బద్దకం నిర్లక్ష్యం తో పెరుగుతున్న పాపం, తరుగుతున్న బాధ్యత పుణ్యం మానవత్వం - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2131 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2166 General Articles and views 2,194,514; 104 తత్వాలు (Tatvaalu) and views 243,564.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ ఇప్పుడు అందరూ కొట్లో, 50 రుపాయల కి దండ కొని అలంకారానికి, ఇంకో 50 కి 365 వత్తులు గుత్తి కొని దీపానికి, ఇంకో 50 యాపిల్ కాయలు కొని నైవేద్యం కు, ఫోన్ ఎంపీ3 ఆడియో తో పూజ, హోటల్ లేదా వంట మనిషి చేసిన భోజనం, 5 గురు కి అన్నదానం చేస్తున్నారు, శ్రమ లేకుండా తెలికగా. అందరూ అలాగే, మేమూ అలాగే, సమయం లేదు మాకు, ఇందులో తప్పు ఏమిటి?

జవాబు - సాయంత్రము విదేశాల్లో, ఇండియాలో ఉదయము ఇంకా పూర్ణిమ ఉంది, మనస్పూర్తిగా పూజ చేయండి ఇప్పుడు అయినా.

మనకు పంచేంద్రియాల మీద పట్టు ఉంటే, ఈ పూజ కూడా చేయ అవసరము లేదు. మానసిక ధ్యానం చాలు. అదే శివుడు, విష్ణువు, బ్రహ్మ చేస్తుంది. మన యోగులు, గురువులు చేసేది అదే.

మరి అందరూ కరోనా తో పోతున్నారు, మనం కూడా పోదామా, వెంటనే, భూమి పై మనకు సమయం లేదు కదా? అన్నము లేకుండా పిల్లలు అలమటిస్తున్నారు అందరూ, మన పిల్లలు అలాగే ఉండాలా? మానసిక శారీరక రోగాలతో ఆసుపత్రిలో, చాలా మంది పడి ఉన్నారు? అలాగే ఉందామా? తిండి గూడు గుడ్డ లేక, రోడ్ మీద తిరుగుతున్నారు చాలామంది, గత జన్మలో ఇలాగే చేసి, అప్పుడు సమయము లేక. మరి మనమూ తిరుగుదామా? వచ్చే జన్మలో అదే కోరదామా? అబ్బే వీటికాడ మాత్రం, పోలిక వద్దు, మనం బాగుండాలి, అంతేనా స్వార్ధము?

మరి మనకు దేవుడి దగ్గరనే సమయము లేకపోతే, మరి డాక్టర్లు పోలీసులు నాయకులకు మన కోసం, ఎందుకు సమయం ఉండాలి? వారిని ఎందుకు నిందిస్తున్నాము?

పైన చెప్పినట్లు గా 50 కి దండ, 50 కి 365 వత్తులు, 50 కి ప్రసాదం, ఆడియో పూజ, ఇలాంటివి మనము చేస్తే, మరి మన పిల్లలు రాబోయే తరము, ఇవన్ని, ఫోన్ లోనో కంప్యుటర్ లో నో, చేస్తారు. ఇప్పుడే మైనపు వత్తులు, బాటరీ లైట్లు వెలిగిస్తున్నారు.

అందుకే కదా, కరోనా, వివిధ అవతారాల తో, వెంటపడుతుంది, సమయము లేని, మనల్ని, గుటుక్కున మింగుతుంది. ఇప్పుడు కూడా బుద్ది రాదా?

మరి ఒక బీదవాడు, గిద్ద నీళ్ళతో, బెల్లం ముక్కతో లేదా బియ్యం గింజలతో, చెట్టు ఆకులతో, కన్నీళ్ళు కారుస్తూ, నోటితో రామ రామా అంటే, ఓ గంట సేపు కళ్ళు మూసుకుని, దేవుడు రాడా? వినడా? కోరిక తీర్చడా? వస్తాడు, వారికి మాత్రమే పలుకుతాడు, ఉదాహరణ కన్నప్ప, ఏకలవ్యుడు.

ఎందుకంటే, మనసు ప్రధానం. మిగాతావి అనవసరం. ఐశ్వర్యము హోదా అధికారం పలుకుబడి పెరిగేకొద్దీ, మనసు తరిగి, దేవునికి దూరం అవుతాము. కౌరవులే ఉదాహరణ.

పోనీ 200 వందలతో, మనం అరగంట తో తూతూ మంత్ర పూజ ముగిస్తే, దేవుడు కరుణిస్తే, మరి ఎమ్మెల్యే గారు 1000 రుపాయలతో చేస్తారు, మంత్రి 10 వేలతో, కేంద్ర మంత్రి లక్ష తో, అమెరికా నాయకులు కోటి తో పూజ చేస్తారు. మరి దేవుడు ఎవర్ని చూడాలి, కరుణించాలి? ఎక్కువ డబ్బులు, ఖర్చు పెట్టిన వారిని అంతేనా? ఆ విధానమే తప్పు, రూపాయ కూడా ఖర్చు అవసరము లేదు, మానసిక దైవ పూజకు.

పూలు, కాయలు, నీళ్ళు, నైవేద్యం, మంత్రాలు అన్ని, దేవుని చేరడము లో మొదటి మెట్టు మాత్రమే. అదీ తూతూ మంత్రము గా చేస్తే? అంటే 10 వ తరగతి బడికి వెళ్ళి, 6 సబ్జెక్ట్లు వినడము కు, మాత్రమే సమానం. అంటే పాస్ అయిపోతామా? ఇంట్లో రేయింబవళ్ళు చదవద్దా? మననం చెయవద్దా? రాయవద్దా? అవి కూడా తుతూ మంత్రము గా చేస్తే, మొదటి మెట్టు కూడా, దాటలేము 100 జన్మలకు.

ప్రతి దానిలో, గూఢార్ధము చూడండి. మనసు నిలకడ ఉండాలి అంటే, పంచ ఇంద్రియాలను జయించాలి. దానికి సాధన కావాలి, ఇదొక మార్గము అంతే, గమ్యము ఇది కాదు. దైవ నామస్మరణ చేస్తూ, ఈ కిందివి చేయాలి, లేకపోతే, ఆ పూజ అనవసరము.

మోహములో, అహంకారములో, నిర్లక్ష్యములో, మదము లో చేసే పూజ, నిష్ప్రయోజనము. చేస్తే, పద్దతిగా చెయ్యాలి. లేదంటే, గమ్ముగా మన దోవలో మనం ఉండాలి. అపహాస్యము చేసి, ఇంకా పాపము, మూట కట్టుకోకూడదు.

* చెట్టు దగ్గరకు వెళ్ళి పూలు కోసి, దేవుని తలుస్తూ, మాల కట్టాలి. మల్లెపూలతో పెద్ద దండ కట్టేవారు. - 10 నిమిషాలు. దేవుని అలంకరణ సామాగ్రి అమర్చడము - 10 నిమిషాలు పైన. ఇప్పుడు చెట్లు లేవు పూలు లేవు, ఉన్నా మనకు ఓపిక లేదు.

* ఒత్తులు మనము చేత్తో, ఒక్కోటి లెక్కబెట్టి, 365 ఉండ కట్టాలి. పాత కాలము లో, దూది నుంచి మనమే చేసే వాళ్ళము. శుచిగా స్నానము చేసి, నువ్వుల నూనెతో, మట్టి ప్రమిదలో, ముట్టించాలి - 20 నిమిషాలు పైన.

* కనీసము మామూలు అన్నము అయినా, మనము వండి పెట్టాలి. - 20 నిమిషాలు. లేదా బెల్లముతో సర్దుకోవచ్చు.

* పూజ మంత్రాలు అష్టోత్తరము, మన పాపపు నోటితో, చదవాలి. 30 నిమిషాలు పైన. వాక్కు శుద్ది కావాలి, స్వచ్చమైన ఉచ్చారణ రావాలి. చదివేటప్పుడు, చూపు నోరు మనసు బుద్ది, అన్ని దేవుని వైపు ఉండాలి. లేదా కనీసము రామ రామ అన్నా చాలు, కళ్ళు మూసుకుని.

* పూజ పుస్తకము లో చూడండి, మన ఇంటికి, అతిధి అంటే రాజు/ మంత్రి/ నాయకుడు/ సామాన్యుడు వస్తే, ఎలా అర్చించి ఆదరించాలో ఉంటుంది, అందులో. అదంతా మనసులో ఊహిస్తూ, ఆ విధానం చేయాలి. శివయ్యా లేదా సత్యదేవా, రా వచ్చి కూర్చో స్వామీ ఈ ఆసనం మీద, చేతులు కాళ్ళు కడుగుతా, మీ చుట్టాలు బంధువులు పిల్లలు అయిన వినాయకుడు అష్టదిక్పాలురు నవగ్రహాలు క్షేమమేనా, ఈ పసుపు గంధం కుంకుమ పెట్టనీ, ఇదిగో వస్త్రాలు, నైవేద్యం తాంబులం హారతి, మంత్రపుష్పం వింటూ శయనించు. అని రాచ మర్యాద చేసి, త్రుప్తి పరచి, ఆ తర్వాత, గౌరవముగా సాగనంపడము.

ఎదుట నిజంగా మనిషి ఉంటే, ఈ తొందరపాటు పిచ్చి వేషాలు, వేస్తామా? అంటే ఎంపీ3 పద్యాలు, డబ్బింగ్ పూజ, బాటరి దీపం?

ఆ మనసుతో పని లేకుండా యాంత్రికము గా చేస్తుండ బట్టే, మన బతుకులు కూడా, యాత్రికము గా, అధోగతి మరియు కరోనా పాలు అవుతున్నాయి సుమా. ఆచరించండి, ఆచరింప చేయండి, మొక్షము నకు, మంచి జన్మకు బాటలు వేయండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2166 General Articles and views 2,194,514; 104 తత్వాలు (Tatvaalu) and views 243,564
Dt : 29-Nov-2020, Upd Dt : 29-Nov-2020, Category : Devotional
Views : 1096 ( + More Social Media views ), Id : 829 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : growing sin , sluggish , negligence , declining , responsibility , virtue , humanity , god puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content