Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ఏవండీ కరోనా ను కూడా, దైవ దూతగా ఎలా చెపుతున్నారు? ఎక్కువ మంది, భయపడుతూ ఉంటే, ముందు వివరణలో?
అందులో నే సమాధానం ఉంది గురువు గారు, కాస్త ఆలోచన చేస్తే అర్ధము చేసుకుంటే. హైందవం ప్రకారం,
1. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పెద్దలు చెప్పారు కదా. కారణం లేకుండా ఏదీ జరుగదు ఈ జగత్తులో. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టే శక్తి, సామాన్యులకు ఉంటుందా?
2. కేవలం అది దైవ శక్తి, కాబట్టే నర నారాయణులు అయిన డాక్టర్లు, పోలీసులు, అధికారులు, సలహాలు ఇస్తున్నారు, తప్పించుకునే మార్గాలు చెపుతున్నారు. వారి మాట విని కరోనా కు, దూరంగా ఉండాలి. అది రాక్షస శక్తి అయితే, సజ్జనుల తో సహా, ఎవరిని కూడా వదలదు కదా. భోపాల్ విషవాయువు ఎవరినీ విడువలేదు.
3. అశ్వత్థామ కౌరవులు తో ఉండి ప్రయోగించిన, నారాయణ అస్త్రం పాండవ సేన మీదకు వచ్చే టప్పుడు, కృష్ణుని మాటలు వినండి. దానిని నేనూ ఆపలేను, కానీ తప్పించుకునే మార్గం చెపుతా. అన్ని శస్త్రాలను త్యజించి వాహనములు దిగి, ప్రశాంత మనసు తో, యుద్ధ కాంక్ష వీడి, గమ్ముగా ఉండండి, కదలకుండా. అది మనలను తాకదు, ఏమీ చేయదు అన్నారు. భీముడు అలాగే రధం మీద ఉన్నారు, అతనిని కిందకు లాగారు. అలాగే జరిగింది, ఎవరినీ ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది.
కరోనా కూడా అంతే కదా, అధికారులు మరియు ప్రభుత్వము మాట పాటిస్తూ, ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి, భగవంతుని ప్రార్ధిస్తూ.
4. త్రిమూర్తులు లో, శివయ్య పని ప్రపంచం ను, శుభ్రం చేసి ఖాళీ చేయడం. హరించే వాడు హరుడు. కరోనా కొంతమంది ని పట్టి కూడా అంటే, తప్పు సరిచేసుకున్న వారిని, ఏమీ చేయకుండా నే, వదిలింది కూడా.
5. భూత ప్రేత పిశాచాలు మొదలగు అన్ని గణాలకు అధిపతి శివుడే. ఆ తర్వాత వినాయకుడు, కుమార స్వామి. కరోనా లేదా వ్యాధులు కూడా, ఓ బుల్లి భూతం లాంటి వే.
సజ్జనుల జోలికి రావు, వారు దారి తప్పనంత కాలము. దారి తప్పితే, వారినీ వదలదు. ఇంట్లో నే ఉందాం ప్రశాంతంగా.
6. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, మన అందరికీ మహానుభావులు, దైవ స్వరూపులు.
అదే రాక్షసుల ను అడగండి ఆ ముగ్గురు గురించి. వారంతా కూడా భూతాలు చెడ్డవారు, తమ సుఖమయ రాక్షస జీవితాన్ని నాశనం చేశారు అంటారు, తమకున్న రాక్షస బుద్ధి తో.
7. దక్ష యజ్ఞం గుర్తు ఉందా. పార్వతి ని అవమానించారని, శివుని తల వెంట్రుక నుండి, ఉద్భవించిన వారు వీరభద్రుడు. ఆయన వెళ్లి, దక్ష యజ్ఞం ప్రాంతము మొత్తం, సర్వ నాశనం చేస్తారు. వాళ్ళందరి అహంకారం ను అణచివేస్తారు. అప్పటి వరకూ, శివుని మరియు కాల భైరవుడు ని ద్వేషించిన, దక్షుడు అతని పరివారము, శరణు కోరతారు.
అంటే కాల భైరవుడు కూడా, ఒకే సమయములో, ఒకరికి పిశాచం లా, ఇంకొకరి కి దైవం లా కనిపించారు. నిజంగా రాక్షసులు దేవతలు అని విడిగా ఉన్నారా? మన గుణ గణాలే అవి.
8. పోనీ పురాణాలు వద్దు, నేటి పరిస్థితి చూడండి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కారణ జన్ములు, కాదా.
ఆలోచన చెయ్యండి ఎంతమంది, వారిని పొగిడేవారు ఉన్నారో, అంతమంది తిట్టుకునే వారూ ఉన్నారు కదా? దైవ స్వరూపం అనే వారూ ఉన్నారు, కాదూ అనేవారు ఉన్నారు.
కారణ జన్ములు అని నా మాట కాదు. జనం మాట, కోట్ల మంది భారతీయులు, మోడీ ని ఎన్నుకున్నారు, రెండో సారి కూడా అంటే, సామాన్యమైన విషయం కాదు కదా.
అలాగే, రాజకీయ వాసన పదవులు లేని వ్యక్తి, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు గా చెప్పే వ్యక్తి, ట్రంప్ ను, చదువు కున్న జనం, స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు. అంటే అదీ సామాన్య విషయం కాదు కదా.
ఈ ఇద్దరు కూ కూడా, నోరెత్తి ఎదురు చెప్పే, ప్రతి పక్షాలు లేనే లేవు. ఇంకా ప్రతి పక్షంలో వారు కూడా, కొన్ని సార్లు, వీరినే సమర్దించారు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక.
మరి మనం కూడా వారిని సమర్దించే వారి వైపా లేక వ్యతిరేకించే వారి వైపా? జీవిత అనుభవం తో నే, నిర్ణయం తీసుకోవాలి.
ఎన్ని కష్టాలు పడ్డా, రాముడు ధర్మం వీడలేదు. ఎన్ని కష్టాలు పడ్డా, పాండవులు కృష్ణుని వీడలేదు. మనమూ అంతే, ధర్మం వైపే ఉండి, కష్టాలు అవమానాలు ఎదుర్కొని, భగవంతుడు కృష్ణుని వైపే చూద్దాం.
రెండు నెలల లాక్ డౌన్ కే మనం ఇబ్బంది పడితే, మనకు తెలిసిన వాళ్ళలోనే , స్వచ్ఛందంగా, రెండు ఏళ్ళు పైన, లాక్ డౌన్ లో ఉన్నవారు ఉన్నారు, మీకు తెలుసా? మనసు ను అడగండి, కళ్ళు తెరిచి చుట్టూ చూద్దము, ధైర్యంగా ఉందాము.
సర్వేజనా సుఖినో భవంతు
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,515; 104 తత్వాలు (Tatvaalu) and views 266,161
Dt : 14-Apr-2020, Upd Dt : 14-Apr-2020, Category : General
Views : 1267
( + More Social Media views ), Id : 494
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
corona ,
kovid 19 ,
arishadvargalu ,
sri rama ,
sri krishna ,
naluDu ,
panDavulu ,
daksha yajnam ,
veerabhadhruDu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments