మంచో చెడో, రాయాలి చెప్పాలి, లేకపోతే భావ దారిద్రం తో మనసు, కుంచించుకు పోతుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రెండు మాటలను ఏవైనా, మన గురించి లేదా మనం చేసే పనుల గురించి మనమే, తెలుగు మంచిది లేదా ఇంగ్లీషు లో ఎవరికి వారే రాయాలి, తమ బంధువులు స్నేహితులు కి తెలియ చెప్పాలి. వ్యక్తిత్వం పెంచుకోవాలి. దాని వలన చాలా ఉపయోగం భవిష్యత్తు లో ఉండవచ్చు ఏమో. ఇప్పుడు, గొంతు తోనే ప్రశ్న జవాబు మాటలు చెప్పవచ్చు తేలికగా.

మనకు రాయడం చాలా కష్టం గా ఉంటే, ఇంకొకరు రాసిందానికి అయినా, మనం మంచో చెడో, అనిపించింది రాయాలి. లేకపోతే భావ దారిద్రం తో, మెదడు మనసు, కుంచించుకూ పోతుంది. పదిమందికి పనికి రానిది, దైవ పూజకు కూడా పనికి రాదు.

ఇప్పుడు గత ఏళ్లుగా, కొంతమంది జవాబు లు చెపుతున్నారు, తప్పో ఒప్పో. వారంటే ఒక నమ్మకం, రేపు కష్టం లో ఉన్నా, నమ్మి, సహాయం చేయవచ్చు. ఎందుకంటే వారి జీవితం, తెరచిన పుస్తకం. దాపరికం నటన అవకాశవాదం ఉండదు.

కొన్ని ఉదాహరణలు చెపుతా, మనవి చెపితే, మీకు కోపం వస్తుంది కాబట్టి, రాజకీయ నాయకుల ఫేస్బుక్ చూస్తే, వారి ఫోటోలు మాటలు, అందరికీ అనిపించే అర్థం వేరు, మనకు అనిపించే అర్థం వేరు. కేవలం రాజకీయం చూడకూడదు, వారి వ్యక్తిత్వం ని ఆత్మ శుద్ధి ని, కూడా గమనించాలి.

ఉదాహరణ,

* బీజేపీ లో రాష్ట్రం బయట ఇద్దరు. ఒకరు శివ పూజ జరిగిన, ఇంట్లో విషయం కూడా ఫోటోలు పెడతారు. కుటుంబ సాంప్రదాయ విలువ లు ఉన్నాయి. పదవి లో ఉన్నా లేకపోయినా, నిరంతరం పార్టీ కోసం తపన. వీరి గురించి, మనం తొందరగా విమర్శలు రాయలేము.

రెండో వారు, వ్యక్తి గతం గా కొన్ని పెట్టిన కూడా, పార్టీ కోసం మొక్కుబడి మాటలు, అదీ పదవి ఉంటేనే.

* వైకాపా పెద్దలు ఒకరు, వ్యక్తి గతంగా తిరుపతి మెట్లు కూడా ఎక్కారు. నాయకుని రక్షణ గా మాటలు తూటాలు వదులుతూ ఉంటారు. వారికి నమ్మకమైన వ్యక్తి. మిగతా ఇద్దరు కన్నా, చాలా అలర్ట్ ప్రతి రోజూ.

* వైకాపా, మన చుట్టుపక్కల నాయకుడు. మనుమలు ముద్దు ముచ్చట కూడా పెడతారు, సౌమ్యులు, మాట మర్యాద, గౌరవం. కుటుంబ విలువ లు ఉన్న వ్యక్తి.

ఇలా చెప్పకుంటూ పోతే చాలా ఉంటాయి. భగవంతుడు, ఆయన గురించి మాటలు ఎలా పదిమంది కి అందుబాటులో ఉందో, మన వ్యక్తిత్వం ఆలోచన లు కనీసం మన దగ్గర వారికైనా, తెలియజెప్పాలి.

ఒకరు గురించి, మనకు తెలుసు ఏళ్లుగా, వారి మనసు ఆలోచన పద్దతి. ఒక సమయం వచ్చింది 6 ఏళ్ళు తర్వాత వారు కష్టం లో ఉన్నారు అని తెలిసింది, వాళ్ళ ఊరు, 2 గంటల కారు ప్రయాణం లో చెప్పకుండా నే వెళ్లి, వారి చేతిలో, కొంత పెట్టి వచ్చాము. ఆశ్చర్య పోయారు, ఎవరు చెప్పారు, మేము అడగలేదు కదా .

నటించవద్దు, తప్పు అయినా ఒప్పు అయినా, మన వ్యక్తిత్వం గమనించి, సహాయం చేసేవారు ఉంటారని మరువద్దు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 13-Dec-2020, Upd Dt : 13-Dec-2020, Category : General
Views : 484 ( + More Social Media views ), Id : 855 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , bad , explain , write , tell , mind , emotional , poverty , shrink
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content