బాబాయి మాట విని ఉంటే, ఎలక్షన్ నష్టం లేదు. పెద్దోడు ఒక్కడి మీదే, అనుమానం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,994; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అబ్బాయి, నువ్వు చెప్పావు అంటే, ఏదో ముందు చూపు జాగ్రత్త ఉంటుంది, ఖచ్చితం గా వారి క్షేమం ఉంటుంది. బాబాయి నీ మాట విని ఉంటే, ఎలక్షన్ నష్టం ఉండేది కాదు. పెద్దోడు ఒక్కడి మీదే, ఎందుకు అనుమానం నీకు? బయటకు ఇవి అవసరమా?

ధన్యవాదాలు, ఇలా అడిగి, మా తమ్ముడు కూడా మర్యాదగా మాట్లాడితే, ఇంత దూరం రాదు. మా బాబాయి కష్ట సమయములో ఆదుకున్నారు, మా సొంత బాబాయి తో పాటుగా. వారిద్దరి రుణం తీర్చుకోవాలి తప్పక. ఇది అంతా మనకు అనవసర తలనొప్పి అయినా భరించాలి, తప్పుదు అని ఇలా చెపుతున్నాడు గోపీ.

ఈ బాబాయి కుటుంబం సాధారణముగా గొడవలకు పోరు, గత అనుభవం బట్టి. చాలా తగ్గి ఉంటారు. వీరు మోస పోతారే గాని, ఇంకోకరిని మోసం చేసే తెలివి తేటలు లేవు, అనుకుంటున్నాను. ఉదాహరణకు చెపుతా, పిన్న అమాయకురాలు, మొదటి నుంచి కూడా. నీళ్ళు పాలు తేడా తెలీదు.

మొన్న మా అమ్మను చూపించి, ఇలా అమ్మ గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఇవి సేవలు అని చూపిస్తే, అరగంట సేపు కూడా, కన్నీళ్ళు కారుస్తానే ఉంది. అంత పిచ్చి తల్లి, అని నా నమ్మకం.

ఆ ఊరు బంధువులు అందరిలో, నాకు ఎప్పుడూ అన్నం పెట్టింది, అమ్మ గురించి ఎప్పుడు అడిగేది, ఈ ఒక్క పిన్ని మాత్రమే. ఆమె అంటే, గౌరవిస్తా, తల వంచుతా.

చెల్లెలు అంతే, అమాయకురాలు అనుకుంటున్నా, పిన్ని లాగనే. ఉదాహరణకు, ఇప్పుడు నేను చెపితే అడిగితే, ఏమ్మా అడిగే వాటిలో తప్పులు ఉన్నాయా, అంటే లేవు అంటుంది, అన్న చెప్పిందే కరెక్ట్ అంటుంది.

తర్వాత ఇంకొకరు ఫోన్ చేసి కుట్రతో కుతంత్రముతో నటనతో, కలగజేసుకుని మాయ మాటలు చెప్పి, మీ అన్న చేస్తుంది తప్పు కదా అంటే, అవును అంటుంది. నాది తప్పు అంటుంది, గంట సేపు వారితో, ఏదో చెపుతుంది, వారి లొపల ఆలోచన అర్ధం చేసుకోలేక.

అంతే గాని, మీరు గత 2 ఏళ్ళు గా ఎక్కడ దాంకున్నారు. ఇప్పుడు, మా కుటుంబం మీద, హట్టాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చింది, మాకేదో మంచి చేస్తున్నట్లు నటన వద్దు. నేను వడ్డీ బాబాయి దగ్గర కు పోయి, కన్నీళ్ళు పెట్టుకుని, నా కాపురం కూల్చొద్దు మా ఇంట్లో నిప్పులు పెట్టొద్దు, మా డబ్బులు వడ్డీతో ఇవ్వమని ప్రాధేయపడితే, వారు ఇవ్వలేదు. అద్దె ఇంట్లో నుంచి కూడా బయటకు పంపారు.

మరి పెద్ద మనుషులు మీరు వచ్చి, ఇది తప్పు, ఆ ఆడపిల్ల డబ్బులు ఇవ్వండి, ఇది అన్యాయం, డబ్బులు లేకపోతే, ఇంట్లోనే అద్దె లేకుండా ఉచితము గా ఉంచండి అని అన్నారా?

పోనీ మీ సొంత అన్నదమ్ముడు వడ్డీ బాబాయి గురించి, సంవత్సరము గా అన్న, అన్ని సందేశాలు పంపుతుంటే, మీరు బాబాయి మరియు అన్నతో మాట్లాడి రాజీ చేసి, ముదుసలి పెద్దమ్మ ధనం నా ధనం ఇతర బాబాయిల ధనం, ఎందుకు ఇప్పించ లేదు? మీ నాటకాలు చాలు అంటుందా? అనదు, వారి మాటలకు తందానా అంటూ, నా మీదే కోపము చూపిస్తుంది, జరగబోయే పరిణామాలు ఊహించలేక.

కానీ పెద్దోడు చాలా తెలివి గల వాడు, ఈ ఇద్దరు కన్నా. ఐశ్వర్య అహంకారమే ఉంది అనుకున్నా ఇప్పుడు దాకా, వాడి ని ఎవరో రెచ్చగొడితే నే వాడు, ఇలా తప్పుగా అమర్యాద గా మాట్లాడుతున్నాడు, అనుకుంటున్నా.

పక్కన ఇంకొకరు వాడికి పాములా బుస కోడుతూ మాటలు అందిస్తున్నారు, ఇంటి పామో లేక బయటి పామో. పాపం తప్పుదోవ పట్టిస్తున్నారు, భవిష్యత్ పరిణామాలు తో, పిల్లలకు నష్టం జరగాలని.

అన్ని త్వరలోనే, వారికి వారే, చెప్పుకుంటారు బయటకు. మీరే అంటారు, ముందే ఇవన్నీ చెప్పావు జాగ్రత్తలకు అని.

నాతో చిన్నప్పుడు నుంచి కూడా, ఏవో నొటికి వచ్చిన అబద్దాలు చెపుతూ ఉంటే, నవ్వుతూ, ఒరే నాటకాలు ఆడకు, నాకు తెలుసులే నీ సంగతి అనేవాడిని.

వాళ్ళ ప్లాట్లు కూడా తీసుకోమని, గేటు అవతల ఎఫ్ సీ ఐ గోడౌన్ దగ్గరకు కూడా తీసుకుని వెళ్ళాడు, బాబాయి స్వర్గస్తులైన తర్వాత కూడా. గతము లో చూసా కదరా, ఎందుకు మరలా అన్నా కూడా, మరీ చూయించాడు ఊరక చూడులే అని, రైల్ దగ్గర దింపాడు.

నాకు నమ్మకమైన వారి దగ్గర నుంచి, 3 సమాచారాలు వచ్చాయి. నీ తమ్ముడు, వడ్డీ బాబాయికి వెన్నుపోటు ఇంకో బాబాయి కొడుకు చేసినట్లుగా, అలాగే సొంత అమ్మకు అలాగే చిన్న అమాయకపు తమ్ముడికి, అక్కకు ద్రోహం చేసే ఆలోచనల ఉంది అని.

వెన్నుపోటు గురించి గత సంవత్సరమే తెలిసినా, బాబాయి పిన్ని ఫోన్ ఆపడం వలన, చెప్పలేకపోయాను. చెప్పినా కూడా, ఆ రోజు వారు నమ్మరు నమ్మలేరు. ఇప్పుడు, స్వతంత్ర అభ్యర్ధి ఎలా గెలిచారు, ఇటు మన వైపు, మంత్రి అండ బలగం ధనం ఉన్నా కూడా? ఆలోచన చెయ్యండి, మీకే జవాబు వస్తుంది.

అందుకే ముందు, తమ్ముడు తోనే మాట్లాడి, నిజం తెలుసుకుని, అనుమానాలను తొలగించుకుందామని, వాడికి సంవత్సరము గా ఫోన్ చెస్తున్నా, ఎత్త లేదు, తిప్పి చేయడు. అప్పుడే చెప్పా, తమ్ముడు నువ్వు మారకపోతే, వడ్డీ బాబాయి తర్వాత, నీ గురించే చెప్పాలి అని.

మొన్న వారం ముందు కూడా, ఫోన్ చేసి జవాబు రాక, అమ్మ తో అక్క తో, చెప్పినా. వారు మా వలన కాదు, చేతులు ఎత్తేసారు, ఫోన్ చెయించలేక. మొదటి మెస్సేజ్ లో కేవలము అనుమానాలు అని రాసి, వాడి ని ఫోన్ చెయమని, కేవలము ఇంట్లో ముగ్గురు కే పంపా. కానీ జవాబు లేదు. వాడు ఫోన్ చెయ్యకపోతేనే మంచిదేమో ఇంకో 3 ఏళ్ళు అన్నా కూడా.

కానీ ఈ విషయాలు బయటకు రాకపోతే, చిన్న తమ్ముడు కు, పిన్ని కి అన్యాయం జరుగుతుంది. అందుకే, మీలాంటి పెద్దలు ఎవరైనా, ఆ 6 ప్రశ్నలకు జవాబులు అడిగి ఇస్తారని, అందరికీ ఇక తప్పని సరి పరిస్థితిలో పంపాను. తప్పు అంటే, మీరే చెప్పగలరు పెద్దలు. ఇంక వాడి నుంచి సమాధానాలు రాబట్టడానికి, ఇంకో మార్గం ఏముంది? దొంగ లాగా చాటు గా ఉండి, ఈ పరిస్థితికి తెచ్చింది, పెద్దోడు కాదా? అందరి చరిత్రలు బయటకు అవసరమా?

వడ్డీ బాబాయి విషయము లో బయటకు రాని, విష సర్పాలు, ఇప్పుడు బయటకు వచ్చి, వారి కుటుంబం మీద ప్రెమ ఒలకబోసి, చాటుగా తేలవలసిన విషయాలను, ఇంక పెద్ద గా చేస్తూ, వాడి చేత అమర్యాద గా మాట్లాడిస్తూ, గబ్బు పట్టించడము అవసరమా? పెద్దలు మీరే చెప్పగలరు.

ఇప్పుడు అయినా, వాడు మంచి మనసుతో, ఆ 6 ప్రశ్నలకు జవాబు చెప్పి, తనకు దురుద్దేశ్యాలు లేవు అంటే చాలు. మిగతా అవి నిజాలో అబద్దాలో నాకు అవసరము లేదు.

వారు మధ్యవర్తి గా ఉండి చెప్ప మంటే తప్ప. ఎందుకంటే, వాళ్ళ నాన్న చెప్పిన అన్ని మాటలు, ఇంటి గురించి షాప్ గురించి పెళ్ళిళ్ళ గురించి నాకు మాత్రమే తెలుసు. అవి బయట పెట్టను, వారి మంచి కోసం, వారి తప్పులు సరి చేయడము తప్ప.

- - -

జాగ్రత్త గా చూడండి, ఎక్కడ ఎవరి పేరు బహిరంగముగా లేదు.

ఒక్క మా దొంగల ముఠాకే అర్ధము అవుతాయి. బయట జనాలకు ఇవి, అర్ధం కాని కాకమ్మ కధలు. ఇంకా మా తమ్ముడు క్షేమం నేను కోరుతూనే ఉన్నాను అనడానికి, ఇదే సాక్ష్యం.

నాన్న అన్ని సమకూర్చి కొట్లో పెట్టి, అందరినీ రప్పించి వ్యాపారం చేస్తే, నేను కొడుకు గా ఉండి, వ్యాపారం పెంచినా అభివ్రుద్ది చేసినా, అదీ నాదే ను, మా నాన్న కు చేతకాదు, అని చెపుతున్నాడు అంటే, ఎంత అమాయకుడు.

తప్పు తమ్ముడూ, నాన్న లాగా పెద్దరికం చూపించి, సర్దుకో గలిగితే, తమ్ముడుకి సగ భాగం ఇవ్వు. అమ్మ కూడా, అలాగే చెయాలి. నోరు లేని వాడిని, మీరు ఇద్దరూ మోసం చెయ్యవద్దు.

మోసము బలము తో లాక్కున్నది, మనకు అచ్చి రాదు. ఇతర ఇళ్ళలో జరిగే వెన్నుపోటులు మన ఇంట్లో వద్దు. నీతి గా ఉందాము.

కనీసం మీరు ముగ్గురు అయినా కలిసి ఉండాలి, మోసం చేసుకోకుండా. అదొక్కటే మా ప్రార్ధన, మా తో పలకక పోయినా ఇబ్బంది లేదు. తర్వాత మీ ఇష్టం మీ అమ్మ ఇష్టం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,994; 104 తత్వాలు (Tatvaalu) and views 225,010
Dt : 18-Apr-2021, Upd Dt : 18-Apr-2021, Category : General
Views : 700 ( + More Social Media views ), Id : 1113 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle , election , loss , doubt , elder , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content