మోహం లో, ధర్మం పాటించి చూపు అంటారు ఎగతాళి గా, మరలా వారే, గొప్పలు అంటారు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1617 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1652 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభ దినం, శుభ సంకల్పం. అందరం బాగుండాలి దేవుని కృపతో.

* మోహం లో ఉన్న వారు ధర్మం పాటించని వారు ఎప్పుడూ, ముందు పాటించి చూపు అంటారు ఎగతాళి గా మనలను. ఒకవేళ పాటిస్తే, మరలా వారే, గొప్పలు చెపుతున్నావు అంటారు. వారు మాత్రము ఏమీ పాటించరు. సాత్వికులు కొన్ని అయినా పాటించి, రాబోయే జన్మలు తగ్గించుకుంటారు. చిత్రం కదూ.

* రాబోయే ముఖ్యమైన రోజులు - ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, ప్రెసిడెంట్ డే 17, శివరాత్రి 21

* ఆయన 34 వ వారం 108 ప్రదక్షిణలు చేయించారు, ఉదయం 10 లోపు ఆగకుండా, ఖాళీ కడుపు పాదం, మంత్ర ఉచ్చారణ తో పాటుగా, కరమాల వేళ్ళ గీతల లెక్క, 3క్ష్3 గదుల పొడవు వెడల్పు గుడి, గంటా పది నిమిషం

* 6వ సంవత్సర, షుమారు 288 వారాల వ్రత నియమం, శనివారం ఉదయం 8 గుడి, 74 ఏళ్ల అమ్మ చేతితో 9 నవగ్రహ మరియు శివ సూర్య ప్రదక్షిణలు, నిమ్మ నేతి దీపాలు.

* 4వ సంవత్సర, షుమారు 192 వారాల వ్రత నియమం, తులసి లేదా కార్తీక నువ్వు ల దీపం ఇంటి హాలులో రోజూ, మామూలు పూజ కాకుండా.

* 74 ఏళ్ల అమ్మ, 6 లక్షల 80 వేల శ్రీ రామ రామకోటి, డిసెంబర్ 10 2019 కి.

* 20 సంవత్సరాల పైగా శాఖాహారం, నేల నిద్ర.

* మత్తు, పొగ, బయట తిండి, ఒంటి మీద వీసమెత్తు బంగారం కు దూరం.

పంపినవి ప్రతి అక్షరం మనసు కు ఎక్కితే, తెలీకుండానే సాత్వికులం. ఇవి ఫోన్ లో చెపితే అరగంట పడుతుంది మనసు అర్థం కు.

---
రెండు ఏళ్ల పైగా మనందరం, ప్రతి శనివారం, దేశ దేశాలలో ఉండి, మనకు వీలైన టైం లో చదువు కునే, మంచి మాటల భావాల, సత్సంగం ఇది. సహకారానికి ధన్యవాదాలు, నమస్కారాలు.

పైన విడిగా చెప్పిన, వృత నియమాలు ప్రదక్షిణలు, ఎవరు చేసారో ఎందుకు చేసారో, మనకు అవసరం లేదు. మనకు కావలసింది, 17 ఏళ్ల కు పైగా ఎక్కడో విదేశము లో ఉన్న, 45 ఏళ్ల పైన, ఒక హైందవ బలహీనుడు అర్భకుడు సామాన్యుడు చేయగా లేనిది, ఈ చిన్న చిన్న పనులు కొన్ని అయినా, మనము లేదా స్నేహితుల కుటుంబంలో, కుర్రవాళ్ళు లేదా సమ వయస్కులు చేయలేరా?

తెలుగు భాష, కన్న తల్లి దండ్రుల విలువ మరియు హిందూ ధర్మ ఆచరణ కు, ప్రచారం కోసం ఇది మన బాధ్యత అనుకుంటే చాలు కదా, కనీసం కొన్ని చేసినా చాలు కదా?

భక్త కన్నప్పలా, కళ్ళు ఇవ్వలేము. భక్త రామదాసు లా, గుడి కట్టి జైలు తన్నులు తినలేము. తిరుపతి తిరుమల మెట్లు మోకాళ్ళ తో చాలా కష్టం. 108 సాష్టాంగ ప్రదక్షిణలు అసలు చేయలేము.

కనీసం ఒక అల్పుడు చేసిన పైవి కూడా చేయలేమా? కోతి లాంటి మనసు ను వంచి, దేవుని కి నైవేద్యం చేయాలి.

ధన, నోటి, నటన, తిండి నైవేద్య పూజలతో దేవుడు దొరకడు. కఠిన సాధనతో, మనసులో ధ్యానం తో, పట్టుకోవాలి. మోహం వ్యామోహం వీడి, మరు జన్మ లేకుండా చేసుకోవాలి.

నారాయణుడి నామం, బలవంతంగా వినేపించేవారైనా, మన మంచి కోరే వారే. ప్రతి వారం ఇది మనకు చేరుతుంది అంటే మనకు దారి, భవిష్యత్తు కష్టాలు దూరం అయే చిట్కాలు దేవుడు ఇస్తున్నారు ఏమో, జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి ప్రతి మాట వెనుక ఉన్న పరమార్ధము.

