Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Hey Krishna - Aatagadharaa Siva - Doddanna, Uday Shankar, Hyper Aadi, Jwala Koti
*పాటతో పరమార్ధం - హే కృష్ణ, ఎదలోన బయమైన్దయ, నేనుండ బెంగేలయ - ఆటగదరా శివ - దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది, జ్వాలా కోటి*
భగవద్గీత ను సామాన్య జనానికి, చిన్న చిన్న మాటలతో, చిక్కటి పాటగా, చక్కగా అందించారు. ఈ సినిమా మీరు తప్పక చూడాలి, కర్మ ఖర్మ కాలితే ఎలా ఉంటుంది అనేది, ప్రతి మలుపులో కనపడుతుంది. మంచికి మంచి సహాయం అని తెలియ చేస్తుంది. ఉత్తమ చిత్రం ఇది, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దర్శకుడు నటీ నటులు అందరూ కలిసారు, కావ్యాన్ని రూపొందించారు. అలాగే ఉత్తమ పాటలు కూడా కొన్ని మనము స్వయముగా పాడుకుందాము.
క్రిష్ణార్జునుల (ఆత్మ పరమాత్మల, జీవుడు దేవుడు ముచ్చట) సంభాషణను ఎంత బాగా రాశారో చూడండి. హే కృష్ణా, మదిలోన ఎదలోన బయమైన్దయ ప్రాపంచిక బ్రమలు చూసి అంటే, దేవుడు ఇలా అంటున్నారు, ఓ పార్ధ నేనుండ బెంగేలయ? చిత్తశుద్దితో నన్ను నమ్మితే, అది ఆచరణలో చూపితే, నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను అని చెపుతున్నారు.
హే హృష్ణా, ఈ కర్మ నాకేలయా అంటే, ధర్మాన్ని కాపాడయా అది నిన్ను కాపాడుతుంది అని చెప్పారు క్రిష్ణయ్య. మరి మనం ధర్మం కాపాడుతున్నామా? ధర్మాన్ని కాపాడితే, ముదుసలి తనంలో, మన పిల్లల దగ్గర దేవతలుగా ఎందుకు కొలవబడటం లేదు మిత్రమా?
పగవాళ్ళు మావాళ్ళే చుట్టాలులే అంటే, జీవిత సమరాన దైవ ధర్మాన చుట్టరికమే చెల్లదు కదా, నారీ సారించారా అంటే చెడును ఎదుర్కో ప్రశ్నించు. జీవుడు, వద్దులే మాధవా నా వల్ల కాదు అంటున్నాడు. ఆగు కృష్ణ అంటే పద ముందుకు పార్ధ అంటున్నారు పరమాత్మ.
ఎదురుగా స్నేహితులు ఉన్నారు అని జీవుడు అంటే, కావచ్చు అని పరమాత్మ. ఈ సమరమున ఉన్నారు అని జీవుడు అంటే, చావొచ్చు అని పరమాత్మ. కానీ ఓ దేవ దయ చూపయా అంటున్నాడు జీవుడు మానసిక బలహీనతతో. అప్పుడు పరమాత్మ, నీలోన క్షత్రమ్ము నీ బ్రతుకు క్షణికమ్ము ఓ నరుడా ప్రాపంచిక మోహ బంధాల బ్రమ వీడయా అన్నారు. కానీ జీవుడు, ఈ బాధ పడలేను, బంధాలు వీడలేను, కృష్ణా, ఈ చావులే/ తగవులు/ గొడవలు ధర్మం కాపాడటానికి ఎందుకో అని రోదించారు, మనలాగా.
అప్పుడు దేవుడు ఆత్మ జ్ఞానం చెప్పారు - చచ్చేది ఈ బొంది, ఆత్మకేం ఇబ్బంది, ప్రతి చావు మలి పుటకకే కదా, ముందుకు నడువు అన్నారు. కానీ జీవుడు తన బలహీనత వదలలేక, నే చంపలేనయ్యా, రానీయి అపజయం అన్నారు. దేవుడు ఓపికగా, తన ధర్మాన్ని గుర్తు చేసారు, నువ్వు భూమి పై వచ్చిన కారణం తెలుసుకో, వ్రుత్తి ధర్మం విడువకు, సైనికుడు నీవయ్య, నీ వృత్తి రణమయా అని వెన్ను తట్టారు.
మన ఆధ్యాత్మిక ఆచరణ గురువు, అంటే కనీసం 5+ ఏళ్ళ పైన సజీవ గురువు సేవ చేసిన వారు, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడిన వారు కూడా, మన మానసిక బలహీనతను ఇలా ఎదుర్కొనే మార్గం, ధైర్యం చెప్పాలి.
అయినా జీవుడు, నాకేల కృష్ణయ్యా, ఈ రాజ్యభోగాలు అంటే, దేవుడు ఇలా అన్నారు -
ఉపయోగమే లేని, వైరాగ్యమిక చాలు, పద ముందుకు. అయినా జీవుడు నరకంగా తోస్తుంది, నాకిపుడు జగమంత స్వామీ నా వల్ల కాదు అన్నారు. అప్పుడు దేవుడు, జగమంత నేనేగ, నీకేలా ఆ చింత, ముందుకు కదులు అన్నారు.
మరలా జీవుడు బలహీనతతో - పోరాడలేను, దయచూపు ప్రభువా, ఇక బతకలేను అని నీరు కారి పోతున్నాడు, అచ్చు మన మానసిక బలహీనులు లాగా. అప్పుడు దేవుడు అభయం ఇస్తూ, శరణమ్ము వేడు, సర్వమ్ము నాకొదులు, శరణమ్ము నేనే అని వెన్ను తట్టారు మరలా, ధర్మ యుద్దం చేపించారు, ధర్మాన్ని రక్షించారు. మరి మీరు ధర్మ యుద్దం చేస్తున్నారా, ఇంట్లో ఒంట్లో సమాజములో? కనీసం చేసే వారికి, అండగా ఉన్నారా?
ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి హార్ట్ టచింగ్ సినిమాలను తెరకెక్కించిన చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆటగదరా శివ. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు.
కృష్ణ….. ఓహో; కరుణా సింధు- అవునబ్బా; ధీనబంధు- అబ్బబ్బబ్బా…….
ఆపద్బంధవా పాహిమామ్; శభాష్…….. ఏం పాడతన్నడబ్బ……
హే కృష్ణా….. నువ్వు మొదలెట్టు పార్ధ
హే కృష్ణా….. ఓ పార్ధ; హే కృష్ణా…..ఓ పార్ధ
ఎదలోన బయమైన్దయ… నేనుండ బెంగేలయ….
Hey Krishna oa paardha Hey Krishna oa paardha edaloana bhayamandayaa
హే కృష్ణ ఏమి పార్ధ; హే హృష్ణా ఎమి పార్ధ
ఈ కర్మ నాకేలయా… ధర్మాన్ని కాపాడయా…….
పగవాళ్ళు మావాళ్ళే….. చుట్టాలులే…….
సమరాన చుట్టరికమే చెలధే నారీ సారించారా……
వద్దులే మాధవా……..
అగు కృష్ణ,పద పార్ధ…….అగు కృష్ణ,పద పార్ధ…….
* స్నేహితులు, కావచ్చు
సమరమున, చావొచ్చు
ఓ దేవ దయ చూపయా…….
నీలోన క్షత్రమ్ము…. నీ బ్రతుకు క్షణికమ్ము…..ఓ నరుడా బ్రమ వీడయా…
ఈ బాధ పడలేను, బంధాలు వీడలేను, కృష్ణా…, ఈ చావులే ఎందుకో….
చచ్చేది ఈ బొంది, ఆత్మకేం ఇబ్బంది, ప్రతి చావు మలి పుటకకే..
నె చంపలేనయ్యా….రానీయి అపజయం
సైనికుడు నీవయ్య. నీ వృత్తి రణమయా…..
* నాకేల కృష్ణయ్యా, ఈ రాజ్యభోగాలు
ఉపయోగమే లేని, వైరాగ్యమిక చాలు….
నరకంగా తోస్తుంది, నాకిపుడు జగమంత
జగమంత నేనేగ, నీకేలా ఆ చింత
పోరాడలేను, దయచూపు ప్రభువా, ఇక బతకలేను…
శరణమ్ము వేడు, సర్వమ్ము నాకోదులు, శరణమ్ము నేనే……. .
కృష్ణ…. కృష్ణ…. కృష్ణ…. కృష్ణ….
Aatagadharaa Siva is the official Telugu remake of 2016 Super Hit Kannada Film Rama Rama Re.
Starring - Doddanna, Uday Shankar, Hyper Aadi, Chammak Chandra, Chalaki Chanti, Rocket Raghava, Jwala Koti; Directed by Chandra Siddhartha, Based on Rama Rama Re by D Satya Prakash; Produced by Rockline Venkatesh; Singers: BV Shrunga & Vasuki Vaibhav; Lyrics: Chaitanya Prasad
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,679,773; 104 తత్వాలు (Tatvaalu) and views 414,279
Dt : 13-Nov-2024, Upd Dt : 13-Nov-2024, Category : Songs
Views : 568
( + More Social Media views ), Id : 2172
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Hey Krishna ,
Aatagadharaa Siva ,
Doddanna ,
Uday Shankar ,
Hyper Aadi ,
Jwala Koti ,
Chandra Siddhartha ,
Rama Rama Re ,
Satya Prakash ,
Rockline Venkatesh ,
BV Shrunga ,
Vasuki Vaibhav ,
Chaitanya Prasad
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments