APLatestNews.com top Banner

Social Media links
జిల్లా కలెక్టర్, జిల్లా అధికారి, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే బాగా పని చేస్తున్నారా స్ధానిక కొలబద్ద ఏమిటి? - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

సింపుల్, ప్రతి ప్రాంతంలో, ఒక పంచాయతీ ఈవో, ఎమ్మార్వో, హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ పంచాయతీ కమీషనర్, సీఐ/ ఎస్సై ల సోషల్ మీడియా సమాచారమే కనీస కొలబద్ద, ఒక యూనిట్ సాక్ష్యం. ఇంకో తేలిక మార్గం లేదు, మాటలు అంకెలు గ్రాఫ్ లు నమ్మ లేము, అవి ఉన్నా కూడా, సోషల్ మీడియాలో సాక్ష్యం చేతలలో గత 6 నెలలుగా ఉండాలి.

ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, కలెక్టర్ గారు తమ మీటింగ్ లో, హఠాత్తుగా ఒక ఊరు (ఉదాహరణకు చీరాల, కావలి, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, వరంగల్, అదిలబాద్) లేదా గ్రామం పేరు చెప్పి, ఆ ప్రాంత అందరు అధికారుల సోషల్ మీడియాలో, గత వారం నుండి జరిగిన పనులు చూపించండి అంటే, ఏమి జరుగుతుంది? ఒక సారి తిట్లు తిన్నా, తర్వాత అయినా, జాగ్రత్త పడరా? ఇక ఆ ముఖ్యమంత్రి గారు, జీవితములో ఓడిపోవడం ఉంటుందా?

వీరంతా అంటే స్ధానిక అధికారులు, రోజూ సోషల్ మీడియాలో అభివృద్ధి పనులు, తమ సిబ్బంది సేవలను, కరోనా జాగ్రత్తలు ప్రజలకు చిత్తసుద్దితో తెలియజేస్తున్నారా? రోజుకు పావు లేదా అరగంట గంట చాలు సోషల్ మీడియా నింపటానికి వివరాలు తో. ఈ విషయాలు గమనిస్తే, అర్ధము అవుతుంది.

తెలియ చేయకపోతే, వీరెవరు ఆ ప్రాంత అభివృద్ధి ని పట్టించుకోకుండా ఉన్నారు. ఊరక, ముఖ్యమంత్రి గారి మీటింగ్ ల లో అంతా బాగుంది అని, ఆహా ఓహోఅ అంటూ, ఏదో ఒక ఉత్తమ ప్రాంత వివరాలు లేదా అంకెల గారడి చూపించి, పై పై మాటలు చెబుతున్నారు, నటిస్తున్నారు.

చంద్రబాబు గారిని భ్రమలలో ఉంచి, కష్టపడినా కూడా అవమానకరంగా గద్దె దింపి నట్లే, జగన్ (లేదా కేసీఆర్) గారి ప్రభుత్వం ను కూడా భ్రమలలో ఉంచి, తమ పబ్బం గడువు కుంటున్నారు. నవ రత్నాల ఫలాలు అందరు ప్రజలకు చేరవు, ఒక వర్గానికే లేదా కొంతమందికే చేరతాయి. అసంతృప్తితో రగిలిన ప్రజలు, ప్రభుత్వం ను మార్చేస్తున్నారు.

వీరు చేసిన పని, రోజూ సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటే, మిగతా శాఖలు మరియు పై అధికారులు, కూడా తమ పని చూపించాలి కదా? బద్దకం గా నిద్ర పోతున్న లేదా అవకతవక వ్యవస్థ లు అన్ని, తప్పులు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి.

వారి సరిగ్గా పని చేయకపోతే, సోషల్ మీడియాలో రోజూ చూపించడానికి, ఏమీ ఉండదు కదా? పని లేని దగ్గర, స్టేటస్ ఏమి ఉంటుంది? రోజూ సోషల్ మీడియాలో పెడితే, ఏమి జరుగుతుంది? చూడండి. సమర్ధవంతంగా పాలన ఉంటుంది, గొప్ప అధికారులు బయటకు వస్తారు, వారిని ప్రజలు ఆరాధిస్తారు. ఉత్తామ అంధ్ర కల్లెక్టర్ సోషల్ మీడియాలో, చిత్తూర్ జిల్లా కలెక్టర్ గారు. సాక్ష్యం వారి సోషల్ మీడియా ఫోటో లు వీడియో లు. ప్రజలు న్యూస్ పేపర్లు చదవడం తగ్గిపోయింది.

ఏదో సినిమాలో చెరువు తవ్వాము, రోడ్డు వేశామని లక్షలు దోచేశారని చూసాము కదా ఏమీ చేయకుండా నే, అవన్నీ అలాంటివి ఎన్నో బయట పడతాయి. ఉదాహరణకు ఓ పంచాయతీ లేదా మున్సిపాలిటీ రోడ్డు లేదా చెరువు కోసం లక్ష ఖర్చు పెట్టి, ఈ రోడ్డు వేస్తున్నాము చెరువు పూడిక వారంలో పూర్తి అవుతుంది అని, ఆ ప్రాంత సోషల్ మీడియా లో పెడితే, ఆ గ్రామ ప్రజలు అంతా, అది నిజమా కాదా అని కామెంట్స్ పెడతారు. ప్రతిపక్ష నేతలు లేదా వైరి వర్గాలు, దాని గురించి ఆరా అడుగుతారు. అధికారులు ఎదుట, పంచాయతీ పెడతారు వాస్తవం కోసం.

అంటే వాస్తవాలు మాత్రమే చెప్పాలి పబ్లిక్ గా, నటించడం కష్టం. పంచాయతీ ఈవో ఎమ్మార్వో గారు, ఈరోజు ఇన్ని కార్డులు, ఇన్ని ఫింఛన్లు, ఇన్ని స్ధలాలు పంచాము అని స్పష్టంగా చెప్పాలి. గ్రౌండ్ లెవల్లో అంటే స్ధానికులు వెంటనే, ఇది నిజం ఇది అబద్ధం అని, తేల్చేస్తారు. గగ్గోలు పెడతారు, పై అధికారులు నాయకుల కు, తప్పులు వెంటనే తెలిసిపోతాయి, సరిదిద్దుకోవాలి అంటే.

పంచాయతీ ఈవో గారు వివరాలు పెడుతున్నారు అంటే అర్థం, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు సోషల్ మీడియాలో నిజాలు చెప్పాలి. అలాగే ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా అధికారులు. ఎస్సై, సిఐ, డీఎస్పీ కూడా ఇలాగే చెప్పాలి, లా అండ్ ఆర్డర్ గురించి. వీరందరి పనులు, కలెక్టర్ గారు ఎమ్మెల్యే ఎంపీలు, తమ సోషల్ మీడియాలో కూడా చూపించాలి అభినందించాలి. అది ఉత్తమమైన పని తీరుకు, ఒక కొలబద్ద ప్రజల ఎదురు గా, ఏరోజు కారోజు.

ఇలా అందరూ, పనుల సమాచారం ఇస్తున్నారా లేదా అని ఆ ప్రాంత ఉత్తమ బాధ్యత గల ఎమ్మెల్యే, ఎంపీలు గమనించాలి. లేకపోతే తర్వాత తమ సీటు మరియు ప్రభుత్వం, ఉండదు కదా. ఈ పరిస్థితి జగన్ గారికి చెప్పి, ఇంకో ఐదేళ్లు మరలా వచ్చే విధంగా లేదా ప్రతిపక్షాలు ఈ పనులు చేపించి, తాము అధికారంలోకి వచ్చే విధంగా చేసుకుంటాయని ఆశిద్దాం.

మీ సలహాలు సూచనలు తెలియజేయండి మీ అధికారులు, మీ నాయకుల కు, వారిని మరియు మీ ఊరిని మీరు ప్రేమిస్తే, మాతృభూమి మాతృమూర్తి పై కృతజ్ఞతలు ఉంటే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 674 General Articles, 46 Tatvaalu
Dt : 25-Jul-2020, Upd Dt : 25-Jul-2020, Category : Request
Views : 70 ( + More Social Media views ), Id : 612 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : district , collector , officer , sp , mp , mla , doing well , best measurement , jagan , kcr , chandrababu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content