Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. నవరాత్రులు వచ్చాయి, అమ్మ ల గన్న అమ్మ పెద్దమ్మ పండగ వచ్చేసింది. ప్రతి చిన్న గ్రామములో కూడా సంబరాలు, అలంకారాలు, ఉత్సవాలు.
భక్తులు తండోప తండాలు గా పెద్ద గుడులు అయిన బాసర సరస్వతమ్మ, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబిక, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మల దగ్గరకు బయలుదేరారు వరద లాగా.
అటు తిరుమల లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇసక వేస్తే రాలనంత జనం. జన్మ లో ఎప్పుడూ చూడలేదు. వెళ్ళలేక పోతున్న అని ఏడుస్తూ ఉంటే పెద్దాయన, మా తమ్ముడు దగ్గరకు వచ్చి నా, నా దగ్గరికి వచ్చినట్లు అనే సరికి తెనాలి, ద్వారకా తిరుమల, చిలుకూరు, మా సొంతూరు శ్రీనివాసుడు దగ్గరే సర్దుబాటు చేసుకుంటున్నా.
అలాగే రేపు ముక్కోటి , శివరాత్రి అంటే మరలా లక్షల మంది. ఏ పండగైనా, ఇంతే కదా, అశేష జనవాహిని.
ఒక దేవుడు నచ్చినా నచ్చకపోయినా , ముక్కోటి దేవతల లో ఎవరో ఒకరిని ఎంచుకోవచ్చు పూజించుకోవచ్చు. రాముడు, కృష్ణుడు, విష్ణువు, అమ్మవార్లు. మరి ఇంత మంది దేవుళ్ళు , ఇన్ని పండుగ లు, ఇంత మంది జనం చేస్తున్నారు అంటే, వారందరికీ మన దేవుళ్ళ మీద భక్తి గౌరవం ఉన్నట్లే గదా.
తొందరపడి అవును అనొద్దు. ఎందుకంటే, ఈ దేవుళ్ళందరి మీద మన తాతల కున్న అపార నమ్మకం గౌరవం మనకు ఉంటే, మరి కొత్త బెంగాల్ బాబా దగ్గరకు, కర్నూలు బాబా దగ్గర కు , ఎందుకు వెళుతున్నాము?
పై దేవుళ్ళ మీద నమ్మకం లేకనా? మరి కొత్త బాబా నే, దేవుడై అన్ని చేసేటప్పుడు, మరలా పాత దేవుళ్ళ దగ్గరకు ఎందుకు? అంటే, కొత్త బాబా దేవుని కూడా పూర్తిగా నమ్మమా? ఏమిటో మన మీదే మనకు నమ్మకము లేదు ముందు.
దీనినే 4 పడవల మీద కాళ్ళు, మూడు ఇళ్ళు మీద చేతులు అంటాము. చివరకు ఎవరికీ కాకుండా పోతాము. నిజము కాదా?
మన ఇంట్లో అమ్మ , నాన్న మన దేవుళ్ళు. అలాగే మన ముక్కోటి దేవతలలో ఒక జంటను ఎంచుకో, దేవుడు ఒక్కడే అనుకోవాలి సుమా. బాబాయి ల ఇంటి కెళ్ళి నట్టు, మిగతా ముక్కోటి దేవుళ్ళ దగ్గరకు వెళ్ళు తప్పులేదు, మనసు కంట్రోల్ చేయడానికి. వెళ్ళకపోయినా వాళ్ళు బాధపడరు, ఎందుకంటే వారంతా ఒక్కటే.
ఈ విధముగా అప్పటికే, తిరిగి తిరిగి పూజలు చేసి చేసి అలసిపోతే, ఇంక మనకు కొత్త బెంగాల్ బాబాలు, దొంగ స్వాములు, దొంగ గురువు లు ఎందుకు. మనము అంత పిచ్చివారమా? మన తాతల కన్నా గొప్ప వారమా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,261; 104 తత్వాలు (Tatvaalu) and views 225,826 Dt : 03-Oct-2019, Upd Dt : 03-Oct-2019, Category : General
Views : 1339
( + More Social Media views ), Id : 180 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
navaratri ,
dasara ,
temple crowd ,
devotees ,
new baba ,
fake baba Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments