ప్రత్యేక పాటను, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సావాంగ్ ఐపిఎస్ విడుదల చేసారు.
*** మహిళా దినోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే, క్యాండిల్ ర్యాలీని రాష్ట్రమంతా నిర్వహించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి, ఎంపిక చేసిన 100 షాపింగ్ సెంటర్లలో మహిళా దినోత్సవం రోజున, కొనుగోలు చేసేవారికి 10 శాతం రాయితీ కల్పించామన్నారు.
*** కర్నూలు జిల్లాలో, క్యాండిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐ.పి.యస్ గారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పోలీసు స్టేషన్ లలో ఉమెన్ హెల్ప్ డెస్క్ లను గౌరవ ముఖ్యమంత్రి గారు, డిజిపి గారు ల చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. సోమవారం పోలీసు హెడ్ క్వార్టర్ లో మహిళలకు మెడికల్ క్యాంపు ఉంటుందన్నారు.
*** పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు ఇండోర్ స్టేడియంలో క్యాండిల్స్ ను వెలిగించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ ఐ.పి.ఎస్, పోలీసు అధికారులు మరియు సిబ్బంది.
*** కడప జిల్లాలో, నగరంలో క్యాండిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా యస్.పి. శ్రీ కే.కే.ఎన్ అన్బు రాజన్,ఐ.పి.యస్., గారు
*** గుంటూరు జిల్లా, రేంజ్ డీఐజీ శ్రీ త్రివక్రమవర్మ ఐ.పి.యస్ గారు గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ అమ్మిరెడ్డి ఐ.పి.యస్ గారు మరియు గుంటూరు రురల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్నీ ఐ.పి.యస్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎంటీబీ సెంటర్ నుండి లాడ్జ్ సెంటర్ వరుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించటం జరిగినది.
*** అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని విద్యా సంస్థలకు చెందిన వేలాది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీని అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ కాంతి రాణ టాటా ఐ.పియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు ఐ.పియస్ గారు పాల్గొన్నారు.
*** శ్రీకాకుళం జిల్లా, జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఆయా పోలీసు అధికారులు ప్రధాన రవాణా మార్గంలోని ముఖ్య కూడళ్ళలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించి దిశ యాప్ గురుంచి విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించారు.
*** విశాఖపట్నం సిటీ మరియు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్ లోని కాళీమాత దేవాలయం నుండి వైఎంసిఏ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు శ్రీ మనీష్ కూమార్ సిన్హా ఐ.పి.ఎస్ సిపి విశాఖపట్నం సిటీ, శ్రీ ఎల్ కే వి.రంగారావు ఐ.పి.ఎస్ డీఐజీ విశాఖపట్నం రేంజ్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐ.పిఎస్ గారు, పోలీస్ అధికారులు, వివిధ కాలేజీ విద్యార్థినిలు, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థినిలు, మహిళా పోలీసులు మరియు మహిళా మిత్రలు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.
*** విజయవాడ సిటీ పోలీసులు పౌరులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ లాంతర్లతో రాత్రి ఆకాశాన్ని వెలిగించారు. ఎంత అద్భుతమైన రాత్రి!
*** మహిళల పై జరిగే నేరాలను నివారించడానికి మరియు వారిపై విశ్వాసం కలిగించడానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ సిఎం, 900 దిశా పెట్రోలింగ్ వాహనాలను మరియు 18 ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రారంభించారు.
*** గౌరవ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత తో పాటు, డిజిపి ఆంధ్రప్రదేశ్ గౌతమ్ సావాంగ్ ఐపిఎస్ మంగళగిరిలోని, ఎపి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద, దిశా పెట్రోల్ వెహికల్స్ & ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనాలను తనిఖీ చేశారు.
*** ప్రకాశం పోలీసులు అధికారులు, మహిళా పోలీసు సిబ్బంది ని సత్కరించారు. ఒకవైపు కుటుంబాలు చూసుకుంటూ, మరోవైపు క్లిష్టమయిన పోలీసు శాఖలో, మగవారికి ధీటుగా విధులు నిర్వహిస్తున్న, మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ అని పోలీసు అధికారులు. అలాగే మహిళా సిబ్బందికి చీరలు, పుష్పగుచ్చాలతో మరియు కేక్ కటింగ్ కార్యక్రమంద్వారా మహిళా దినోత్సవ శుభకాంక్షలు తెలియచేసారు.
ఎస్పీ సీయెం మీటింగ్ మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎస్పీ ప్రకాశం శ్రీ సిద్ధార్థ్ కౌశల్, ఐపిఎస్., ఒంగోల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు క్లినిక్‌లో జిల్లా మహిళా పోలీసు సిబ్బంది మరియు కుటుంబాల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
link.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,740; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493 Dt : 08-Mar-2021, Upd Dt : 08-Mar-2021, Category : News
Views : 850
( + More Social Media views ), Id : 1013 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
international ,
womens day ,
celebrations ,
districts ,
sp ,
police ,
ap ,
cm ,
jagan ,
dig ,
sawang ,
andhra ,
song అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments