Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) నివారణ చర్యల్లో భాగంగా, సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, శ్రీ జే ప్రభాకర్ రావు, ఐపీఎస్., గారు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్, ఐపియస్., గారు రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్ కొనసాగుతున్న తీరును, మంగళవారము ఒంగోలు పట్టణములో, తిరిగి పరిశీలించారు.
పోలీసులను మరియు ఇతర శాఖ ఉద్యోగులను, రెడ్ జోన్లలో నిర్వర్తించేటప్పుడు తమ విధుల్లో మరియు విధులు ముగించేటప్పుడు, అన్ని ముందు జాగ్రత్త చర్యలను, చేపట్టాలని, ఐజిపి నిర్దేశించారు.
రెడ్ జోన్లలో నిఘా బలోపేతం చేయాలని పోలీసులను కోరారు. ఐజిపి స్థానిక నివాసితులతో స్వయముగా మాట్లాడి, అవసరమైన వస్తువులు లభిస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు.
కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన వారికి చెప్పారు.
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాలను సైతము లెక్క చేయకుండా, కష్టపడి పనిచేస్తున్న ఆరోగ్య, మునిసిపల్, పోలీసులు మరియు రెవెన్యూ శాఖ ఉద్యోగులను మెచ్చుకున్నారు.
ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే, కరోనావైరస్ గొలుసు వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.
Today (Apr 28th), South Coastal Zone Guntur Range Inspector-general of police (IGP) Sri J Prabhakar Rao, IPS., and SP Prakasam Sri Siddharth Kaushal, IPS., conducted a surprise check in red zones in Ongole town on Tuesday.
Photo/ Video/ Text Credit : Prakasam Police
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1953 General Articles and views 1,580,319; 97 తత్వాలు (Tatvaalu) and views 199,091 కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments