APLatestNews.com top Banner

Social Media links
ఊరి బయట హనుమయ్య, ఇంటి ముంగిట గణపయ్య - 2 - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

విజయదశమి ఆయుధ పూజ గురించి, నిన్న లింకు లో, పసుపు కుంకుమ బొట్లు, ఎన్నింటికి ఇంటి వస్తువుల కు పెట్టామో చదివారు కదా. మీరు ఇంకా ఎక్కువ చేస్తే, దయచేసి చెప్పగలరు. రోజు కు 3 ఇలాంటి వి పంపినా, 3 * 2 = 6 నిమిషాల మీ అమూల్య సమయం మాత్రమే, మన మనశ్శాంతి లోక జ్ఞానం సనాతన సదాచారం మాతృభాష మాతృమూర్తి కోసం, మరియు మోహం వీడటం కోసం. మనం ఎంతో సమయం వృధా చేస్తున్నాం కదా, విడిగా. Link.

సరే ఊరి బయట హనుమయ్య, ఇంటి ముంగిట గణపయ్య బాధ గురించి, గత సంవత్సరం కధనం గా రాసాం. జనం ఇంకా, మాయలో వాటిని చేస్తూనే ఉన్నారు ఏమీ తగ్గకుండా.

ఇంట్లో దైవ పూజ చేసేటప్పుడు, పురుష సూక్తంలో చెప్పిన విధముగా, దేవుని మన దగ్గరకు ఆహ్వానం చేసి, ఇంట్లో ఆసనం లో ఒక ప్రాణ మున్న మనిషి గా కూర్చోబెట్టి, షోడశోపచారాలతో పూజ చేస్తున్నాము. మరి ఊరి చివర, అంత పెద్ద విగ్రహాన్ని పెట్టి ప్రాణ ప్రతిష్ట చేసి, ఎండకు వానకు చలికి, మండపం లేకుండా, వదిలేయ వచ్చునా? అది గౌరవమా, భక్తా? దానివలన మనకు పాపమా పుణ్యమా? మన అపార్ట్మెంట్ వాచ్మెన్ కి కూడా, గది లేదా చెక్క డబ్బా ఇస్తున్నారు కదా?

మనల్ని ఊరి చివర నిలబెట్టి షెడ్ లేకుండా, వారం రోజులు రాత్రి పగలు, పూజ గౌరవం చేస్తే, మనం సంతోష పడతామా? ఆ దాతలను కూడా, వారం రోజులు అక్కడ నే, తిండి తిప్పలు నిద్ర చేయమనాలి మరి, వారూ ఆనందముగా చేయగలరా? అందుకే మన పెద్దలు, ఊరి చివర చిన్న విగ్రహం, మండపం తో కడతారు. కోటి తో ఒక పెద్ద విగ్రహం బదులు, ఊరికి 4 వైపుల 4 చిన్న విగ్రహాలు పెట్టి మండపము కడితే ఒక పూజారిని పెట్టి, ఆయన వాటికి పూజ చేస్తూ, తానూ ఓ ముద్ద తింటారు కదా.

ఇక మన అపార్ట్ మెంట్ కింద లేదా బయట చిన్న గుడి, కరెక్టే నా? మనం పైన గదిలో హాయిగా ఉంటే, దేవుడు, రోడ్డు మీద లేదా మన కింద కార్లు పక్కన ఉండాలా? పైన చివర 7 అంతస్థులో పెట్టు కోవచ్చు గదా, తిరుపతి కొండ ఎక్కినట్టు, లిఫ్ట్ వాడకుండా పైకి ఎక్కవచ్చు గదా? దేవుని దగ్గరకు, కష్టపడి మనం వెళ్ళాలి గాని, మన కింద కాళ్ళ దగ్గర, ఆయన ఉండటం తగునా? లేదా మైలు దూరంలో ఉన్న గుడి చాలదా, మన పూజలకు?

పైత్యం కాదా మనకు? మూర్ఖత్వం అంటే ఇది కాదా? భౌతిక పూజ కన్నా మానసిక పూజ ఉత్తమం అని, నిరాకారుడు నిరంజనుడు అని వేదాలు ఘోషిస్తున్నాయి. శివయ్య, విష్ణువు, వేమన, బ్రహ్మం గారు, కళ్ళు మూసి ధ్యానం చేస్తూ చూపించినా, మనం మారమా? వాస్తవం కనమా?

హరీ హరా ఏమిటి, ఈ కలి మాయా మోహం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 847 General Articles, 46 Tatvaalu
Dt : 26-Oct-2020, Upd Dt : 26-Oct-2020, Category : General
Views : 82 ( + More Social Media views ), Id : 775 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : hanuman , outside , village , ganesh , house
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content