ఇష్టమైన ఎవరూ తోడు లేకుండా, ఒంటరిగా ఉన్న ముదుసలి వారిని, ఎవరు ఆదుకుంటారో ఎలా ఓదారుస్తారో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,067; 104 తత్వాలు (Tatvaalu) and views 225,556.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తెలీదు, బహుశా భవిష్యత్తు లో మనము చూడబోతున్నాం, మన ముదుసలి వయస్సు లో లేదా రోగానితో మంచం పట్టిన తర్వాత, అని గొపీ రాముతో ఇలా చెపుతున్నాడు.

చిత్రం ఏంటి అంటే, ఇన్ని కధలు వార్తలు సినిమాలు చూస్తూ కూడా, ముదుసలి కదలలేని వయస్సు లో మనల్ని ధనం, ఆస్తులు, అధికారం, హోదా కాపాడతాయి, విశ్వసనీయత క్రుతజ్ఞత కన్నా అని నమ్మడం.

మన ఇంటి చుట్టూ ఎన్నో ఉదాహరణలు ఉన్నా, అందరికీ తెలిసిన, మన అన్న ఎంటీయార్ మనకు ప్రత్యక్షముగా, మనకు బుద్ది చెప్పి వెళ్ళారు కదా, అదంతా బ్రమ నాటకం అని, ఎవరు రారు అవసరం తీరాక అని?

అయినా మనకు సిగ్గు రాదు, బుద్ది మారదు. అదే ప్రాపంచిక మాయ. మనం కూర్చున్న కొమ్మ మనమే విరగ కొడుతున్నాము అని అందరికీ తెలుసు, కానీ విరగ కొట్టడం మానలేరు, అదే మానసిక బలహీనత.

ధనం కట్టి న ఆశ్రమంలో కూడా, మనం సొంతగా నడవలేకపోతే విలువ ఉండదు, ప్రేమ ఆప్యాయత ఎటూ దొరకదు, అంత మంది లో ఒకరిమి. మనకన్నా లక్షలు కోట్లు కట్టిన వారూ అక్కడే పోటీ లో ఉంటారు, పాపం వారి పరిస్తితి అంతే.

ఇంట్లో వారు బయట వేసారు, అన్న అవమానం జీవితం వ్యర్ధం అయ్యింది అన్న బాధ, లోన కాలిపోతూ ఉంటుంది, పైకి ఎన్ని అబద్దాలు చెప్పినా, తమ తప్పులు ఒప్పుకోలేరు. పశ్చాత్తాపం వీరికి తెలీదు, మరలా వచ్చే జన్మకు పాపం మూటగట్టుకుంటారు.

హోటల్ లో ఈరోజు రుచికరమైనవి గా కనిపించి అనిపించి, ధనం తో లేదా చేయి చాచి, కడుపు నిండా తిన్నా, అది వ్యాపార అవసర అవకాశ ముచ్చటే గానీ, మన సొంత ఇల్లు ప్రేమ అభిమానం రుచి శుచి ఆరోగ్యం జాగ్రత్తలు ఉండదు.

రోజూ భోజనం తర్వాత, మధ్యాహ్నం మరియు రాత్రి 1 మైలు నడక, 77 ఏళ్ళ అమ్మ ను జాగ్రత్తగా చేయి పట్టుకుని, ఎదురు దెబ్బలు తగలకుండా, సాక్స్ బూట్లు వేసి, 8 ఏళ్లుగా నడపడం మీకు తెలుసు, రోజుకు 2 సార్లు ఒక్కో మైలు. ఎన్నోసార్లు పడటం, జరిగిన కూడా, దేవుడు కాపాడారు, గుడి లో లేదా నడకలో. డాక్టర్ ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు.

ఇంటి సొంత ఆయుర్వేదం, వేప కాకర అల్లం వెల్లుల్లి లాంటి ఇతర వంటింటి 16 మూలికలు పొడి తో, బీపీ షుగర్ కూడా, 2014 నుంచి 400 నుంచి తగ్గించి, 120/ 140 దగ్గర వాటిని అదుపులో కట్టేసింది ఇక పెరగకుండా, అని మీకు తెలుసు.

ఈరోజు రాత్రి నడకలో, గట్టు తట్టుకుని, బూటు ఉన్నా, మరలా పడటం జరిగింది, దేవుని దయవల్ల ఏమీ పెద్ద ప్రమాదం లేదు, ఎముకలు కు.

గాజు బొమ్మ లాంటి, పెద్ద వారు పడటం అంటే, అదే జీవితానికి చివరి నడక కావచ్చు, చాలామంది కి నడుము కాలు ఎముకలు విరిగి, ఇలాగె ఇబ్బందులు పడ్డారు. అమ్మ కూడా గతంలో ఎన్నోసార్లు ఎమర్జెన్సీ కి వెళ్లి వచ్చింది. కానీ ఏదో అదృశ్యమైన బలమైన శక్తి, ఆమె కు పెద్ద దెబ్బ తగలకుండా ప్రతిసారి ఆపుతున్నది, నన్ను కాపాడుతుంది. ఆ దేవుని దయ కావచ్చు.

అందుకే 156 వారాల 108 ప్రదక్షిణలు ఆపలేకపోతున్నా. మన 8 ఏళ్ళు సజీవ గురువు సేవతో, 100 రూపాయలు పుణ్యం వస్తే, మనకు ఈనాటి దాకా సహాయం చేసిన వారు అందరికీ, 50 రూపాయల పుణ్యం ఆటోమేటిక్ గా పోతుంది. అందుకే ఎప్పుడూ మంచి వారికి సహాయం చేయడం, మనకు శ్రీ రామ రక్షణ, బాంకు లో వడ్డీ లాగా మనకు పుణ్యం వస్తూనే ఉంటుంది. అలాగే పాపాత్ములకు చేసే సహాయం, ఫలితము పాపము లాగానే, వెంటపడుతుంది సుమా. అంటే మనకు 50 రూపాయలు పుణ్యం మాత్రమే ఉంది. అది 100 కు వెళ్ళాలి అంటే, మనం 200 రూపాయల పుణ్యం చేసే, ప్రయత్నాలు చేయాలి.

గతములో పడ్డప్పుడు, ఒకసారి గచ్చుమీద వాలి పోతుంటే, గబుక్కున పరుగులు తీసి, తలకింద చెయ్యి పెట్టింది, మీకు తెలుసు. ఇంకోసారి, యాక్సిడెంట్ కారు గీతలు తో ఆగింది, మీకు తెలుసు. ఇలాంటి ఎన్నో గండాలు దాటింది అమ్మ. దేవుని రుణం తీర్చుకోలేము.

కానీ అమ్మ, పడినప్పుడు అల్లా, లెగవలేక అలా నేలమీద పైసిపిల్ల లా ఒరిగిపోతుంటే, చూస్తున్న మనకే కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చిన్నప్పుడు మనము పడుతూ లేస్తూ నడక నేర్చుకున్నాం, అప్పుడు వారు పట్టుకుని, మనల్ని ముద్దాడారు ఏడవకుండా బాధతెలీకుండా.

ఇప్పుడు ముదుసలి తనంలో, చిన్న రాయి గట్టు తగిలినా, అంత మనిషిమి గభాలున పడుతున్నాం. మరి చేయి పట్టుకుని, లేపి, ముద్దాడి, ధైర్యం చెప్పేది ఎవరు? అందరూ ఎక్కడెక్కడొ ఉంటే. ఎవరి దగ్గరనో ఉన్నా, ప్రయోజనం ఏమిటి? ఎంతమంది చేయగలం, చేస్తున్నాము.

వెంటనే చిన్నగా భుజాలు పట్టుకుని లేపి, చిన్నగా ధైర్యం మాటలను చెబుతు, చేతులు రాస్తూ, ఇంటికి తెచ్చి, మోకాళ్ళు గీరుకు పోయి వాచిపోయి ఉంటే, వాపు మందు లాంటివి రాసి పడుకోబెట్టము. పడినప్పుడు చుట్టూ ఉన్న 4 గురు పెద్దలు మూగి, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి అని చెప్పారు.

అందుకే మిమ్మల్ని 5 ఏళ్ళ పైగా వేడుకుంటుంది, బతికి ఉన్న తల్లి తండ్రులు ను, ఒంటరిగా లేదా మనతో పెట్టుకోకుండా ఇతరులతో, దూరంగా వదలకుండా ఉండండి. కనీసం ఇంటి పైనా, ఇంటి కిందా కూడా వద్దు, ఇంట్లోనే మనతోనే మన భోజనము తోనే గౌరవించాలి సుమా. ఇది ఎప్పుడు కుదురుతుంది, మనము ఆత్మను అమ్ముకోనప్పుడు మాత్రమే. 4 గురు పిల్లలు ఉన్నా, పెద్దలకు ఇష్టమైన వారు ఒకరే ఉంటారు, అన్ని సౌకర్యాలతో, మరువద్దు.

అలా ఇంట్లో ఉంచి సేవ చేయకుండా, పదిమంది ముందు పది కారణాలతో నటిస్తే, అదే నరకం మనం రెట్టింపు తో అనుభవించాలి.

ఒకవేళ పెద్దలు గతించిన వారు ఉంటే, దగ్గర లో ఉన్న ఇతర తెలిసిన ముదుసలి వారి సేవతో, పాపం తగ్గించుకోవాలి.

How can lonely old folks parents be comforted who support them by love gratitude like kids?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,067; 104 తత్వాలు (Tatvaalu) and views 225,556
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : General
Views : 407 ( + More Social Media views ), Id : 1572 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lonely , oldage , parents , comforted , support , love , gratitude , kids
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content