Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అమ్మ ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ, అలాగే తీరిక లేక అడగని వారికి కూడా, ధన్యవాదాలు. అందరికీ తల్లి ఉంటుంది కదా, ఏ తల్లి ఎవరికైనా తల్లే.
మంచి మనసు లేదా గతంలో తమ తల్లి ని చూడలేదు అన్న పశ్చాత్తాపం, ఇతరుల మంచి కోరే వారు, ఎప్పుడూ మంచే కోరతారు. ఇతరుల మంచి కోరితేనే, దేవుడు మన మంచి కోరతారు. మన కుటుంబ మంచి, మన సొంత విషయము మరియు బాధ్యత, అందులో గొప్ప ఏమీ లేదు అవన్ని మోహముతో కూడినవి.
నిన్న రాత్రి, అమ్మ గుండెల్లో సన్నటి మంట, పట్టుకుని పోయినట్టు గా, బాధగా ఉంది రా అని కన్నీళ్లు పెట్టుకుంది. చూడండి, 74 ఏళ్ల కి శరీరం ఎంత బలహీనంగా ఉంటుంది తెలుసు కదా. ఇష్టమైన పిల్లలు దూరంగా ఉండి, డబ్బు విసిరేస్తే, ఆ ధనం లేదా మందులు, ఆ బాధ తీరుస్తుందా?
మెంతి నీళ్ళు ఇచ్చి ముందు, తర్వాత గసగసాలు ఇచ్చి, తర్వాత తేనె త్రిఫల చూర్ణం లో కలిపి ఇచ్చి, ఆ తర్వాత వేడి నీళ్ళు లో పసుపు వేసి తాగించాను. తియ్యని మాటలు చెప్తూ, కాళ్ళు చేతులు వత్తుతూ ఉన్నాను. అమ్మా, నీకేమీ కాదు, నేనున్నా భయమెందుకు? నీ రోగనిరోధక శక్తి ని, ఆరేళ్ళు గా అల్లం వెల్లుల్లి కాకర వేప తో, పెంచా కదా, భయమే లేదు మనకు.
ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి నీకే. చాలక పోతే ఇంటికి వెళదాం. ఇంద్రుడు లేదా యముడు వచ్చినా, ఇన్నాళ్లు చెయ్యి పట్టుకుని నడిపాను, మా అమ్మ కు ఏం కావాలో నాకు తెలుసు, మీకూ తోడుగా వస్తాను అంటా.
వారు ఒప్పుకుంటే ఇద్దరం వెళదాం, ఒప్పుకోకపోతే వాళ్ళే ఒంటరిగా వెళతారు. కాబట్టి నీకు భయం లేదు ఎట్లైనా, అంటూ పొట్ట మీద చేత్తో తడుతూ, జోల పాడుతుంటే, చిన్నగా గురక వినిపించింది కాసేపటికి ఆదమరచి నిద్ర పోయి. అంటే పిచ్చి తల్లి హయిగా నిద్ర పోతుంది, నా కొడుకు ఉన్నాడు, నాకు భయం లేదు అని. ఇప్పుడు చెప్పండి, ఆ గంటలో ఆమె కు మనశ్శాంతి ఇచ్చింది, మన డబ్బా లేక మన మంచి మాటా? అది మంచి మాట శక్తి.
మీ తల్లి దండ్రులు అంతే, మీ పిల్లలూ అంతే. వారిని దూరంగా పెట్టి, డబ్బు విసరకండి. వాళ్ళను వదలడానికి, వాళ్ళ మాటలు కాదు వాడుకోవాల్సింది. మనలో ఉన్న నిజాయితీని, కృతజ్ఞతలు, అంతరాత్మ ను అడగండి, ఏది మంచిదో. అవి ఉంటే, అవే మనకు చెపుతాయి, చెయ్యి విడువద్దు అని.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,837,141; 104 తత్వాలు (Tatvaalu) and views 221,576 Dt : 12-Apr-2020, Upd Dt : 12-Apr-2020, Category : General
Views : 888
( + More Social Media views ), Id : 487 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mother ,
heart pain ,
caring words Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments