విదేశాల్లో పర్యటిస్తున్న, అధికార ప్రముఖుల కు తలనొప్పి కలిగిస్తున్న, అభిమాన ప్రచార వ్యామోహం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,484; 104 తత్వాలు (Tatvaalu) and views 224,967.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అమెరికా లో వివిధ రాష్ట్రాలలో, మన భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవ శ్రీ ఎన్వీ రమణ గారు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగముగా, అక్కడి ప్రవాసులను అలాగే తెలుగు వారినీ, వివిధ కార్యక్రముల ద్వారా, కలుస్తున్న విషయము తెలిసిందే.

న్యూజెర్సీ లో జరిగిన ఒక సభలో రమణ గారు మాట్లాడుతూ, మాత్రుభాషలోనే చదివి, ఈ స్థాయికి చేరుకున్నాను అని, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. పట్టుబట్టి మరీ, నేమ్‌ప్లేట్‌ తెలుగులో కూడా పెట్టించాను అని అన్నారు.

మరి వారి మాటలను ఆదర్శముగా తీసుకుని, ఇప్పుడైనా ప్రవాస తెలుగు వారు, తెలుగు రాయడం మాట్లాడటం శ్లోకాలు చదవడము లో ముందడుగు వేసి, తమ పిల్లలకు కూడా అది నేర్పే పని చేస్తారని ఆశిద్దాము.

అమెరికాలో తెలుగు నేర్పే ఎన్నో సంస్థలు కూడా ఉన్నాయి, మనబడి, సిలికానాంధ్ర లాంటివి, అని మనకు తెలుసు. అయినా, అక్కడ ఉద్యోగం చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్న, మన తెలుగు తేజాలు, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో, మాత్రుభాష తెలుగు రాయాలి అంటే, అంతరిక్షానికి వెళ్ళినంత కష్టముగా, అదేదో అనవసర ప్రయత్నముగా, అక్కరలేనిదిగా చిన్న చూపు చూస్తున్న విషయం, అందరికీ తెలిసిందే.

ఏరు దాటాక తెప్ప తగలేసే విధముగా లేకుండా, తెలుగు సంఘాలు మరియు ప్రవాస తల్లి దండ్రులు కూడా, దీని గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, వారిని ప్రోత్సహించాలని, మాత్రుభాషను కాపాడాలని తెలుగు భాషా అభిమానులు కోరుతున్నారు.

సరే అసలు విషయానికి వస్తే, ఒక కార్యక్రమము కు వెళ్ళినప్పుడు అక్కడ అందరితో ఫోటోలు దిగడం, అందరినీ అభిమానము గా పలకరించడం సర్వసాధారణమే, అందరికీ ఇందులో ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేదు.

ఆ ఫోటోలు మరలా, తమ ఫేస్బుక్ లలో పంచుకుంటూ, మేము వారిని కలిసాము వీరిని కలిసాము అని గొప్పలు చూపించుకోవడం కూడా, సాధారణమే. అసలు వ్యక్తుల కన్నా, తెలుగు రాష్ట్రాలలో వారి అనుచరులు బంధువులు మిత్రులు, ఇంకా గొప్పగా పంచుకుంటూ చెప్పుకుంటారు, మా వాళ్ళు అక్కడ పెద్ద వారిని కలిసారు అని. అది కూడా, సాధారణమే, సినిమా వారు లేదా ఇతరులతో.

కానీ కొన్ని సార్లు అదే తలనొప్పి వ్యవహారము అవుతుంది, సివిల్ మరియు పోలీసు అధికారులకు మరియు అలాగే న్యాయమూర్తులకు. వీరూ, వారికి సన్నిహితులు కాబట్టి కలిసారు, అన్న విపరీత అర్ధాలకు తావిస్తుంది. కాబట్టి జాగ్రత్త గా ఉండాలి, గుంపులో ఉండాలి కానీ, విడిగా ఉండకూడదు. మనము 10 మందిని కలిసాము అంటే, అన్ని సోషల్ మీడియాలో ఉండాల్సిన పనిలేదు. మనము ఒక అర్ధము తో పెడితే, అది ఇంకో అర్ధానికి దారి తీస్తుంది సుమా.

ఇతర కార్యక్రమాల వలెనే, కాలిఫోర్నియా లో కూడా ఒక కార్యక్రమానికి హాజరు అయ్యారు. మరి అది ఏ కార్యక్రమమో పూర్తి వివరాలు అందలేదు. రమణ గారిని, శాన్ ఫ్రాన్సిస్కో లో కొంత మంది ప్రముఖుల తో పాటుగా, అమెరికా ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం కూడా కలసి, స్వాగతం పలికారు.

మామూలుగా చూస్తే, ఇంత వరకు తప్పు ఏమీ లేదు. కానీ వారి వరికే వ్యక్తిగతముగా కలసిన మాట్లాడిన ఫోటోలు బయటకు వెళితే, వివిధ పార్టీల లోని వారి, మనోభావాలు అర్ధాలు మారిపోతాయి కదా. చూడండి, ఒక వ్యక్తి పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ లో, ఫోటో తో సహా, అంతర్లీనముగా చెబుతున్న అర్ధము గమనించండి -

_అమెరికా ఎన్నారై తెలుగుదేశం అధ్యక్షుడు కోమటి జయరాం, మిగిలిన పార్టీ ప్రముఖులతో ఆత్మీయ సమావేశమై న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని అంబరానికి చేర్చిన భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు!_

అర్ధము అయ్యిందా, అతను చెప్పదలచుకున్న విషయము. ఆ భేటీని పార్టీ పరముగా అర్ధము చెపుతున్నారు. ఆ ఒకరి గురించి కాదు, పార్టీలోన వ్యక్తులు అలాగే అంటారు కదా. మనము ఎందుకు అవకాశం ఇవ్వాలి? దాని వలన ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం?

అధికార ప్రభుత్వములో పని చేస్తున్న వ్యక్తులు, ముఖ్యముగా పోలీసు మరియు న్యాయవ్యవస్థలో ఉన్న వ్యక్తులు మరియు మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు, అవి విభిన్న ఆలోచనలకు ఆస్కారము ఇవ్వకుండా, అందరూ జాగ్రత్తలు పడాలి, పార్టీ పరముగా అలాగే, ఆ వచ్చిన వ్యక్తులకు వ్యవస్థలకు ఇబ్బంది కలగకుండా, గౌరవము నిలబెట్టే విధముగా ఉండాలి సుమా.

గతములో ఎన్నికల కమీషనర్ ను తెదేపా నాయకులు కలవడం గురించి రాద్దాంతము చూసాము. ఇప్పుడు కూడా వైకాపా వారు, ఈ 2 ఏళ్ళు కోర్టులు అన్ని తీర్పులు వ్యతిరేకమేనని, ఇంకోపక్క మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నది చూసాము.

అన్ని ఫోటోలు, అన్ని వేళలా, మన గొప్పలకోసము, సోషల్ మీడియాలో అవసరము లేదు సుమా. మన చుట్టూ ఉండే అనుచరులు మనలాగే మోహము లో ఉంటారు, తప్పు ఒప్పు పర్యవసానాలు చెప్పలేరు.

అందుకే, అరిషడ్వర్గాలకు దూరముగా ఉండేవారిని కూడా ఓ సలహా అడగాలి సుమా, ఇకనైనా జాగ్రత్తలు పడదాము, ఇతరుల విమర్శలుకు ఆస్కారం ఇవ్వడం తగ్గిద్దాము.

Headache for Indian bureaucrats traveling abroad, favorite campaign craze usa  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,484; 104 తత్వాలు (Tatvaalu) and views 224,967
Dt : 30-Jun-2022, Upd Dt : 30-Jun-2022, Category : General
Views : 836 ( + More Social Media views ), Id : 1446 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : headache , indian , bureaucrats , visit , abroad , usa , followers , favorite , campaign , craze , usa , ramana , jayaram , komati , telugu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content