ఊళ్ళో ఉన్న వారు ఉన్న కొమ్మను విరిస్తే, ఊరు బయట వారు తెప్ప తగలేసే రకం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,417; 104 తత్వాలు (Tatvaalu) and views 224,886.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పచ్చి అవకాశ వాద, వ్యాపార పూరిత, చపల చిత్త, బలహీన మనసు లు, ఎక్కువగా తెలుగు (దేశమంతా ఇదే పరిస్తితి ఏమో) వారివే నేమో కదా. విపరీతమైన చావు తెలివితేటలు ఉంటే, పెరుగుట విరుగుట కొరకే కదా. సందేహం ఎందుకు.

యధా ప్రజా, తధా రాజా. కొందరేమో హుస్సేన్ సాగర్ చుట్టూ, ఆకాశ మిద్దెలు మనవడు కడతారు, అని ఐకమత్యంగా జోగుతూ ఉన్నారు.

ఇంకొకరేమో మా ఊరే మా ప్రాంతమే రాజధాని కావాలి ఏహే అంటే, ఇంకొకరేమో మాకేమో మూడు లేదా ముప్పై కావాలహే, అంటారు.

ఇంకొకరేమో పచ్చని మూడు పంటల పొలాలు అయినా, నాశనము చేసి మిద్దెలు కడదాము అంటారు. ఇంకొకరు మాకు రాజధాని వచ్చింది, స్థలము రేట్లు పెరిగింది అని సంబరాలు.

ఇంకొకరేమో ఎక్కడ రాజధాని పెడితే, అక్కడ బినామీ తో కొందాం అంటారు, ఏడైనా లాభ పడదాం, డబ్బు ఉంది చేతిలో.

ఇంకొంతమంది పోయిన ఎలచ్చన్ కి వెయ్యి కో పని కో వర్గానికో అమ్ముడుపోయాము , మరలా వచ్చే ఎలచ్చన్ దాకా నిద్రో నిద్ర.

తెలుగు వారు అంటే వేరే రాష్ట్రం, నగరం లేదా దేశం లో, అల్లుడిరికం లేదా ఉద్యోగరికం కోసం పోయిన వారూ ఉంటారు కదా. మాకు బెంగుళూరు, హైదరాబద్, చెన్నై లేదా ఢిల్లీ లేదా విదేశం ఉంది అని మౌనం, పట్టించుకోని తనం.

ప్రత్యేకంగా విడి అవకాశవాదులు గా చెప్పాల్సిన పనిలేదు, నాతో కలిపి అందరమూ, ఆ తాను లో ముక్కలు మే కదా.

ఊళ్ళో ఉన్న వారు, తాము ఉన్న కొమ్మను విరిచే రకం అయితే, ఊరు బయట ఉన్న వారు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. భూతద్దము తో వెతికినా ఎవరిలోను నీతి లేదు, అందుకే మనందరం బాధ్యులమే.

మనం సమస్య లో లేకపోయినా, మన తల్లి దండ్రులు, బంధువులు, చిన్న నాటి స్నేహితులు, మనం పైకి రావడానికి ఉపయోగపడిన పెద్ద మనుషులు, పుట్టి పెరిగిన నేల, మన ఊర్లో లేరా లేదా?

వారి తరుపున కనీసం బాధ వ్యక్తం చేయలేని, రాళ్ల మా, బండలమా, కృతఘ్నులమా? తప్పు ను తప్పు అని అనక, పారిపోతే అవకాశవాదులుం కామా?

కనీసం అభిప్రాయం వ్యక్తం చేయలేమా, వారు వినకపోయినా, మన మాటకు విలువ లేకపోయినా, కాసేపు వర్గము అవకాశము స్వార్థం వీడి.

అందుకే రామాయణం లో ఉడుత, జటాయువు సాయం గురించి చెప్పినది. ఇక ఎన్నటికి మారమా?

అని నిద్రలో గొణుక్కున్నాడు సోమనాధము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,417; 104 తత్వాలు (Tatvaalu) and views 224,886
Dt : 23-Jan-2020, Upd Dt : 23-Jan-2020, Category : Politics
Views : 944 ( + More Social Media views ), Id : 284 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu state politics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content