మానవత్వం సామాజిక బాధ్యత లేని మనుషులు కు, ఇంకో ఇంటి ఎదురు బండ్లు పెట్టే హక్కు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,782; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

* చూడండి, ఎవరి ఇంట్లో నో పెళ్లి అయితే, ఎవరి ఇంటికో తలనొప్పి ఏమిటి?

కనీసం లోన ఒక మనిషి ఉంటుంది, ఆమె ను మనిషి గా గుర్తించి, అనుమతి తీసుకోవాలని అని సంస్కారం ఉండదా? లోన ఉన్న మనిషి కి, ఎటూ పట్టదు, తను ఉన్న ఇల్లు జాగ్రత్తలు చూసుకోవాలని.

ఇంకొకరు ని బాధ ఇబ్బందులు పెట్టి, మన శుభకార్యం కు అర్థం ఉంటుందా? వారం రోజులు పెళ్లి అయితే, వారం రోజులు ఇక్కడ పెడతారా? కనీసం రోడ్డు మీద పక్కన కూడా కాదు, చూడండి.

సంస్కారం తో ఇరుగుపొరుగు ను గౌరవించే మరియు మంచి చెప్పే పెద్దలు, ఒకరు కూడా అపార్ట్ మెంట్ లో లేరా?

అది వారికి కలసి వస్తుందా? చదువుకుని ఉపయోగం ఏముంది?

* చూడండి, చివరకు పంచాయతీ ఫిర్యాదు చేయడం ఒకటే మార్గమా, అపార్ట్ మెంట్ వారి పార్కింగ్ దాటి ఇతరుల ఇళ్ళు మీద పడుతున్నారు అని?

ఆ బండ్లు దొంగలు వో, దొరల వో ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా హాని జరిగిన, దొంగతనం జరిగిన, రక్షణ ఏమిటి?

అపార్ట్ మెంట్ వారికి ఎన్ని సార్లు చెప్పిన కూడా అర్ధం కాదా? ఆ మీటింగ్ లలో ఇతరుల కు ఇబ్బందులు ఇవ్వకూడదని చెప్పే, పెద్దలు ఒకరూ లేరా?

* ఇన్ని రోజులు నుంచి అక్క గారు ఉంటున్నారు, తన మన అని ఉండి, ఇది నా ఇల్లు లాగా చూసుకోవాలి అన్న మనసు ఉంటుందా? అందరూ ఒకరినే ఉంచద్దు అని ఎందరు అన్నా, ఎప్పుడు నుండో ఉన్నారు అని, మనం గౌరవం ఇస్తున్నాము. తనకు ఆ విషయం పట్టదు.

పెళ్లి వారు వచ్చి కార్డు ఇచ్చి, అమ్మా పెళ్లి ఎల్లుండి, లక్షలు ఖర్చు పెడుతున్నాము. ఓ 300 వందలు పెట్టి, బయట బాగు చేపిస్తాము, రోజంతా 3 కార్లు పెట్టుకుంటాము , తర్వాత చెత్త కూడా తీపిస్తాము అంటే, ఎంత గౌరవం మర్యాద వారికి వీరికి. ఎవరు ఎవరికి నేర్పాలి ఈ సంస్కారం? ఇక పిల్లల కు ఏం నేర్పుతారు?

* చూడండి చదువు కుని ఉద్యోగాలు చేస్తూ, పదిమంది కి మంచి చెప్పాల్సిన వారే, ఇలా వేరే వాళ్ళ ఇళ్ళు ఎదురు గా దర్జాగా నీతి లేకుండా పెడుతుంటే, ఆ బిల్డింగ్ ప్రెసిడెంట్, ఇతర సభ్యులు కూడా, నీతి నియమాలు పద్దతి లేని వారా? ఇది తప్పు అని చెప్పరా? సంవత్సరం కు ఎన్నిసార్లు ఇది అనుకుంటున్నాము?

పెట్టిన వారికి 10 రూపాయల పాపం అయితే, చూసి చెప్పని వారికి, అసలు అక్కడ స్ధలం ఇచ్చిన వారికే ఈ తలనొప్పి తెస్తున్న వారికి, 20 రూపాయల పాపం.

మీలో మంచివారు ఉన్నారు, ఇరుగు పొరుగు కు, బుద్ది చెపుతారు, సంస్కారం నేర్పుతారు అని అనుకుంటున్నాము.

ఏదో ఒకరోజు షాప్ మరియు అపార్ట్ మెంట్ పార్కింగ్ కార్లు స్కూటర్, సందులో చెత్త గోడమీద కిళ్ళీ ఊయడం, ఈ ఫోటోలు పంచాయతీ మరియు పోలీసు వారికి ఇవ్వక తప్పదు ఏమో, అక్క గౌరవ మరియు ప్రాణ రక్షణకు. ఎందుకు పెట్టారు, ఎందుకు ఊసారు అంటే అక్క ను బెదిరిస్తున్నారు అంట, నీకెందుకు అని.

ఇంట్లో ఉన్న ఆమె కు హక్కు లేకుండా, అద్దె కు గదిలో, పక్కన ఇంట్లో, షాప్ లో, అపార్ట్ మెంట్ లో ఉండే, వారికి ఎక్కడ నుంచి హక్కు వచ్చింది?

* మానవత్వం సభ్యత సంస్కారం ఉన్న వారు, మర్యాద గా వచ్చి, మాకు ఇబ్బంది ఉంది, కారు పెట్టుకుంటాం అంటే, గేటు తీసి లోపల పెట్టమా?

అక్కడ మానవత్వం సంస్కారం మర్యాద, ఇరుగుపొరుగు ఎవరికి ఉందో చెప్పండి, ఇది చదివిన తర్వాత, కనీసం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అయినా.

అపార్ట్ మెంట్ వారు, షాప్, కళ్యాణ మండపం, పక్కన ఇల్లు వారు, ఈ 5 ఏళ్ళు లో, అక్క గారిని, కనీసం నటన కోసం అయినా,

ఏమ్మా ఎలా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, అందరం ఏదో ఒకరోజు ఇలా ఒంటరి కావాల్సిన వారమే, భోజనం అయిందా?

మేం బజారు కు వెళుతున్నాం ఏమైనా కావాలా?

మా ఇంట్లో శుభ కార్యం ఇదిగో కార్డు, మీ ఓనర్ కు కూడా చెప్పు లేదా మాట్లాడించు, బోర్డు మీద నంబరు కు ఆల్రెడీ పంపాము చూసారో లేదో,

అని ఊరక నోట మాట గా ఉచితంగా అనడానికి కూడా, నోరు లేని మానవత్వం సామాజిక బాధ్యత లేని మనుషులు కు , ఇంకో ఇంటి ఎదురు బండ్లు పెట్టే హక్కులు ఉంటాయా?

రేపు మనమంతా ఒంటరి వాళ్ళం కామా, ఏదో ఒక దశలో? జాలి దయ కరుణ లేక పోబట్టే, కరోనాలు వెంట పడుతున్నాయి.

అని రాము తమ ఇంటి ఎదురు కార్లు పెడుతున్న వారితో ఉన్న ఇబ్బందిని సోము తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,782; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927
Dt : 28-Dec-2020, Upd Dt : 28-Dec-2020, Category : General
Views : 932 ( + More Social Media views ), Id : 899 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : cars , vehicles , front , house , men , humanity , socially responsible
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content