మన రాష్ట్రాలు - హైదరాబాద్ సముద్రం, నాయకుల కేసులు, వైద్య పరుగులు, దుర్గమ్మ ఫ్లైఓవర్, లోకేష్ పబ్లిసిటి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,946; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* హైదరాబాద్ లో సముద్రం, నదులు, కాలువలు ఇళ్ళు లోకి వీధుల్లో కి తెచ్చి, ఇంధన పొదుపుతో తెడ్డు పడవల ప్రయాణం తో, బంగారు తెలంగాణ లో, వినూత్న కోణాన్ని, ఫాంహౌస్ నుంచే ఆవిష్కరించిన, కేసీఆర్ కు, జన నీరాజనాలు.

కేసీఆర్ ను మాత్రమే మరలా, ఎన్నుకుంటాం అంటున్న మోకాళ్ళ లోతు నీళ్ళ లోని యువతరం. వర్షాలు పడితే నిప్పులు రావు కదా, నీళ్ళే గదా వచ్చేది, మేమేమి చెయ్యగలం, అని మంత్రి జ్ఞాన బోధ.

కరోనా కష్ట ఈ సమయంలో, ప్రయాణాలు ఖర్చులు లేకుండా, నవరాత్రి నది కార్తీక సముద్ర స్నానం, భాగ్యనగరం లోనే ఇంటి ముంగిటే కొంతమందికి ఇంట్లో చేయించి, పుణ్యం కట్టుకున్నారు అని ప్రశంసలు.

డ్రైనేజీ వ్యవస్థ బాగు దేవుడు ఎరుగు, ముందు చక్కగా ఉన్న బిల్డింగ్ లు కూల్చి, కరోనా సమయంలో, కొత్త కట్టడాలు ప్రయత్నం ముందు చూపుకు జోహార్లు అంటున్న అభిమానులు.

నిరుద్యోగ సమస్య ఎక్కడా ఉండకూడదు అని, ముందు తన ఇంట్లో నే ఆ సంకల్పముతో, జనం తిరస్కరించిన కవితక్కను, లోకేశ్ అన్న మార్గం లో దొడ్డి దారిన, ఎమ్మెల్సీ తో పాటుగా, మంత్రి పదవికి సన్నాహాలు అని ఊహాగానాలు.

* 4 రోజులు పరిస్థితి వైకాపా తెదేపా బీజేపీ జనసేన ఫేస్బుక్ చూడండి చాలు, ఎవరు రోడ్డు మీద జనం తో ఉన్నారు, పాలు పంచుతున్నారు, మాటలో ఫోటోలో తెలుస్తోంది.

* పాత కేసులు సంవత్సరం లోపు తేల్చాలని నిర్ణయం తో, భయంతో జగనన్న జడ్జి ల మీద, లేనిపోని ఆరోపణలు అని తెదేపా.

ఓటుకు నోటు కేసు లేదా ఇతర భయంతో, ఆంధ్రా కు ఇప్పుడు తండ్రి కొడుకు లు, హైదరాబాద్ నుంచి వచ్చారు అని వైకాపా.

ఏది నిజమో తెలీక, జుట్టుపీక్కుంటున్న సామాన్య జనాలు.

* ఎమ్మెల్యేలు, మంత్రులు వైద్యం కోసం, పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతుంటే, సంవత్సరం జగనన్న గాని, గత ప్రభుత్వ చంద్రన్న గానీ, తిరుపతి విజయవాడ వైజాగ్ లలో, ఈ ఆసుపత్రులలో ఈ సదుపాయాలు ఉన్నాయి, దయచేసి వెళ్ళవద్దు, అని ప్రకటనలు ఇద్దరూ ఇవ్వడం లేదు, ఎందుకు? బీజేపీ, జనసేన కూడా దీని గురించి, ఉదాహరణలతో సహా సదుపాయాలు ఉన్నాయి లేదా లేవని చెప్పడం లేదు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు కూడా, కరోనా తో హైదరాబాద్ చికిత్స కు వెళ్ళినట్టు వార్త.

* విజయవాడలో దుర్గమ్మ, కేంద్ర నిధుల ఫ్లైఓవర్ ప్రజలకోసం, ప్రరంభించిన కేంద్ర మంత్రి, గడ్కారీ. తెదేపా తో ప్రారంభం అయింది అని వైకాపా తో పూర్తి అయింది అని ప్రకటనలు. కేశినేని ఆనందము.

* చంద్రన్న చిన్నగా పక్కకు తప్పు కుంటూ, చినబాబు కు పార్టీ పగ్గాలు మరియు పబ్లిసిటీ అని అనుమానం. మహిళా అధ్యక్షుల మీటింగ్, వరద ప్రాంతంలో పర్యటన, జనం సమస్యలు ప్రస్తావిస్తూ, జనం తో తిరుగుతూ ఉన్న యువనాయకుడు లోకేష్.

* అమెరికా లో హోరాహోరీ, నువ్వా నేనా అంటున్న, ట్రంప్ బైడెన్. ఇళ్లు కు చేరిన పోస్టల్ బాలెట్లు. ఓట్లు తో పాటుగా, స్ధానిక సమస్యలు కు పరిష్కారం, ప్రశ్నలు రూపంలో, జవాబు కోసం ప్రజల నెత్తిన.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,946; 104 తత్వాలు (Tatvaalu) and views 225,003
Dt : 16-Oct-2020, Upd Dt : 16-Oct-2020, Category : Politics
Views : 786 ( + More Social Media views ), Id : 758 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hyderabad , sea , kavita , leader , cases , medical runs , durga flyover , lokesh publicity , america
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content