---

ఏవండీ సత్సంగం అంటే ఎదురు ప్రశ్నలు, జనం కూడా ఉండాలి కదా

మీతో కలిపి, మా గురువులంతా ఉన్నారు కదా. ఎదురు ప్రశ్నలు, చీవాట్లు, భుజం తట్టే వారూ ఉంటారు. కొన్ని ఉదాహరణలు.

* పెద్ద గురువు లు తల్లి దండ్రులు ను చూసి లేదా చూస్తూ, ధన సంసార వ్యామోహం లేకుండా, ఉండేవారు. ఇప్పుడు అల్లా పలకరు, నాలాంటి అల్పులతో. ఇంకొన్నాళ్ళు పడుతుంది.

* మధ్య గురువులు ఎదురు ప్రశ్నలు కు సమాధానాలు, అప్పుడు అప్పుడు కధల రూపంగా చూస్తున్నారు. ఇప్పుడు మీ ప్రశ్న లాగా.

* చిన్న గురువు లు, ఓరి బాబోయ్, పొరపాటున నీ మెసేజ్ లు మా ఆవిడకు చూపించా. నా తాడు తెగుతుంది సంవత్సరం నుంచి. నెలకు ఒకసారే మాంసం, బయట హోటల్, శనివారం పొద్దున్నే లెగవాలి. నువ్వు ఆపరా బాబు, ఇప్పుడు దాకా ఎవడూ చేయడు విదేశాల్లో, అని తప్పిచ్చుకున్నా. నువ్వు ఈ రకంగా చావ కొడుతున్నావు, సాక్ష్యం తో. రేపు గుళ్ళో కూడా 108 చేయమంటదేమో, దేవుడా.

* నిద్ర గురువు లు. నువ్వు వంద పంపు, తిట్టు, అసలు నాకు సంబంధం లేదు, అని గమ్ముగా ఉంటారు. పాపం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ను, చూస్తే జాలి వేస్తుంది.

* ఉత్తమ గురువు లు, అబ్బాయి 60 ఏళ్ళు వచ్చినవి. మంత్రం పలకలేను, పద్మాసనం వేయలేను, కిందే కూర్చోలేను. దేవుడు గీవుడు ముసలి తనం లో చూద్దాం అనుకున్నా వయసులో ఉన్నప్పుడు. చాలా పెద్ద తప్పు చేశాను. అశక్తుడను, నన్ను నీలో చూసుకుంటున్నా. కొనసాగించు, నా ఆయుష్షు తో.

ఇలా తిట్లు, బూతులు, అవమానాలు, ఆశీర్వాదం లు అన్ని ఉంటాయి. అవి చెప్పి మిమ్మల్ని విసిగించను. చిన్నగా అర్థం చేసుకుంటారు, మారతారు ఏనాటికైనా గురువు లు అని నా ఆశ.

---

ప్రతి శనివారం, పంపినదే మరలా మరలా పంపుతున్నారు. ఉపయోగం ఉందా?

ఉంది కదా. గురువు లు తమ పనులు ల లో లేదా మోహం లో ఉంటారు, ఇంకో ఐదు ఏళ్ల కైనా నా మొర ఆలకించి మారవచ్చు కదా. ఏ గురువు ఎన్ని వారాలకు చూస్తారో తెలీదు కదా. దేవుని కి కావాలసింది, ఇంకో నారాయణుడి మార్పు. చివరగా గుర్తు ఉన్నవి కొన్ని,

* తిరుపతి దగ్గర గురువు, వాళ్ళ అబ్బాయి తో 108 చేపిచ్చారు అన్నది గుర్తు ఉందా. గతంలో

* నిన్న వారం, ఒక గురువు, పాపం మన శిష్యుడు రెండు ఏళ్లుగా ఏడుస్తూ ఉన్నాడు అని, మొదటసారిగా తెలుగు రాసి కాగితం ఫోటో, గొంతు మాట రికార్డు, నేర్చుకుని పంపారు కదా

* అమెరికా తూర్పు నుంచి, మొదటి సారి తెలుగు టైపు చూసాం కదా.

ఇవి కూడా చేయము, మా ఇష్టం అంటే గురువు ల ను, చేయగలిగి నది ఏముంది. శని రాహు కేతువు లు దయ కలిగినప్పుడు, మిగతా వారూ మొదలు పెడతారు, భ్రమలు తొలిగి.

కృష్ణయ్య ఏం చెప్పారు, ఫలితం నాకు వదిలేయి. మనస్పూర్తిగా నీ ప్రయత్నం చేయి. మన ప్రయత్నం ఆగదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1652 General Articles, 61 Tatvaalu
Dt : 08-Feb-2020, Upd Dt : 08-Feb-2020, Category : Devotional
Views : 895 ( + More Social Media views ), Id : 325 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pradakshina , god , illusion
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content