Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ, గుడి మరియు ఇంట్లో కూడా, దేవుడికి అలా క్షణం లో దండం పెట్టుకుంటాము, మేము అందరం ఇంతే, మా స్నేహితులు బంధువులు ఇంతే. మనసులో దేవుడు ఉండాలి కానీ, ఈ గంటల పూజలు మంత్రాలు వ్రతాలు ఏమిటి అండి. మీ మంత్రాలు కూడా విన్నాను, అంత సాధన అవసరమా?*
జవాబు - అలా ధైర్యముగా, మన మంచి తెలివైన మోహ లక్షణాలు, బయటకు చెప్పు కోవాలి, అవతల వారి అభిప్రాయము తెలుసు కోవాలి, మన తప్పు ఉంటే సరి చేసుకోవాలి.
లేదా దుర్యోధనుడిలా, నేనింతే, అవకాశ అవసరవాదిని, నా పతనాన్ని ఏవరూ ఆపలేరు, నా మనశ్శాంతి ని ఎవరూ పెంచలేరు, అని గర్వంగా ప్రకటించాలి.
అంతే గాని గోడ మీద పిల్లి (గోపీ) లా నటించకూడదు. నటిస్తే, మన కుటుంబం, మన పిల్లలే, మన స్నేహితులే, మన బంధువులే, మనల్ని మోసం చేస్తారు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని.
మంచి విలేఖరి, జవాబు రుద్దడు. మీతోనే జవాబు చెప్పిస్తాడు. మొదట చాలా మందికి, పూజ ఎవరి కోసమో ఎందుకు చేస్తున్నామో కూడా తెలీదు, ప్రసాదం తినేది మాత్రం మనమే.
పూజ చేస్తున్నది దేవుడికి లా కనపడినా, అది మన మనశ్శాంతి కోసం అని గ్రహిస్తే, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు, బీపీ షుగర్ బట్టనెత్తి బరువు లావు ఇతర వ్యాధులు రావు.
ఇప్పుడు మీరు క్షణం లో అలా దండం పెట్టుకుంటాము అన్నారు కాబట్టి, ఈ క్రిందివి కూడా, మీ కుటుంబములో అందరూ క్షణములో అలాగే చేస్తారు, మనసుతో అన్ని పూర్తి అయినట్లు భావిస్తారు అనుకోవచ్చునా? మన్నించాలి బాధకలిగితే, నిజమైతే, దయచేసి చెప్పగలరు. మీ దోవలోనే, మేమూ పయనిస్తాము.
మరి వీటికి జవాబు చెప్పండి, కనీసం మీ స్నేహితులు బంధువులకు.
1. మీరు ఇంట్లో ఇడ్లీ దోసె మరియు అన్నము మొదలగు తిండి పదార్ధాలను, దూరముగా ఉండి మనసులోనే తిన్నాం అనుకుని, ఒక్క క్షణము లో ఆస్వాదిస్తారా? కడుపు నిండింది అని సంతోషముగా ఉంటారా?
లేక ఓ అర గంట అందులో చెట్నీ సాంబారు నెయ్యి ఉల్లి మిరప కూర వేసుకుని రుచిగా, త్రుప్తి కరము గా, చేతితో తీసి, నోటితో, నమిలి తింటారా?
భోజనము చేయడము కూడా ఒక విధమైన పూజనే కదా, ఆకలి రాముడుకి?
2. మీ పిల్లలు లేదా మీరు, బడికి వెళ్ళి, ఒక దండము పెట్టి క్షణములో బయటకు వస్తారా? అలా చేస్తే, మీకు చదువు సంస్కారం పదిమంది తో మెలగడం వచ్చినట్లేనా?
లేక బడిలో గురువులు చెప్పింది, గంటలు గంటలు కూర్చుని రాసుకుని, ఇంటికి వచ్చి చదువుకుని, సాధన చేస్తారా? ఇది చదువుల తల్లి, పూజ కాదా?
3. మీరు మీ స్నేహితులు 10 మంది కలసి విందు మందు, క్షణములో అలా వాసన, ఇలా మొఖము చూసి, అలా గమ్ముగా నవ్వుతూ వెళ్ళి పోతారా? అదేనా విందు, మందు, స్నేహితుని విలువ?
లేక కనీసం ఓ గంట కూర్చుని ఆత్మీయముగా కుటుంబ క్షేమం, లోకాభిరామాయణం మాట్లాడుకుని, తిని, తాగి, పాడి, గంతులేసి, వెళతారా? సామాజిక ఆత్మీయుల పూజ కాదా?
4. మీరు సినిమా సీరియల్ వార్తలు, థియేటర్ లేదా ఇంట్లో లేదా నెట్లో, అరగంట లేదా 1 లేదా 2 గంటలు చూస్తారా? లేక పోస్టర్ చూసి, ట్రైలర్ చూసి, ఓ క్షణం గమ్ము గా ఉంటారా? అందులో ఆనందం ఉందని, పాటలు కూడా పాడారే? హీరోని ఒక సినిమాలో చూస్తే చాలదా? మరలా మరలా ఇంకొన్ని సినిమాలు ఎందుకు, ఖర్చు ఎందుకు?
5. మీకు లేదా మీ ఇంట్లో పెళ్ళి అయితే, అలా క్షణం దూరం గా కనపడి నవ్వి పలకరించి, మనసులో నే, సంసారం అయ్యింది, అమ్మయ్య చాలులే అంటారా?
లేదు, గంటలు బంధు మిత్రులను పలకరించి గౌరవించి మర్యాద చేసి, భాగస్వామి తో కష్టపడి సంసారం చేసి, వంశాన్ని వ్రుద్ది చేస్తారా?
6. పల్లెటూర్ లో ఉన్న మిమ్మల్ని, బెంగలూర్ హైదరాబాద్ లండన్ అమెరికా నుంచి వీడియోలో చూసి మీ పిల్లలు, మీకు మాతో పాటే సర్వ వైద్య సౌకర్యాలు భద్రత మా ఇంట్లోనే కల్పించాము ఇక్కడ, అని మనసులో త్రుప్తి గా ఉంది అంటే, క్షణము లో ఆ మాటకే, ఆ చూపు కే, సంతోష పడతారా?
లేక, తల్లి దండ్రులనే వెర్రి పుష్పాలను చేస్తున్నారా? మమ్మల్ని ఇక్కడ అనాధలుగా వదిలి, ముష్టి ధనం కొంత వడ్డీ గా విదిలించి, మాకు సౌకర్యాలు ఇస్తున్నామని మనసులో అనుకోవడం ఏమిటీ? ఇలాంటి దరిద్రులనా పాములు నా, మేము పాలు పోసి పెంచి పోషించింది. మేము అక్కడకు వచ్చి, 6 నెలలు లేదా జీవితాంతం అయినా వ్రుద్దాప్యం లో, పిల్లలు మనుమలు తో ఉండాలి, అనరా?
* * *
మరి ఇప్పుడు అర్ధము అయ్యిందా? భౌతిక ప్రపంచములో ప్రతి దానికి, ఓ గంట పైన సమయము కావాలి, ఓ పద్దతి ఓ మర్యాద ఓ సాధన ఓ ఓపిక ఓ సహనం ఓ పలకరింపు ఉండాలి.
మరి దేవ దేవుడికి, మనకు మనశ్శాంతి ని ఇవ్వడానికి, ఒక్క దండం ఒక్క క్షణం చాలా? ఎంత చులకన దేవుడు అంటే? ఎంత చులకన, మనకు మనశ్శాంతి ఆరోగ్యం ఏకాగ్రత సమతాస్థితి నీతి నియమం ధర్మం అంటే? మరి ఎన్ని కరోనాలు వస్తే, మనకు బుద్ది జ్ఞానం వస్తుంది?
రోజుకు కనీసం ఒక అరగంట అయినా, భక్తి శ్రద్దతో పూజ మరియు ధ్యానం చేయలేని వారు, తన కుటుంబం ను, తన పిల్లలను, సంస్కారవంతముగా మనశ్శాంతితో ఉంచలేరు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,327,323; 104 తత్వాలు (Tatvaalu) and views 252,536 Dt : 21-Feb-2022, Upd Dt : 21-Feb-2022, Category : General
Views : 697
( + More Social Media views ), Id : 1306 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
temple ,
house ,
god ,
namaskar ,
moment ,
mind ,
practice Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments