Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
హౌడీ మోడీ కార్యక్రమం అంటే, టెక్సాస్ ఇండియా ఫోరం (TIF) చేత, భారత ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా ఆయనను గౌరవించుటకు, సెప్టెంబర్ 22 ఆదివారం, టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జి స్టేడియంలో, నిర్వహించే కమ్యూనిటీ సమావేశం, ర్యాలీ, బహిరంగ సభ అని అనవచ్చు.
మేలో రెండోసారి ప్రధానిగా వచ్చిన తర్వాత, ప్రధాని మోడీ, ఇది మొదటిసారి అమెరికా పర్యటన. వచ్చే సంవత్సరం ట్రంప్ ఎన్నికలలో పాల్గొనాలి 2 వ సారి గెలవటానికి. ఇప్పుడు, భారతీయులందరను కలిసే అవకాశం కూడా ఇది.
ప్రవాస భారతీయుల నుద్దేసించి, మోడీ ప్రసంగిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఉచిత పాస్‌ల కోసం, ఈవెంట్ కోసం, మూడు వారాల్లో 50,000 మందికి పైగా భారతీయ అమెరికన్లు/ప్రవాస భారతీయులు రిజిస్టర్ అయ్యారు. ఇంకా చాలా మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు.
పోప్ కాకుండా, యునైటెడ్ స్టేట్స్ సందర్శించే, ఆహ్వానించబడిన విదేశీ నాయకుడి కోసం, ప్రత్యక్ష ప్రేక్షకులు పాల్గొనే అతిపెద్ద సమావేశంగా చెప్పవచ్చు. 1,000 మందికి పైగా వాలంటీర్లు మరియు 650 టెక్సాస్ ఆధారిత స్వాగత భాగస్వామి సంస్థల సహకారంతో, హౌడీ మోడీ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయబడింది.
కాగా మూడు నెలల్లో, జపాన్‌లో జి-20 శిఖరాగ్ర సమావేశం, ఫ్రాన్స్‌లో జరిగిన జి-7 శిఖరాగ్ర సమావేశం తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మూడో కలయిక/ సమావేశం అనవచ్చును. అంటే, రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడుతున్నాయి.
ఈ సమావేశములో ప్రసంగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌ను స్వాగతిస్తున్నందుకు, టెక్సాస్ ఇండియా ఫోరం ఉత్సాహంగా ఉంది. హౌడీ, మోడీ! షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్ - కమ్యూనిటీ సమ్మిట్ కు హాజరయ్యే వారు 48 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, భాగస్వామ్య విలువలు మరియు ఆకాంక్షలను నొక్కి చెప్పడానికి కలిసి వస్తారు. రెండు గొప్ప దేశాల పురోగతి కి, ప్రపంచ శాంతి, శ్రేయస్సు మరియు మానవులకు ముఖ్యమైన భాగస్వామ్యం ఇది.
ఈ ప్రత్యేకమైన కార్యక్రమం, అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్యం అధ్యక్షుడు, అతిపెద్ద ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన మంత్రి, ద్వైపాక్షిక ప్రతినిధి బృందం, గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు ను ఒక చోటికి తెస్తున్నది.
కశ్మీర్ వ్యవహారం ద్రుష్ట్యా, వివిధ రూపాలలో భారత వ్యతిరేక ప్రదర్శనలు/ ధర్నాలు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు.
హ్యూస్టన్‌లో ప్రధాని మోడీ, ట్రంప్ సమావేశానికి ముందు, ఇరు దేశాల అధికారులు వాణిజ్య ఒప్పందాన్ని, ఇరు దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాలు, ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) కార్యక్రమం కింద, లబ్ధిదారుల అభివృద్ధి చెందుతున్న దేశంగా, భారతదేశం యొక్క హోదాను జూన్లో అమెరికా రద్దు చేసింది.
జూన్ 5 నుండి, బాదం మరియు ఆపిల్ తో సహా 28 యుఎస్ ఉత్పత్తులపై, భారత్ ఎదురు/ ఎగష్టా సుంకాలను విధించింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం లేదా యుఎన్‌జిఎ సమావేశాల సందర్భంగా, వచ్చే వారం న్యూయార్క్‌లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సమావేశం కానున్నారు.
US President Donald Trump will share stage with Prime Minister Narendra Modi for the first time ever at the -Howdy Modi- event in Houston on Sunday. 50,000 Indian Americans to be expected for this event. This event is organized by Texas Indian Forum. Trade deals may be finalized in this meeting or trip.
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2262 General Articles and views 2,562,718; 104 తత్వాలు (Tatvaalu) and views 273,990
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments