మన ప్రజాస్వామ్యం లో, చిత్ర విచిత్రంగా నవ్వు వచ్చే అంశం? పార్టీ అభిమానుల కోరిక - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మన దేశ ప్రజాస్వామ్యం లో, చిత్ర విచిత్రంగా నవ్వు వచ్చే అంశం ఏమిటి? దానికి మేము ఎవరూ కాదనకుండా, అందరికీ తెలిసిన మాటనే, తేలిక పదాలలో చెప్పండి.

జవాబు, ధన్యవాదాలు, ఇదీ మంచి ప్రశ్ననే. ఏ సామాన్య వ్యక్తి లేదా ఓటరు, రక్షణ బాగు భద్రత ఆనంద స్వేచ్ఛ జీవితం కోసం, మన భారత పూర్వ పెద్దలు ప్రజాస్వామ్యం ను పెట్టారో, ఆ ప్రజాస్వామ్యం ను ఖూనీ చేయడం కాలరాయడం లో, నిర్దయగా మొదటి వెన్ను పోటు, మన ఓటరు దే అంటే మనదే.

మీరు వీపు మీద చేయివేసుకుని, దేవుని సాక్షిగా చెప్పండి, ఇది నిజం కాదంటారా? ఇది తెలియని ఓటరు, ఉన్నారా? కాకపోతే అంగీకరించరు, అది విచిత్రం. నిజం ఒప్పుకుంటే, కలియుగ పాపం పెరగదు కదా.

గత 30 ఏళ్లుగా, ఉదాహరణకు ఓ బాంక్ అధికారి/ ఉద్యోగి, తనకు కావాల్సిన నచ్చిన మెచ్చిన వర్గ దొంగల కు, లాకర్ తాళాలు ఇచ్చి, మిగతా అందరి ధనం దోచిన దాకా నవ్వుతూ, హాయిగా బిగ్ బాస్ సినిమా సీరియల్స్ చూస్తూ, చివరకు తన సొంత ఎకౌంటు లో ధనం కూడా సర్వం పోయాక, లబోదిబో మంటే, తప్పు దోచిన నచ్చిన మన వర్గ దొంగ దా? అవకాశం ఇచ్చిన విశ్వాస ఘాతకుడైన ఉద్యోగి దా? అలాగే, ప్రజాస్వామ్యం కు, అలాంటి ఉద్యోగి ఎవరు? ప్రతి ఓటరు కాదా, అంటే మనం కాదా, తప్పు మనదే కదా?

ఇంకా విచిత్రం ఏమిటి అంటే, నాయకులు ను ఓటేసి గెలిపించిన, సామాన్య ఓటరు ప్రభుత్వ ఆసుపత్రి లో దుర్భరమైన వైద్యం పొందుతూ ఉంటే, గెలిచిన నాయకులు ప్రభుత్వ ఖర్చు తో అంటే ఆ ఓటరు కట్టిన టాక్స్ ధనం తోనే, కార్పొరేట్ ఆసుపత్రిలో ఉత్తమ వైద్యం చేయించు కుంటున్నారు.

ఈ చిత్ర విచిత్ర పరిస్థితి కి కారణం కూడా, ఓటరే కాదా? మేం ఎలా చచ్చిన పర్లేదు, మా నాయకులు బాగుండాలి, అని ఇలా కుటుంబం ని కూడా త్యాగం చేసే, తనకు మాలిన ధర్మం పిచ్చి ఓటరు ని చూసి, పాపం అని కన్నీరు కార్చాలా లేక తగిన శాస్తి జరిగింది అని, గమ్ముగా ఉండాలా?

మొన్నటి దాకా, పల్లెటూరు లో చదువు లేని వారు మాత్రమే, అమాయకంగా పార్టీ ఉన్మాదం లో ఉన్నారు, అనుకున్నాం. ఇప్పుడు చదువు కున్న మూర్ఖులు కూడా, అలాగే తయారు అయ్యారు. విదేశాల్లో, పక్క రాష్ట్రాలలో, పార్టీలు కు అనుబంధం గా, సంఘాలు పెట్టి, అవే పిచ్చి ధర్నాలు జాతరలు ఊరేగింపులు చేస్తున్నారు. ఈ వాదన లు చూడండి, డిగ్రీ చదివి ఇంగ్లీషు వచ్చి, మంచి ఉద్యోగం లో ఉన్న వారి మాటలు

* ఓ అభిమాని - మా అన్న ఇలాగే, అప్పులు ఎన్ని చేసినా పర్లేదు, ఇంకా ఎక్కువ అప్పులు చేయాలి, స్థలాలు తాకట్టు పెట్టాలి, తీరభూములు విదేశీ కంపెనీల చేతిలో పెట్టాలి. వచ్చే 20 ఏళ్ల లో, ఇలాగే పంచాలి, సొంతముగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడకూడదు, ఇలాగె చేయి చాచి ఎదురు చూడాలి, నేలమీద కట్టుబడి ఉండ కూడదు, జిల్లా కో రాష్ట్ర రాజధాని చేయాలి, ఒక్క అమరావతి తప్ప. రాష్ట్రం మొత్తం తాకట్టు పెట్టినా పర్లేదు. మా చుట్టాలు స్నేహితులు, రోడ్డు న పడినా పర్లేదు. మా అన్నకు మరియు మాకు నష్టం లేదు, పక్క రాష్ట్రంలో మరియు దేశంలో లో ఆస్తులు ఉన్నాయి.

*ఓ అభిమాని - ఓడిన మా అన్న మరలా రావాలి, 20 ఏళ్ళు. ఓ మూడు జిల్లా లు, సింగపూర్ కు దుబాయ్ కు అమెరికా కు దత్తత లేదా ధారాదత్తం చేసినా పర్లేదు, మిగతా అన్ని జిల్లా లను, విదేశాలకు ధీటుగా తీర్చిదిద్దాలి. ముందు అమరావతి మాత్రమే పూర్తి చేయాలి. ముందు ప్రతిదీ, తాత్కాలికంగా కట్టుబడి కట్టాలి, ఆ తర్వాత నే అసలు, అప్పులు క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అదీ ముచ్చటగా 3 పంటలు పండే మాగాణి లోనే కట్టాలి. మాకు మరియు మా అన్నకు కూడా, ఇతర చోట్ల ఆస్తులు ఉన్నాయి, నష్టం లేదు.

ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చిత్ర విచిత్రం కాదా? ఈ ఇద్దరూ అభిమానులు ను జీవితములో కలప గలమా? రాష్ట్ర బాగు కోసం, వింటారా?

మనం చేస్తున్న పాపం ఫలితాలు, మనం అనుభవించ వద్దా? అందుకే కరోనా గురువు, ఎన్నో రూపాలతో, మరలా మరలా మన వెంట పడుతూ ఉంది. ఇది చివర కాదు మిత్రమా, మొదలే.

కనీసం కరోనా తో పోయే ముందు అయినా, నటన అసూయ ద్వేషాలు స్వార్థం మాని, మనసు విప్పి ఇలా వాస్తవం మాట్లాడుకుని, మంచిగా మారి, సద్గతి నైనా పొందుదాం. లేదంటే మరలా ఇదే పాప కూపం లో తిరుగుతూ నే ఉంటాము. పాపం, శమించుగాక.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 20-Dec-2020, Upd Dt : 20-Dec-2020, Category : Politics
Views : 171 ( + More Social Media views ), Id : 872 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : democracy , weirdly , funny thing , andhra , politics , desire , party fans , jagan chandra , bjp , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content