Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. దేవుడు ఇచ్చిన అన్నకు, అంతా మంచి జరగాలని, ఇవి చూసైనా నీ మనసు లో మార్పు రావాలని, ధనము అన్నిటికి మూలమైనా కూడా, ధన అహంకారము పతనమయే వారిలో మనం ఉండకూడదని, చిన్న పెద్దా అందరినీ కలుపుకు పోవాలని, పెద్ద మనసుతో చిన్నలు పొరపాటు చేసినా, అర్ధమయ్యెలా నచ్చ చెప్పి ముందుకు పోవాలని ఆశిస్తూ, చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని, అందులో లోపాలను మన్నించాలి,
ఆనాడు రావణాసురుడు, ధుర్యోధనుడు కూడా, మన కన్నా కోట్ల సంపదలు ధర్మం దానం చేసారు, దైవాన్ని కూడా పొందారు చూసారు కూడా, కాని తమ లోని అరిషడ్ వర్గాలను గెలవలేక, చివరకు పతనము అయ్యారు.
అలాగే నేటి గాలి, మాల్యా, నీరవ్ పెద్ద పెద్ద టైకూన్లు కూడా, ఎన్నో సేవలు చారిటీలు దానాలు కమీషన్ లు చేసామని, ఎంతో మందికి అన్నం పెట్టాము అని, బీరాలు పోయి, గొప్పలు చెప్పుకుని, చివరకు వారి దుస్తితి మనకు తెలుసు. ఇంకా వారికి కోట్ల ధనం ఉన్నా కూడా, మర్యాద పరువు పోయి, విశ్వసనీయత సంస్కారం లేదని, ప్రపంచం మొత్తం తెలిసింది.
కోట్ల కిరీటం, వెంకన్నకు పెట్టిన, గాలి లేదా ఇతరులు, క్రిష్ణ జన్మస్థానం పోకుండా ఆపలేదు, ఏ దేవుడు. అంటే అర్ధము ఏమిటి, స్వార్ధం అహంకారం తో ఆశించి చేసే పుణ్యం వేరు, నిస్వార్ధం గా చేసే పుణ్యం వేరు, స్నేహితులకు బంధువులకు కుటుంబముకు కల్గించే, బాధ కీడు చేసే పాపం, లెక్కల అకౌంట్ వేరు. దేని ఫలితము దాని దే, ఏదీ వదలదు.
మన ఇద్దరి స్లోగన్ నీకు తెలుసు, నాకు సంపాదించడం రాదు, నీకు కుటుంబం నడపడం రాదు అని, ఇందులో సిగ్గు పడాల్సిన పని లేదు. కుటుంబం అంటే బంధాలు అనుబంధాలు అభిమానం ప్రేమ, నీకు తెలీవు. అది లేని నాడు, స్నేహితులతో కూడా, బంధము అలాగే ఉంటుంది, వ్యాపార సరళిలో.
నా సహాయం పొందిన వారంతా నాకు బానిసలు, నాకు తలవంచి నేను చెప్పిందే చేయాలి వినాలి అని, నా తప్పులు ఎత్తి చూపకూడదు, నా మంచి కి కూడా పతనం ఆపడానికి కూడా, అని అనుకోవచ్చు నువ్వు.
75 శాతం మంది, అవసరం కొద్ది, ముందు ఆ ప్రతిపాదనలకు తలవంచవచ్చు, ఆదాయం వస్తుంది అని. ఆ తర్వాత వారిలో కూడా, మార్పులు ఎటూ వస్తుంది. వారూ, మన పాపం కు తలవంచినందుకు పంచుకున్నందుకు, శిక్ష తప్పదు.
మంచి వాడైన కర్ణుడు కూడా, ధుర్యోధనుడి తో చేరి, నాశనం అయ్యారు కదా.
కానీ 25 శాతం మంది ఎప్పుడూ, నష్టపోయినా, పచ్చడి తిన్నా, రావణ దుర్యోధనుల కు అలాంటి వారికి, దూరం గా ఉంటారు, నీకు తెలుసు.
కృతజ్ఞతలు గౌరవం అభిమానం మనుషులు మీద లేకపోయినా, తెలుగు భాష మీద అయినా చూపించి, రెండు తెలుగు మాటలు రాయి అని, 2 ఏళ్ళ క్రితం అందరితో పాటు కోరా, ఇప్పుడు కూడా. కానీ అర్ధం లేని ఇన్గ్లీష్ లో రాస్తూ, మాత్రుమూర్తిని మాత్రుభాషను తెలుగు ను, మమ్మల్ని బాధిస్తూనే అవమానిస్తూనే ఉన్నావు.
ఫోన్ చేస్తే ఎత్తవు తర్వాత కూడా చేయవు. ప్రతీ సారి అంటావు మంచి సోది మాటలు వద్దు, నిమిషం చాలా కోట్ల విలువైనది అని, వ్యాపారస్తుడికి. నమ్మకమైన నిస్వార్ధ బంధం కూడా విలు వైనదే, అని నీకు ఇంకా జీవిత అనుభవం కాలేదు. ఆ రెంటిని, సరి చేసిన వాడే, నిజమైన మానవత్వం ఉన్న మనిషి.
గోపికలు తో ఉన్నాను అనో లేక మిలినీయర్ క్లబ్ మెంబర్లకు మాత్రమే, ఎప్పుడు అందుబాటులో ఉంటానని, పండుగ శుభాకాంక్షలు వారికే చెపుతానని, కనీసం కరోనా సమయంలో కూడా, నిజాలు రావా బయటకు? పర్లేదు అన్నా తప్పు ఏముంది.
ఎదుటి వారిని, పుణ్యాత్ములు, అని హేళన అవసరం లేదు. పాపాత్ములు కాని వారు ఎవరు ఉన్నారు, పాప శాతం లో మార్పులు అంతే. మాటలు కు క్షేమం కు, కూడా మమ్మల్ని ఎక్కిరించడం, భావ్యమా.
నిజమైన పాపాత్ములు అయిన వారు, పుణ్యాత్ములతో మాట్లాడి అయినా మారాలి అనుకుంటారు, భవిష్యత్తు కష్టాలు నష్టాలు, తప్పించుకోవడానికి, కానీ మనకు ధన సంపాదనలో తీరిక ఉండదు.
నువ్వు ఎటూ చిన్న వారికి, ఫోన్ చేసే సమయం, అవసరం, తీరిక ఉండదు, ఏదైనా లాభం లేదా అవసరం లేనిదే.
ఎదుట వారు ఫోన్ చేసినప్పుడు అయినా, గౌరవించి రెండు మాటలు మాట్లాడి, కన్నీళ్ళు తుడవడం వలన, మన ఆస్తి లో లేదా రాబడి లో, రూపాయ తగ్గదు కదా పెద్దలు అంటారు.
మిగతా తర్వాత కధనము లో, మొత్తము 6
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,640; 104 తత్వాలు (Tatvaalu) and views 225,925 Dt : 26-Apr-2021, Upd Dt : 26-Apr-2021, Category : General
Views : 894
( + More Social Media views ), Id : 1131 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
god ,
brother ,
mind ,
cares ,
wish ,
tycoons ,
ravan ,
dhuryoadhan ,
gali ,
malya Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments