Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* జులై 30 న టీవీ షో లో పాజిటివ్
* బాలు మొదటిపాట మర్యాద రామన్న
* ఘంటసాల గారితో, ఏకవీర చిత్రము
* ఓ పాపా లాలీ - మాటే రాని చిన్నా దాని
* 16 భాషలలో 40 వేల పాటలు, గిన్నిస్
* చరణ్ ను, నాతో పోల్చి చూడటం వల్ల
* అయితే కొన్న విమర్శలు కూడా
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
ఓ చిన్న నిర్లక్ష్యముతో అజాగ్రత్తతో, భారత చలన చిత్ర మధుర గాన గంధర్వుడు, ఎస్పీ బాలు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం) గారిని పోగొట్టుకున్నాము. ఆయన మనల్ని వీడి గంధర్వ లోకాని వెళ్ళిపోయారు. బహుశా అక్కడ, ఘంటసాల గారితో కలసి, సంగీత సాధన చేస్తారు.
బాలు గారి వయస్సు షుమారు, 74 ఏళ్ళ వయస్సు, నెల్లూర్ లో పుట్టారు. అంటే, మన అమ్మ వయస్సు. చూడండి, అమ్మను కరోనా 7 నెలలగా ఎంత జాగ్రత్త గా పట్టుకుని వస్తున్నానో, 6 ఏళ్ళ పసిపిల్లలా. 60 తర్వాత కావాల్సింది, నోటు కాదు, తోడు ప్రేమ వానప్రస్థం మనశ్శాంతి ఆధ్యాత్మికం.
మన లాంటి కొడుకు లేదా, కనీసము స్నేహితుడు సేవకుడు ఉన్నా కూడా, కాకర వేప అల్లం వెల్లుల్లి రసాలు ఇచ్చి, భ్రమలు మోహం వదిలించి, ఆయనను పాటలకు వెళ్ళకుండా, ఫిబ్రవరి నుంచి ఆపేసేవారు. ఇంకొన్నాళ్ళు ప్రజలకు, ఇంటి నుంచి అయినా పాడి, సంతోష పెట్టేవారు. ప్రభుత్వము, మనము, అందరమూ మొత్తుకుంటున్నాము.
కరోనా గురువు ని అజాగ్రత్త గా చూడవద్దు, లెక్క లేకుండా ఉండవద్దు అని, వయస్సు 60 దాటిన వారు అసలు బయటకు రావద్దని. ఎవరూ వినడము లేదు, పెద్దలు మరియు చిన్నలు. అమ్మని కనీసము కూరగాయలు కొనేటప్పుడు తాకనీయడము లేదు, బయట తిప్పడము లేదు మీకు తెలిసిందే.
జులై 30 న ఆయన సామజవరగమనా లేదా ఇంకో టీవీ షో లో పాల్గొన్నారు. ఆ షోలో పాల్గొన్న అందరికీ పాజిటివ్ వచ్చింది. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారు కదా - అని వార్తలు వస్తున్నాయి, నిజం తెలీదు.
బాలు గారికి సినిమాల్లో మొదటిపాట పాడే అవకాశం కల్పించింది, కడప జిల్లాకు చెందిన ప్రఖ్యాత హాస్య నటుడు, నిర్మాత పద్మనాభం గారు. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రాన్ని. రేఖ & మురళీ ఆర్ట్స్ బ్యానర్ పై పద్మనాభం నిర్మించారు. ఆ సినిమాలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్య లతో కలిసి బాలు, ఏమి ఈ వింత మోహం, అనే పాటలో గొంతు కలిపి పాడారు. 1966 డిసెంబరు 15న మద్రాస్ లోని విజయా గార్డెన్స్ లో ఈ పాట రికార్డింగ్ జరిగింది. ఎస్.పి.కోదండపాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారు.
దాదాపు గా అన్ని భాషలలో ఆయన పాటలు పాడారు, డబ్బింగ్ చెప్పారు. సంగీత దర్సకత్వము చేసారు, నటించారు. ఘంటసాల గారితో, ఏకవీర చిత్రములో కలసి పాడారు, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అని.
ఓ పాపా లాలీ సినిమాలో, మాటే రాని చిన్నా దాని, సుదీర్ఘ శ్వాస గల పాట, లింక్ లో నే ఉంది, వినండి.
16 భాషలలో 40 వేల పాటలు, గిన్నిస్ బుక్ లో ఎక్కారు, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇంకా ఎన్నో అవార్డ్లు. బాడీ లాంగ్వేజ్, గొంతులకు అనుగుణంగా స్వరం మార్చి పాడారు.
ఆయనకు, గాయని ఎస్పీ శైలజ తో సహా, 2 సోదరులు మరియు 5 సోదరీమణులు ఉన్నారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, దక్షిణ భారత గాయకుడు, నటుడు మరియు నిర్మాత.
చరణ్ ను, అందరూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి, చాలా నష్టం జరిగింది. సంగీతమా, నటనా, సినిమా నిర్మాణమా ఎటూ తేల్చుకోలేక వాడు తడబడ్డాడు. చరణ్, ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు అని బాలు బాధపడ్డారు. అదే ఆయన, చివర బాధ.
అయితే కొన్న విమర్శలు కూడా ఉన్నాయి జీవితములో, ఘంటసాల గారు ఉన్నప్పుడు రామక్రిష్ణ, పీ బీ శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, రమెష్, వంటి వారు ఉన్నారు, అందరికి అవకాశాలు దక్కాయి. కానీ ఘంటసాల గారి తర్వాత, ఏక చత్రాధిపత్యముగా, దాదాపుగా ఎవరూ లేరు తెలుగు లో. బాలమురళి, జేసుదాసు గార్లు లాంటి వారు ఇతర సంగీతం మరియు భాషలలో సొంత ప్రావీణ్యము తో పైకి వచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ తో పడక, రాజ్ సీతా రాం అనే గాయకునికి, సిమ్హాసనం లాంటి చిత్రాలలో అవకాశము కల్పించారు. ఇళయరాజా గారు, బాలు కు అమెరికా లేదా వివిధ ప్రోగ్రాముల, సంగీత రాయల్టీ మీద నోటీసు కూడా పంపారని అంటున్నారు.
60 లేదా 70 దాటిన తర్వాత కూడా రిటైర్ అయి విశ్రాంతితో, ఇతరులకు సంపాదన అవకాశము ఇవ్వకుండా, తానే టీవీ ప్రోగ్రాం లలో పాల్గొంటూ వచ్చారని కొందరి అభిప్రాయము. ఘంటసాల గారి మధుర గాత్రము చే వచ్చిన, భగవద్ గీతను కూడా, తను మళ్ళీ పాడటం కొంతమంది నొచ్చుకున్నారు.
ఏది ఏమైనా, ఒక మహా గాయకుని ని కోల్పోయాము. దక్షిణాది భాషల సంగీత ప్రవాహములో, ఒక మధుర గాయకుని అధ్యాయము ముగిసింది. కానీ ఆయన పాటలు మనతోనే ఉన్నాయి.
ఈ వీడియోలో 3 గంటల పాటలు వినండి. పాట పేర్లు తో బొమ్మ ను చూసారా. చివర ఆసుపత్రి లో ఫోటో చూడండి.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,999; 104 తత్వాలు (Tatvaalu) and views 265,981
Dt : 25-Sep-2020, Upd Dt : 25-Sep-2020, Category : General
Views : 1000
( + More Social Media views ), Id : 722
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
south ,
indian languages ,
music ,
melodious ,
singer ,
actor ,
music director ,
balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments