కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణ చే, పుణ్యం మనశ్శాంతి నిజమేనా? అంత సులువా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,884; 104 తత్వాలు (Tatvaalu) and views 225,802.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణ చే, పుణ్యం లభిస్తుంది అంటారు, నిజమేనా? అంత సులువా? నమ్మకం కలగడం లేదు. పామర భాషలో, అధికారిక రాజకీయం కలిపి, తేలికగా అర్థం అయేలా చెప్పగలరు.

జవాబు - ఇప్పుడు మీరు చదువుతున్న ఈ జవాబు, తెలుగు రాష్ట్రాలలో, విదేశాల్లో, అమెరికా లో, ఒకే సమయంలో, ఉచితంగా క్షణంలో చేరుతుంది అని, ఇది అందుకుని చదివే వారిలో సాధారణ కార్మికుడి నుంచి, చదువు కునే వారు, ఉద్యోగ వ్యాపారస్తులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు, ఇంజనీర్ లు, గృహిణులు ఉన్నారు, అంటే మీరు నమ్ముతారా? మీలో సాత్విక లక్షణము ఉండబట్టే, ఈ సందేశము మిమ్మల్ని చేరింది అని నమ్ముతారా?

ఒకవేళ నమ్మితే, పైన మీరు అడిగిన ప్రశ్న కు, జవాబు దొరికినట్లే కదా. అవును, పుణ్యం లభిస్తుంది.

20 లేదా 50 ఏళ్ళ క్రితం, ఇది సాధ్యమేనా? ఎంత కష్టం, ఎంత ఖర్చు, ఎంత సమయము కావాలి? అందరమూ నవ్వు తాము, ఇది ఇలా పంపడం అసాధ్యం అని.

కలియుగములో స్మరణ అంటే, నోటి తో భజన స్త్రోత్రం కాదు. నిరంతరం మనసు తో త్రికరణ శుద్దితో అంటే, చేష్టలు కూడా అలాగే ఉండాలి. పసి పిల్ల వాడు, తల్లి కోసం పరితపించే విధంగా ఉంటే, తప్పక పుణ్యం వస్తుంది, మనశ్శాంతి చేకూరుతుంది.

అరిషడ్వర్గాలలో మునిగి బానిసై, మనసు ధ్యానం కు సహకరించదు. రామాయణ భారతాలను చదవనివ్వదు. భగవద్గీత ఆచరణము చేయనీయదు. కాబట్టే, త్రికరణ శుద్దితో స్మరణ చాలు అన్నారు, పెద్ద ఆర్భాటలు లేకుండా.

పర మతాలలో, బీదలు మరియు వందల కష్టాలు ఉన్నా కూడా, అటే నడిపిస్తుంది భ్రమలలో. నీతి నియమాలను పాటించనీయదు. ఎదో ఒక ఆకర్షణలో చిక్కి, పాపం వైపు నడిపిస్తుంది.

అలాగే మనము రోజూ చేసే పూజలో, విగ్రహం కనపడకూడదు, దేవుడు మాత్రమే కనపడాలి. జాతీయ జెండాలో, మన దేశము కనపడినట్లు గా.

అలాగే అధికారులు నాయకులు కూడా, తాము నిమిత్త మాత్రులమని, హోదా మరచి, భగవంతుడి ఇచ్చిన అద్రుష్టముతో అందలముతో, మంచి ప్రజా పనులు చేసి, ఖ్యాతి పొందుదాము అనుకుంటే, వారు దైవ మరియు ప్రజల సేవకులు, మరియు వంశాలు తరిస్తాయి.

లేదు అధికారముతో సౌకర్యములతో హోదాతో పదవితో పలుకుబడితో అహంకారముతో, ఎవరినీ కానకపోతే మంచికి చేయూత ఇవ్వకపోతే, తర్వాత అధికారిక బదిలీ సస్పెండ్, మంత్రి పదవి ఊడి ఇంకొకరకు అవకాశము, తర్వాత మరోసారి పోటీకి ఎమ్మెల్యే టికెట్ కూడా దొరకదు, తమ వారసుడి పరిస్థితి శూన్యము.

గత 10 ఏళ్ళ మంత్రుల, నాయకుల మరియు అధికారుల పరిస్థితి చూస్తున్నాము కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,884; 104 తత్వాలు (Tatvaalu) and views 225,802
Dt : 19-Sep-2020, Upd Dt : 19-Sep-2020, Category : General
Views : 798 ( + More Social Media views ), Id : 708 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kaliyuga , remembrance , lord name , virtue , peace of mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content