APLatestNews.com top Banner

Social Media links
వినాయకుడు గణాధిపతి పోటీ లో, తల్లి దండ్రులు చుట్టూ తిరిగి, నారాయణ స్మరణ తో - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

అందరికీ, వినాయక చవితి శుభాకాంక్షలు. అమెరికా లో శుక్రవారం, మీ వాళ్ళ కు చెప్పండి. రాత్రి పూట చంద్రుని చూసే రోజు ను బట్టి, ఆ చవితి సమయం ముఖ్యం. అందరం ఆరోగ్యం గా ఉండాలి ఆ దేవుని అండతో. కరోనా గురువు ను గౌరవించి, ఇంట్లో నే ఉండాలి ఆరోగ్యముగా.

అన్ని పూజలలో, మొదటి పూజ వినాయకుని కే, చిన్న పసుపు ముద్దతో చేసి. అందరి ఇళ్ల లో పసుపు ఉంటుంది, బయట కొనుగోలు అవసరం లేదు, దొరికిన ఆకులు పండ్లు చాలు, ఇంటి నిమజ్జనం తేలిక.

మంత్రం మరియు పూజ, మన మనసు ను కట్టడి చేసే ప్రశాంతత మరియు మనశ్శాంతి కోసం. సొంత నోటి తో, మంత్రం పలకాలి. మైకులు పాటలు పూజ వినడం కాదు, మనం చూసి చదువు తూ, పలకాలి, ఏకాగ్రత తో, అప్పుడే ఆ పూజకు ఫలితం.

50 ఏళ్లు పై గా పూజ చేసినా, మన బుద్ధి మారలేదు మరియు మనసు అదుపులో లేదంటే, అరిషడ్వర్గాలను దాటలేదంటే, సత్వగుణం కూడా రాలేదంటే, ఆ ఇన్నాళ్లు పూజ వ్యర్థం, నోటితో చేసినవి మనసుతో కాదని అర్ధము.

వినాయకుడు గణాధిపతి అవ్వడానికి కుమార స్వామి తో పోటీ లో, కేవలం తల్లి దండ్రులు చుట్టూ ప్రదక్షిణ తిరిగి, నారాయణ స్మరణ తో విజయం సాధించారు. మరి గణపతి భక్తులు గా, మనం కన్న తల్లి దండ్రులు కు, అంత విలువ ఇస్తే నే, ఈ పూజకు విలువ.

ఏనుగు వినయానికి ప్రతీక, అమిత బలం ఉండి, అణుకువగా ఉంటుంది. గుండు సూదిని గూడా తీయగలదు తన చిన్న కంటి తో చూచి, అంత సూక్ష్మ బుద్ధి. పరోపకారం కోసం, పెద్ద చెట్లు ను మోయగలదు. అధికారులు, నాయకులు, సంపన్నులు, ప్రజలు అలాగే ఉండాలి, అప్పుడే వారి ఖ్యాతి పెరుగుతుంది, తమ వంశము అదే ఉన్నతిలో ఉంటుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 21-Aug-2020, Upd Dt : 21-Aug-2020, Category : General
Views : 102 ( + More Social Media views ), Id : 654 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : contest , ganadhipati , ganesh , pradakshin , shiv , parvati , narayana , chant
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content