Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. జిల్లా పేరు చూసి, వాళ్ళ జిల్లా గోల మాకెందుకు అనుకోకు మిత్రమా. అవే సమస్యలు, మీ వరంగల్, ఆదిలాబాద్, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం మరియు ఇతర జిల్లాల లో కూడా ఉంటాయి.
మీకున్న బలం, బలగం, పలుకుబడి, అంతస్థుల కు, ఇంకా మీ జిల్లా అధికారులు తొందరగా పలికి, మంచి పనులు చేయవచ్చు ఏమో. ఏదైనా ప్రయత్నాలు చేసిన కదా, ఫలితాలు తెలిసేది. వాళ్ళు పలకకపోయినా నష్టం లేదు మిత్రమా. మీరు చేసిన నిస్వార్ధ ప్రయత్నాలు, దేవుని ఎకౌంటు లో పడతాయి. అదీ లాభమే కదా, మన భవిష్యత్ లో, చివరి అంకంలో, మన కష్ట కాలంలో.
మీ అందరి కన్నా సామాన్యుడుని. కనీసం నేనెవరో, ఎక్కడ ఉంటానో కూడా, వారికి చాలామందికి తెలీదు, అవసరమూ లేదు. మా ప్రాంతము తెలుసు, కానీ ఏ కార్యక్రమంలో కనపడడు, రాడు, వీడి దుంపతెగా, ఊరు జిల్లా రాష్ట్రం విషయం లు రాస్తాడు.
కాసేపు జగన్ ను పొగుడుతాడు, కాసేపు చంద్రబాబు ను పొగుడుతాడు, అలాగే ఇద్దరకు చురకలు. ఏంటో వీడో రకం, అనుకుంటారు. మనము పంపే మెసేజ్ లు, మెసేజ్ అవసరాన్ని బట్టి, రాష్ట్ర జిల్లా గ్రామ అధికారులు కు పార్టీ నాయకులు కు కూడా, వెళతాయి. అది గోప్యంగా ఉంటుంది. ఫేస్బుక్ ట్విట్టర్ లో కూడా టాగ్ చేయబడతాయి. ఇమెయిల్ కూడా వెళుతుంది. ఎందుకంటే, కొంతమంది వాట్సప్ ఆపేస్తారు కదా తలనొప్పి భరించలేక, అయినా వదలకూడదు ప్రయత్నము.
మీకూ రాయడం వస్తే మీ ప్రాంత సమస్య, సొంతం గా రాయండి. లేదా కొంచెము చెప్పి, మన రాతల దాంట్లో జిల్లా పేరు తీసి మీ జిల్లా చిత్తూరు వరంగల్ అని పెట్టండి, పంపుకోండి, మంచి కోసం. మీ ప్రయత్నాలు మీరు చేయండి.
అది ఊరు, జిల్లా సమస్య అయితే, ఫోటో వీడియో సాక్ష్యం తో, మీ మాటలను మాకు పంపండి. తప్పులు సరిచేసి, మేమూ మీ జిల్లా అధికారి వెంట, ఆయన పైన రాష్ట్ర అధికారులు వెంట పడవచ్చును.
మనమూ మన ఇల్లు మన పిల్లలు మన కుటుంబం, అన్న స్వార్థం తో జీవితాంతం ఉంటే, రేపు నష్టం కూడా మనకే. రేపు మన పిల్లలు కూడా, నా వరకే ముఖ్యం అనుకుని, మనల్ని రోడ్డు న వేస్తారు లేదా వదులుతున్నారు.
మన జనం, మన స్నేహితులు బంధువులు, మన ఊరు, మన జిల్లా అని నేర్పిన, మన రాతలు కూడా బాగుంటాయి మిత్రమా. ఇవన్నీ గొప్ప కోసం కాదు, బాగుకోసం. మానవ సేవ యే మాధవసేవ. రాముడు కృష్ణుడు వ్యాసుడు వాల్మీకి చేసింది అదే.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,436; 104 తత్వాలు (Tatvaalu) and views 221,595 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments