APLatestNews.com top Banner

Social Media links
ప్రాపంచిక మోహం లో కోటి విగ్రహమా లేక మానసిక నిగ్రహం తో 4 కడుపులు నింపటమా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

మొన్న నే, ఊరి బయట హనుమయ్య, ఇంటి ముంగిట గణపయ్య కధనం చదివాము, రెండు విడతలుగా. Link

అందులో విగ్రహం ప్రాణప్రతిష్ట తో, మనిషి లాగా, చలి ఎండ వానకు తడవాలి అని, ఇబ్బందులు అని చదివాము. ప్రాణ ప్రతిష్ట లేకపోతే, ఉత్త రాయే కదా. మరి ఊరికి కాపలా ఉండే స్వామికి, మండపము ద్వారము తలుపులు నీడ ఉండవా?

విగ్రహం ఎంత ఎత్తు కడితే, అంత ఎత్తు మండపము ద్వారము తలుపులు, కూడా మా స్వామికి ఉండాలని ఎందుకు చెప్పము? మన బిడ్డల మీద ఉండే ప్రేమ, మన స్వామి మీద లేదు అనేగా?

పొన్నూరు భారీ ఆంజనేయ విగ్రహానికి, అన్ని సదుపాయాలు చేసి, గుడి గా మలచలేదా? మనము రోడ్ మీద ఇలా అవమానకరముగా, దుమ్ము ధూళిలో, ఎవరికీ ఉపయోగము లేకుండా వదలడమేనా, కోటి రూపాయల ధన లక్ష్మిని? ఆ ధనముతో నలుగురి కడుపులు నింపలేమా?

ఇంత భారీ విగ్రహాలు ఉన్న ఊళ్ళకు, కరోనా రాకుండా కాపాడిందా? ఎందుకంటే, మనిషే ప్రమాదము, కరోనా కన్నా అని నిరూపణ అయ్యింది కదా? మన వూరి పెద్దలతో, ఇది చూపించి అయినా, మనసు మార్చలేమా? నలుగురి మొఖాలలో వెలుగు నింపలేరా?

మానవ సేవే మాధవ సేవ అని మన మనసు అంగీకరించదా? ఇతర మంచి మార్గాలు, చూడండి ఇందులో.

3 అడుగుల విగ్రహమైనా, 30 అడుగుల విగ్రహమైనా - ఒకటే దైవం, ఒకటే పూజ, ఒకటే నైవేద్యం అని ఎందుకు మనకు అర్ధము కాదు? 30 అడుగుల విగ్రహ స్థాపన ఖర్చు శ్రమ ఎవరికోసం? రెంటిలోను మన మానసిక పూజ ముఖ్యం కాదా?

మరలా ఇందులో రాజకీయ కోణం, అధికార పార్టీ లేదా ప్రతిపక్షాల మద్దతు, వారితో అవసరాలు, తమ అవకాశాలు, తమ వ్యక్తిగత ప్రచారము తో పాటుగా, రాజకీయ పబ్లిసిటీ. భక్తి, సేవ, రాజకీయాలు ఒక దానితో ఒకటి కలసివుంటాయి. వీటిని విడదీయలేము కదా?

మరి ఇప్పుడు ఇక్కడ, అమాయకులు పిచ్చి వారు ఎవరు? ఎండ వాన గాలికి ఊరి బయట నిలబడే పిచ్చి దేవుడా? మనసులో వద్దు దేవుడు భారీ విగ్రహము లోనే దైవము అనుకునే జనమా? తమ అవకాశవాదముతో ముందుకు సాగే నాయకులా? ధనము ఎందుకు ఇస్తున్నామో ఎవరి ప్రచారానికో ఏది మంచి దోవో తెలియని చందాల వారా? లేక బ్రహ్మం వేమన చెప్పిన మనసులోనే దైవం అన్న మాటలు నమ్మని భక్తులా?

ఆ కోటి రూపాయల ధనముతో, పదిమంది బీదవారికి పెళ్ళిళ్ళు చేయలేమా? ఒక పాఠశాల కట్టించలేమా? బీదలకు ఫీజ్ లు కట్టలేమా? పుస్తకాలు, బట్టలు, అన్నము పంచలేమా?

పొనీ దేవుడే కావాలి అనుకుంటే, ఒక 3 అడుగుల విగ్రహాన్ని, ఊరికి నలు వైపులా, 4 చిన్న మండపాలు కట్టి, ఒక పూజారిని పెడితే, ఆయన కుటుంబము అన్నా మన పేరు చెప్పుకుని, అన్నము తింటుంది కదా? ఊరికి మనము నమ్మే రక్షణ 4 వైపులా ఉంటుంది కదా?

మోదీ గారి పటేల్ విగ్రహమైనా, చంద్రన్న గోదావరి ఒడ్డున్న పెట్టిన ఎంటీయార్ విగ్రహమైనా, ఇంకేది అయినా, ఈ పరిస్తితుల్లో, అవసరమా? మానవ సేవ మాధవ సేవ అని ఆచరణలో చేయలేమా? ఆ ధనమంతా, ఎవరి కడుపులు నింపాయి? పేదలవా? ముదుసలి వారివా? నిర్భాగ్యులవా?

వారు రాజకీయ నాయకులు అనుకున్నా, మన ఊళ్ళో మనమూ అదే పని చేస్తున్నాము కదా? హత విధీ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 847 General Articles, 46 Tatvaalu
Dt : 29-Oct-2020, Upd Dt : 29-Oct-2020, Category : General
Views : 118 ( + More Social Media views ), Id : 781 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : hanuma idol , 1 crore , worldly fascination , fill , public stomach , mental restraint
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content