గుప్పెడు మనసు -మౌనమే నీ భాష, లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు -బాలమురళి, శరత్, సుజాత, సరిత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,146; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*గుప్పెడు మనసు - మౌనమే నీ భాష, లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు - బాలమురళి - శరత్ బాబు, సుజాత, సరిత*

మనసు మనసు మనసు - ప్రతి ఒక్కరిని పరుగులెత్తించేది - లేనిది కావాలి, ఉన్నది పోవాలి అన్నట్లు పరుగులు ఆరాటము.

ఏ వయసులో ఏ రంగములో ఏ దేశములో ఏ పరిస్తితిలో అయినా ఒకటే, ఇక యుక్తవయసు లో ఇక చెప్పక్కర్లేదు, ఈ ప్రపంచానికి నేనే రాణిని నేనే రాజుని, నన్ను ఎవ్వరు ఆపలేరు, ఎవరి మాట వినను అని అనుకుంటారు. వాస్తవం అనుభవము లోకి వచ్చేసరికి, అంతా మునిగిపోతుంది, బ్రమలు తొలిగాక నిశ్చేష్టులు అవుతారు.

అరిషడ్వర్గాల మరియు అష్టవ్యసనాల బానిసత్వములో ఉన్న వారు, మనసుకు దాసాను దాసులు, అది ఎలా చెపితే, అలాగే పరుగులు తీస్తారు, తప్పు ఒప్పు సంస్కారము పట్టించుకోరు, బుద్ది పని చేయదు.

ప్రపంచాన్ని జయించిన రారాజు కూడా, తన మనసును తాను జయించలేడు, చివరకు పతనము అవుతాడు. అందుకే ముందు మనల్ని జయించాలి అంటారు.

ఆ మనసును అదుపులో పెట్టడానికే, మత్రాలు. భగవద్గీత చెప్పినదంతా ఆ మానసిక బలం కోసం వివిధ మార్గాలు. అందుకే భగవంతుడు, పూజలు, ధ్యానం.

ఆ మనసు అదుపులో ఉన్న వారు, ఎన్ని కష్టాలు వచ్చినా, సమతా స్తితి లో ఉంటారు, ఆనందముగా ఎదుర్కుంటారు.

కానీ మనసు అదుపులేని వారు, కోరికలు గుర్రాలై, లేదా పరిస్తితి అదుపు తప్పినప్పుడు, ఏమి చెయ్యాలో తెలీక, తమ జీవితాన్ని పతనము చేసుకుంటారు.

మహానుభావులు, బాలమురళి గారి గళం నుండి వెలువడిన అణిముత్యాలకు, కంటి మీద నీటి పొరలు తప్ప, మాటలుండవు. ఈ అద్భుతమైన, సాహిత్యపు లోతు ఉన్న ఈ పాటను, నేటి తరానికి, ఒకటికి వంద సార్లు వినిపించాలి.

ఆత్రేయగారి ఈ పాట, ఎన్నిసార్లు విన్నా, తనివితీరని సాహిత్యం. మనసు గూర్చి కవిత్వాన్ని, రాయాలంటే పుట్టాలి మళ్లీ, మనసు కవి మన సుకవి. మంగళంపల్లి వారి ఈ పాట, ఇప్పటికీ ఎంతోమంది ఒంటరిగా కూర్చొని కంటినీటితో పాడుకొంటూ, శూన్యంలోకి చూస్తూ, ఏదేదో అనుకోవటం పరిపాటిగా చూస్తూనే ఉన్నాము.

మౌనమే నీ భాష, ఓ మూగ మనసా 2
తలపులు ఎన్నెన్నో, కలలుగ కంటావు
కల్లలు కాగానే, కన్నీరౌతావు ||మౌనమే|| ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా, తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో 2

కోర్కెల సెగ నీవు, ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యల్లవే మనసా, మాయల దెయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు 2 ||మౌనమే||

Mouname Nee Basha, Guppedu Manasu, Sarath Babu, Sujatha, Saritha
చిత్రం: గుప్పెడు మనసు (1979), సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్, సాహిత్యం: ఆత్రేయ
గానం: మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శరత్ బాబు, సుజాత, సరిత

Guppedu Manasu Mouname Nee Basha, lenidi korevu unnadi vadilevu-balamurali-saratbabu sujata sarita

మీరూ పాడి వినిపిస్తారు కదూ, ఆరోగ్యం మరియు వాక్సుద్ది కోసం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,146; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894
Dt : 17-Sep-2022, Upd Dt : 17-Sep-2022, Category : Songs
Views : 518 ( + More Social Media views ), Id : 1521 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guppedu , manasu , mouname , bhasha , lenidi , korevu , unnadi , vadilevu , balamurali , saratbabu , sujata , sarita
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content