మన బంగారం పిచ్చి, వారి వ్యాపారానికి అచ్చి, కొత్త దొంగలకు నచ్చి, మనకే దేహ శుద్ది - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మనలో చాలా మందికి బంగారము పిచ్చి ఉంటుంది. అది ఎంత అంటే, పుర్రెకో బుద్ది అన్నట్లు, మెడలో 4 దండలు, చేతి వేళ్ళకు 8 ఉంగరాలు. కాలి వేళ్ళకు కూడా ఎలా పెట్టుకోవాలో అని నిద్రలో(నిద్రలేని) ఆలోచన.

మనకు ఉన్న బంగారం పిచ్చి, బంగారం వ్యాపారానికి బాగా అచ్చి వస్తుంది, కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక కొన్న బంగారం లో కల్తీ గురించి చెప్పక్కరలేదు. ఈ కొట్లో కొంటే, అవతల కొట్టు వారు దాని నాణ్యతను అంగీకరించరు. సరే, దాని సంగతి వదిలేద్దాము.

దానితో పాటుగా కొత్త కొత్త దోపిడీ దొంగలు పుట్టుకువస్తున్నారు, మన నగలు నచ్చి, ఎక్కడపడితే అక్కడ, మనకే దేహ శుద్ది చేసి లాక్కోని పోతున్నారు.

అందరము భక్తులమే, గుడికి పోతాము, తీర్ధ యాత్రలకు వెళతాము, కానీ అంతిమ ఘడియలో కూడా బంగారం మీద మోహం మాత్రం పోదు. అరిషడ్వర్గాలను వదలమని గీత చెపుతుంది. మరి , ఉత్తుత్తి భక్తులము అని అంగీకరించినట్టేనా? పెళ్ళి అయినా, వ్రతము అయినా, తీర్ధ యాత్ర కైనా, ఆఖరుకు దినానికి కూడా బంగారము విడువము.

పైకి అందరము గురువు గారి భక్తులమే, కానీ ఒకటే తేడా, ఆయన ఒంటి మీద వీసమెత్తు బంగారము ఉండదు, మన మెడలో లేదా చేతి వేళ్ళలో(బంగారం పెట్టుకోడానికి) ఖాళీయే ఉండదు. ఒక గుడికి వెళితే, ఆలయ ధర్మ కర్త చేతి వేళ్ళు అన్ని తళ తళ మెరుస్తున్నాయి, అంటే చాలా భక్తి ఉన్నట్టే గదూ? దేవుడంటే గౌరవం ఎక్కువే కదూ?

దేవతలు ధరించేది, మనకు వరాలు ఇచ్చే స్తాయిలో ఉన్నాము అని చెప్పడానికి కావొచ్చు. ఆ ఫోటోలు కూడా మన కల్పనే. దేవతలు అందరికీ అది అలవాటు కావచ్చేమో. కాని మనకు, అందరికి ఆ భాగ్యం లేదు. మరి మనము ఎవరికి వరాలు ఇస్తున్నాము అని నగలు ధరిస్తున్నాము? మనది కేవలము స్వార్ధం.

మెడ బోసిగా ఉండకూడదు అంటే, మనకు జప మాల, రుద్రాక్ష మాల, ముత్యాల దండ, పూసల దండ, మామూలు దండ లో(బంగారు రంగు లేనివి), 20 నుంచి 100 రూపాయల కు దొరుకుతాయి. ఎవరైనా లింగ భేదం లేకుండా, ఎప్పుడూ మెడలో అది వేసుకోవచ్చు.

కొంతమంది అతి తెలివిగా, పిచ్చి బంగారం దండలు వేసుకుంటారు, దొంగ వస్తే ఇవ్వచ్చు లే అని. బంగారం కాదని మనకు తెలుసు, కానీ చిట్టి దొంగ తమ్ముడు కు అది తెలిసేది, అమ్మేటప్పుడు మాత్రమే. గబుక్కన లాగాలి, పారిపోవాలని ఆలోచన మాత్రమే చేస్తాడు. దాన్ని అక్కడ రాయి మీద గీసి, 24 కారెట్ బంగారమా కాదా అని చూడడు కదా ఆ తొందరలో.

ఈ లోపల రైలు, బస్సు , బండి నుంచి, రోడ్డు నడక నుంచి, దొంగ తమ్ముడు లాగే లాగుడికి పడేది మనమే, విరిగేది మన నడుములే, పోయేది మన ప్రాణాలే. లేదా కత్తి, తుపాకీ ప్రయోగం చేస్తాడు ఏదో దొరుకుతుంది అన్న ఆశతో. ఆ ఆశ కల్పించింది చిట్టి దొంగ తమ్ముడికి ఎవరు? ఇంకెవరు, మనమే కదా.

మన పిచ్చి మోహమే, మనల్ని హస్పటల్ కు అతిధులు గా చేస్తుంది, మంచిగా బిల్లు కట్టి, ఇంట్లో రెస్ట్ తీసుకోమని. లేదా మన కుటుంబానికి మనల్ని దూరం చేస్తుంది.

బంగారం రేటు పెరుగుతుంది అంటే అర్థం, మనకు అంత మోహం మనలో పెరుగుతుంది అని. లక్ష్మీదేవి(డబ్బు) ని అంటే డబ్బు ను వదులుతున్నాం, సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము. డబ్బుతో తిండి కొనుక్కోవచ్చు, కానీ బంగారము కేవలము ఆడంబర అలంకారము కు మాత్రమే.

తోటి దొంగలు కు, జీవనోపాధి పధకాలు, ప్రతి ఇంటివారు తమ శక్తి కొలది, యధాశక్తిన అమలు చేస్తున్నారు, ధన్యవాదాలు. ఎందుకంటే, దొంగలకు ప్రభుత్వాలు పధకాలు పెట్టలేవు కాబట్టి, జనాలే ఉదారంగా ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. అదే మన (ఇంటింట) పసిడి (బంగారం) దోపిడీ పధకం.

మన డబ్బు, మన బంగారం, మన ప్రదర్శనే , మనకు చేటు, అమలాపురం అయినా అమెరికా అయినా. అమెరికాలో కూడా మన ఇళ్ళనే, మనము నడిచే దోవనే టార్గెట్ చేస్తున్నారు. అంటే, మన భారతీయుల బంగారు ప్రదర్శన, ఆ స్థాయి లో ఉంది అనేగా అర్ధం.

కొంతమంది వితండ వాదం చేస్తారు, మా డబ్బు మా బంగారం, ప్రదర్శిస్తే తప్పు ఏమిటీ అని. కరక్టే, మనము మరలా చూపించుకోవడానికి రేపు ఉండాలి లేదా ఆరోగ్యముగా తిరగాలి గదా.

మెడలో పిచ్చి దో మంచిదో బంగారం ధరించు, దొంగలను ఆస్పత్రులను బతికించు, అని రెడ్డప్ప గారు, ఉండవల్లి లో దొంగలవలన ఆస్పత్రి పాలయ్యాక, డైరీ లో వ్యంగ్యంగా రాసుకున్నారు, అని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

వాట్సాప్ మెస్సేజ్ వచ్చింది, కింది బంగారము ధర పెరుగుదల ఫోటో. ఇది నిజము అయితే, 2005 నుంచి పాపము (మోహము) ఎంత విపరీతం గా పెరిగిందో? గుడుల్లో జనమూ పెరుగుతున్నారు, బంగారము ధర పెరుగుతుంది. ఇంక దేవుడిని దేవుడే కాపాడాలి, మన సంగతి ఎటూ దొంగ తమ్ముళ్ళు చూసుకుంటారు కదా.

దొంగ తమ్ముళ్ళు అంటే బయట దొంగలే కాదు ఇంటి దొంగలు కూడా, మన ఇంట్లో నూ, చుట్టాలలోనూ, స్నేహితుల లోనూ ఉంటారు, జాగ్రత్త సుమా అని కిషోర్, తన మిత్రుడు మూర్తికి వివరంగా చెప్పాడు బంగారోపాఖ్యానం.

అప్పుడే వచ్చిన మూర్తి గారి సతీమణి, ఏవండి, బాంక్ కి వెళ్ళి నగలు వడ్డాణాలు తీసుకురండి, పెళ్ళికి వెళ్ళాలి. అందరికన్నా, మనకే ఎక్కువ నగలు ఉన్నాయి అని చూపించాలి అంది. హహహ.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 13-Aug-2019, Upd Dt : 13-Aug-2019, Category : General
Views : 1387 ( + More Social Media views ), Id : 154 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gold theft , gold buying addiction , gold rate increase , gold rate chart
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content