బతికి ఉంటే సద్బుద్ది, శాశ్వత నిద్ర పోతే సద్గతిని ఇవ్వాలని, మాత్రమే భగవంతుని కోరాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,919; 104 తత్వాలు (Tatvaalu) and views 225,716.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

రోజూ మన వాట్సప్ స్టేటస్ ఉదయం, సాయంత్రం చూడటం మరువద్దు, దైవ స్మరణ కు, లోకం పోకడకు, అదీ ఒక సాధనం, మన అరచేతిలో. మీ అరిషడ్ వర్గాల సాధన పురోగతి, పంచభూతాల గౌరవం, త్యాగాలు, ఉన్నంతలో 25 టు 50 శాతం మాత్రమే సౌకర్యాలు వాడడం గురించి కూడా, ప్రతి వారం అందరికీ చెప్పగలరు. వాల్మీకి వ్యాసుడు ఆదిశంకరులు కృష్ణుడు లాంటి సత్పురుషులు లాగా, మీరూ శిష్యులు దగ్గర ఏదీ దాచరని నమ్మకం.

అందరూ మరియు ఎక్కువగా ఇతరులు, ఎవరైనా తెలిసిన వారు శివైక్యం చెందినపుడు, రెస్ట్ ఇన్ పీస్ ఆత్మ కు శాంతి కలుగు గాక అనో ఇంకోటనో అంటారు, వారికి తోచిన విధంగా, .

దాని అర్థం, అశాంతి తో ఇన్నాళ్ళు బతికి అశాంతి తో నే పోయారు, అలాగే అక్కడ కూడా అశాంతే అని మనమే నిర్ధారణ చేయడం భావ్యమా?

కానీ మనం అలా అనకూడదు అంటారు పెద్దలు, ఎందుకంటే భగవద్గీత ప్రకారం, ఆత్మ తడవదు కాలదు నాశనం కాదు.

పాత చొక్కా విడచి కొత్త చొక్కా మనం ధరించిన విధంగా, మన ఆత్మ కొత్త శరీరం ను (అది ఏ శరీరం అయినా కానీ) ధరిస్తుంది, కర్మఫలితం కోసం అని మన విశ్వాసం.

కాబట్టి మనిషి బతికి ఉంటే సద్బుద్ది ఇవ్వాలని, ఒకవేళ మనిషి శాశ్వత నిద్ర లోకి వెళితే, వారికి సద్గతిని ఇవ్వాలని, మాత్రమే భగవంతుని కోరాలి. మిగతా ఎటూ జరుగుతుంది, ఆ మనిషి కర్మఫలితం ను బట్టి.

సద్గతి అంటే భగవద్గీత ఆచరణ సాధ్యం కు అలాగే స్తితప్రజ్ఞత సాధన కొరకు, తర్వాత అయినా ఉత్తమ జన్మ కలగడం. ఒకవేళ వారు పుణ్యవంతులు అయితే, దైవ సన్నిధితో పరిపూర్ణ మోక్షం, మరుజన్మ లేకుండా.

పాపాత్ములు అయితే అరిషడ్ వర్గాలకు లోబడి తే, మనశ్శాంతి ఎటూ ఉండదు ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ, వాటి ఫలితాలు ఎటూ మరలా జన్మలో వచ్చి అనుభవించాలి. మరి పైన నరకం ఉంటే, అందులో కూడా పాలు పంచుకోవాలి, శిక్షలు తర్వాత, మరలా జన్మకు రావాలి.

కాబట్టి భగవద్గీతను నిత్యం చదువుతూ, దానిని ఆచరణలో ఈ జన్మలో పెట్టకపోతే స్తితప్రజ్ఞత సాధించకపోతే, ఎన్నో జన్మలు ఇలాగే ఎత్తి, ఈ అష్ట కష్టాలు పడాలి పడుతూనే ఉండాలి.

అందుకే గీతాచార్యుడు అంది, కోటి మంది లో ఒకడు మాత్రమే నా వైపు చూస్తాడు అని. ఆ ఒకరు మనం కావాలంటే, ఎంత కష్టపడి ఎన్ని త్యాగాలతో ఎన్ని తక్కువ సౌకర్యాలతో సాధన చేయాలి?

నిజాయితీగా కాలేజీ, ఊరు, జిల్లా, రాష్ట్రం మొత్తం లో పదవ తరగతి ఫస్ట్ రావాలంటే, ఎంత కష్టపడి చదవాలో, మొదటి 10 రాంకర్ ల ను అడగండి? కనీసం మొదటి వంద రాంకు లలో ఉండాలన్నా, కష్టం తప్పదు కదా?

మరి భౌతిక రాంకు కు ఇంత ఇన్ని కష్టాలు పడితే, ఆధ్యాత్మికంగా రాంకు కోటిమందిలో ఒకరు గా అంటే ఎంత కష్టపడి సాధన చేయాలి? ఎప్పుడు అరిషడ్ వర్గాలు ను జయించాలి? ఆధ్యాత్మికంగా మోసం చేయలేము కదా, మనల్ని మనం?

మరి మోక్షం పొందాలని ఉంటే, ఎంత నిబద్ధత, నిజాయితీ, సంస్కారం, సమయ పాలన, త్యాగం, ధ్యానం, యోగం కావాలి?

ఉదయం 5 కి లెగవకుండానే పైవి సాధించగలమా? శరీరం శ్రమ పడకుండా, తక్కువ సౌకర్యాలతో సర్ధుబాటు చేసుకోకుండా, అవి సాధ్యమా?

అమ్మ 76 ఏళ్ళ వయస్సు లో ఒళ్ళు, కాళ్ళు, కీళ్ళు నొప్పులు బీపీ షుగరు అన్ని ఉండి, మనిషి చేయి పట్టుకుని నడుస్తూ కూడా, ఉదయం 5 కి ఆనందంగా లెగిచి పనులు చేస్తూ దైవపూజ చేయడం లేదా, స్తోత్రాలు చదువు తూ కన్నీళ్లు తో?

మరి మనం లెగవలేమా? లెగవకుండానే దేవుని చేరగలమా, బద్దకం తో?

అవీ రోజూవారి చిన్న చిన్న పనులు నే, వంద శాతం నిజాయితీ తో చేయలేకపోతే, భగవంతుని పని లో నిజాయితీ నిబద్దత తో చేయగలమా? కఠిన పరీక్షలు కు నిలబడగలమా?

30 ఏళ్ల వయస్సు తర్వాత కూడా, ఇవి అలవాటు కాలేదు చేయడానికి రాలేదు అంటే, 60 ఏళ్ల కు ముదుసలి పనిచేయని శరీరం మనసు అవయవాలు తో, మనకు చేయడానికి మనసు వస్తుందా?

ప్రతి ఒకరు ఎవరికి వారే ఆలోచన చెయ్యాలి, పదేళ్ళు వయస్సు లోపు నుంచే ఇవి అలవాటు కావాలి, చేయాలి.

భగవద్గీత, మనిషి పోయాక తన ఆత్మ వినడానికి కాదు, పిల్లల వయస్సు లోనే ఆత్మ శుద్ధి ఆత్మ బలం సంస్కారం పెంచుకోవడానికి, ఆ తర్వాత ఆచరణలో జీవితం మార్చుకోవడం కు, అరిషడ్ వర్గాలు ను జయించడానికి.

మనల్ని మనం మార్చుకుని, మలుచుకుని, దేవుని పై దృష్టి నిలపాలని కోరుతూ

ముందు సజీవ దైవం గురువు లైన అమ్మ నాన్న పాదదాసుడు,

తర్వాత నే హరిహర ఆచరణ సేవా దాసుడు,

పుట్టుపూర్వోత్తరాల తో, గురుపరంపర తో, త్రిమూర్తులను ఆరాధించే, తేట తెలుగు, హైందవ గురువులు, బ్రహ్మం రాఘవేంద్ర వేమన లను ముందు గౌరవించే పూజించే (నిబద్ధత తో ముందు సొంత తండ్రిని సేవించు తర్వాత బాబాయి),

ఈ అజ్ఞాన శిష్యుడు శ్రీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,919; 104 తత్వాలు (Tatvaalu) and views 225,716
Dt : 17-Dec-2021, Upd Dt : 17-Dec-2021, Category : General
Views : 709 ( + More Social Media views ), Id : 1281 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : alive , mind , sattvic , sleep , life , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content