APLatestNews.com top Banner

Social Media links
కరెంటు పోతే, టివీ ఆగుతుంది మనమూ చూడలేము, అంటే అవి లేనట్లే నా, పనికి రానట్లేనా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఓం నమో నారాయణాయ, ఓం కరోనా గురవేనమః. ప్రపంచం మొత్తానికి, భాషా ప్రాంత సమయ భేదం లేకుండా, ఒకే సిలబస్ తో క్రమసిక్షణ పాఠాలు చెప్పిన ఘనత మీదే, భగవంతుని తర్వాత. కరుడు గట్టిన హృదయాలు, ఇప్పుడైనా కరుగుతాయని ఆశిద్దాం.

ఇంట్లో 75 ఏళ్ల అమ్మ పాద పూజ ఎప్పుడు లాగనే మంత్ర సహితముగా. ఎప్పుడు లాగనే దేవాలయములో శివ శనైశ్చర నేతి దీపం, అమ్మ చేయి పట్టుకుని నవగ్రహ ప్రదక్షిణలు.

ఆ భగవంతుని దయ వలన, 41 వ వారం, 108 ప్రదక్షిణలు, పరగడుపున, ఉదయం పదిలోపు, కరమాల వేళ్ళ గీతల లెక్క తో, ఓం నమో నారాయణ ఉచ్చారణ తో, ఉత్త పాదాలతో, గంట లోపు, 3 గదుల వెడల్పు పొడుగు ఉన్న గుడి చుట్టూ, తిరిగే భాగ్యం కలిగించారు. కరోనా జాగ్రత్తలు తో ముక్కు మూతి కవచం తో, భౌతిక దూరం కూడా సుమా.

దేవుని నమ్మకం లేని వారికి కూడా, ఇది వ్యాయామం, ఉదయం 5 కి లేవడం ఆరోగ్యం, తిరుగుతూ, గంట పాటు కరమాల లెక్క దైవ నామ స్మరణ, మనసు ను అదుపులో ఉంచుతుంది కదా.

మీ తల్లి దండ్రులు లేదా ఇతర పెద్దలు, లేదా పిల్లల తో మీకు పాద పూజ భాగ్యం కలిగించి, స్నేహితులు బంధువులు పిల్లల కు అలవాటు చేసే ప్రయత్నం చేస్తారని విన్నపము, గురువు లు అందరికీ. సంస్కారం కు తొలిమెట్టు ఇంట్లో నే ఆరంభము కావాలి.

త్రికరణ శుద్ది గా అరిషడ్వర్గాలను జయించనిదే అంటే మనల్ని మనం జయించనిదే, దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న లేదా జవాబు రెండు అనవసరం మరియు అర్థం కావు. మన లోన ఉన్న దైవం, చీకట్లోనే కనపడకుండా దాగుంటుంది.

ఇంట్లో కరెంటు పోతే, టివీ ఆగుతుంది రిమోట్ కనపడదు, కరెంటు వచ్చిన దాకా కదా. అంటే అవి లేనట్లే నా, పనికి రానట్లేనా, ఇంకో చోట టీవీ రాదా? అంతా అబద్దమా? కాదు, కరెంట్ లేకుండా చీకట్లో చూసే శక్తి మనకు లేదు, చూపించే సక్తి ఆ టీవీకీ లేదు. కరెంటు ఉంటే నే చూడగలం.

అదే మనలోని జ్ఞానం మిత్రమా. టీవీ కి మనకు మధ్య కరెంటు ఉంది, అది కావాలి, దానిని కొనవచ్చు. దేవుని కి మనకు మధ్యలో, ఆత్మ జ్ఞానం ఉంది, సాధనతోనే అది పొందాలి ఎవరికి వారు, దానిని కొనలేము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 18-Jul-2020, Upd Dt : 18-Jul-2020, Category : General
Views : 139 ( + More Social Media views ), Id : 603 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : no power , tv stops , tv useless , god , spiritual knowlege , pradakshina , temple
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content