వేడిగా బీజేపీ నాయకుల ప్రచారం సెగలు - అమరావతి, హిందు, తిరుపతి, పోలవరం, సర్జికల్ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తిరుపతిలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది, ముఖ్య నేతలతో. ఉప ఎన్నికల్లో, జగన్ పోవాలి బిజెపి రావాలన్న, నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు అని, ఓ వార్త కనపడింది. మరి ఆ పదము వాడరో లేదో తెలియదు, ఏ పేపర్ రాసేది, ఏది నిజమో ఏది అబద్దమో తెలీదు.

ఏవండీ 4 పార్టీలు మా బిడ్డలు అంటే, మనం పక్క రాష్ట్రం లేదా దేశం లో ఉన్నా, మన వాళ్ళ నెత్తి ఎక్కి, తాండవ మాడేది ఈ 4 గురు యేకదా. పెద్ద బిడ్డ బీజేపీ(పార్టీ వయస్సు లో), రెండో బిడ్డ తెదేపా చంద్రన్న, మూడు వైకాపా, నాలుగు జనసేన. పేద్ద పెద్ద బిడ్డ కాంగ్రెస్, విశ్రాంతి లో ఉన్నాడు. పెద్దోడా, తప్పు కదయ్యా పోవాలి అని అనడం అర్ధం ఏదైనా, మూడో వాడిని అలా అనడం.

జగన్ దిగాలి వీరన్న ఎక్కాలి అనుకో. లేదా వైకాపా పోవాలి, బీజేపీ రావాలి అనుకో, మర్యాద పదాలు వాడుకోండి. రాబోయే తరాల పిల్లలు ఇవే నేర్చుకొని, ఎవరినన్నా తిడితే, కనీసం, మంత్రి కొడాలి స్థాయిలో ఉండాలి, అని కొలబద్ద పెడితే, మనకు కష్టం కదా?

తెలంగాణాలో ఉత్సాహం, ఆంధ్రా బీజేపీ కి కొత్త ఊపు నిచ్చింది, స్థానిక ఫేస్బుక్ పేజీలలో మార్పు రాకపోయినా, వేడి వేడి మాటలతో నినాదాలతో, భారీ ప్రజా యాత్ర ను మీటింగ్ ల ను నిర్వహిస్తుంది.

ఓ వైపు జనసేన, ఇంకో వైపు సొంత పార్టీ MP రామక్రిష్ణ రాజు, ఇంకో వైపు తెదేపా, ఇంకో వైపు బీజేపీ నాయకుల వరద ప్రవాహం, 4 వైపులా రాష్ట్ర రాజకీయాలను, వేడెక్కిస్తున్నాయి. ఇంకోవైపు వైకాపా పధకాలు జవాబులు విమర్శలు, కొందరి నిర్లక్ష్య అహంకార ధోరణి కొనసాగుతుంది.

తిరుపతి ఎన్నికల కోలాహలము మరియు జగన్ పాలన లో ఉన్న సమస్యల గురించి, అర్ధవంతమైన ఘాటు విమర్శలు చేస్తున్నారు నాయకులు అందరూ కలసి. జనసేన పవన్ ను పక్కనబెట్టి మరి బీజేపీ ముందుకు వెళుతుంది, వీరి బంధం పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

ఎవరి వ్యూహం లో ఎవరు చిక్కుకుంటున్నారు, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనడానికి, తిరుపతి ఎన్నిక ఒక వేదిక కానుంది. పధకాలు మరియు స్ధానిక ఎమ్మెల్యేల బలం వైసీపీ వైపు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఫల్యాల బలం ప్రతిపక్షాల వైపు ఉంది. బీజేపీ నాయకుల మాటల తూటాలు చూడండి.

** సోము వీర్రాజు

- అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో మరో మాటకు తావులేదు. మోడీ మనిషిగా చెబుతున్నాను, అమరావతే ఏపీ రాజధాని. 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాం.

- అమరావతికి మద్దతుగా విజయవాడలోనే ఏపీ బీజేపీ కార్యాలయం కడుతున్నామని, 1800 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆగలేదని, ఫ్లై ఓవర్ పూర్తయిందని, బీజేపీ అమరావతి వైపే ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అన్నారు.

- హిందువులపై దాడులు, తిరుమల మొదలుకొని అన్ని దేవాలయ భూములను దోచేయడం మరియు ఎర్ర చందనం అక్రమ రవాణా విషయాలపై బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.

- చంద్రబాబు స్టికర్ బాబు అయితే జగన్ డబల్ స్టికర్ బాబు, అవినీతి, కుటుంబ పాలన పార్టీలకు జాతీయవాద బిజెపి ఒక్కటే ప్రత్యామ్నాయం.

** ఎన్నికలలో అన్ని తప్పుడు మార్గాలను ఎంచుకునే కాంగ్రెస్, లెఫ్ట్ మరియు విపక్ష పార్టీలే పంజాబ్, హర్యానా లలోని రైతు నిరసనల వెనుక సూత్రధారులు. రఫెల్, సిఏఏ లాగానే పదే పదే అబద్దాలు ప్రచారం చేయడం, అబద్ధపు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, రాజకీయ లబ్దిని పొందడానికి ప్రయత్నిస్తారు - సత్యకుమార్

** బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ నర‌సింహారావు సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు. తిరుప‌తిలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తే, ఏపీలో రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తామ‌ని వ్యాఖ్యానించారు.

- గతంలో పాలించిన‌ టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌కు ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

- క్రిస్మస్ వేడుకలను పోలీస్ స్టేషన్ లో నిర్వహించడాన్ని, నిరసిస్తూ, ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని అధికారకముగా ప్రోత్సహిస్తోందని అన్నారు.

- టిటిడి వార్షిక బడ్జెట్‌ రూ .3,310 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కేవలం సరిపోని రూ .100 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో మతమార్పిడులను నివారించడానికి, టిటిడి ద్వారా ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

** పోలవరం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ మరియు ఆంధ్రకు కొత్త లైఫ్ లైన్ ఇస్తుంది. అంతకు ముందు టిడిపి & ఇప్పుడు వైయస్ఆర్ దీనిని అవినీతి పద్ధతుల కోసం ఉపయోగిస్తోంది. వైయస్ఆర్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ సైట్ వద్ద వైయస్ఆర్ విగ్రహం అభ్యంతరకరం. ఏదైనా విగ్రహాన్ని అక్కడ నిర్మించాలంటే, అది అటల్ జీకి చెందినది మాత్రమే - విష్ణు వర్ధన్

ఇలా ఇంకా ఇతర నేతలు, జగనన్న ప్రభుత్వం ను మరియు గత చంద్రన్న ప్రభుత్వం ను దుయ్యబట్టారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 14-Dec-2020, Upd Dt : 14-Dec-2020, Category : Politics
Views : 202 ( + More Social Media views ), Id : 856 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , bjp , leaders , campaign , bullets , words , amaravati , hindu , tirupati , surgical , polavaram , somu , gvl , vishnu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content