APLatestNews.com top Banner

Social Media links
వయసు లో నే, అన్ని అవయవాలు మన అధీనంలో ఉన్నప్పుడే, ఆత్మ జ్ఞానం - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

* 40 ఏళ్ళు వయస్సు లోపల, ఇటువంటి మాటలు చాదస్తం
* అప్పుడు కే అరిషడ్వర్గాలలో మునిగి తేలుతూ ఉంటాము
* ఎన్ని బంధాలను పెంచాను తుంచాను ముంచాను
చూసారా, ఆ చిత్రం లోని మాటలు, ఆత్మ జ్ఞానం, మన అన్ని అవయవాలు కదిలేటప్పుడుకే అదుపులో ఉన్నప్పుడే నేర్చుకోవాలి.

కానీ దురదృష్టవశాత్తు, మనం పెరిగిన వాతావరణం బట్టి దానిని లెక్క చేయము, కానీ చివరలో తప్పించుకోలేము. చుట్టూ మిగతా వారికి జరిగింది చూస్తుంటాము, కానీ మనకు జరగదు అని, మనమే భ్రమలో ఉంటాము.

రామారావు గారు, సావిత్రి గారు ఉన్నప్పుడు తల్లి దండ్రుల పాట్లు, నల్ల సినిమాలో చూసాము. గత చిరంజీవి గారి లేదా ఈనాటి ఎర్ర సినిమా ల లో, అవే బాధలను చూస్తున్నాము.

మనకు 40 ఏళ్ళు వయస్సు లోపల, ఇటువంటి మాటలు అన్ని చాదస్తం, చాతకాని వారి మాటలు, అని పట్టించుకోకుండా ఉంటూ, గేళి చేస్తాము.

ఆ తర్వాత, అంటే 40 పైన వచ్చిన తర్వాత, పై మాటలు కరెక్టు గానే ఉన్నాయి అంటాము అలాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ పాటించలేము. ఎందుకంటే అప్పుడు కే అరిషడ్వర్గాలలో మునిగి తేలుతూ ఉంటాము. ఏరోజు కారోజు మారాలి అనుకునే, లోపలే 60 వస్తాయి.

అప్పుడు, పై మాటలను వంద శాతం ఒప్పుకుంటాము. ఇంకొంత మందికి 70 లేదా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది. ఇన్నాళ్లు, దేనికోసం పరుగులు తీసాను, ఎందుకు ఎంత సంపాదించాను, ఎన్ని బంధాలను పెంచాను తుంచాను ముంచాను, అన్న బాధ ఆలోచన వస్తుంది. నాకు లేని సంస్కారం, నా పిల్లల కు కూడా నేర్పలేదని చింతన వస్తుంది.

కానీ 60 ఏళ్లుగా బండబారిన మనసు, మన మాట వినదు. మన ఒళ్ళు సహకరించదు. ఇంట్లో వాళ్ళు మనల్ని లెక్క చేయకుండా, అడ్డంగా ఉన్నామని భారమని గొణుగుతూ తిడుతూ లేదా ఆశ్రమం లో వదిలే సమయం వస్తుంది.

అప్పుడు గతము తలుస్తూ , ఏమీ చేయలేని స్ధితిలో కన్నీరుమున్నీరుగా ఏడ్చినా, వినే నాధుడు లేడు. ఎందుకంటే ఇంతకాలం మనము కూడా అలాగే ఉన్నాము, మన తర్వాత తరాన్ని అలాగే పెంచాము. ముళ్ళు చెట్టు కు ముళ్ల చెట్టు విత్తనాలు, ఆ జాతి మొక్కలే వస్తాయి కానీ, మామిడి చెట్టు రాదు కదా.

కాబట్టి, వయసు లో నే, అన్ని అవయవాలు మన అధీనంలో ఉన్నప్పుడే, ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి ధ్యానం ద్వారా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 808 General Articles, 46 Tatvaalu
Dt : 24-Jun-2020, Upd Dt : 24-Jun-2020, Category : General
Views : 236 ( + More Social Media views ), Id : 584 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : young age , organs control , soul knowledge
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content