APLatestNews.com top Banner

Social Media links
దేవుడు - అందరు మాకు బాకీ, మమ్మల్ని బాకీ దారులను చేయడం ఏం బాగాలేదు - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 920 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

వైకుంఠములో ఉన్న శ్రీమన్నారాయణుడు ఇలా అంటున్నారు భక్తునితో.

ఏరా ఆ బండ సంకల్పం ఏమిటి రా? ఒక పక్క వర్షాలు, బండ జారుతుంది, జలుబు వస్తుంది. అయినా వాన కోటు, చిన్న గొడుగు తో ప్రదక్షిణకు వచ్చావు అంటే ఏమిటి? వానొచ్చినా వరద చలివణుకు వచ్చినా, మమ్మల్ని వదలవా?

అందరూ సాధారణముగా, సంపాదనో లేక ఇంకోటో కోరిక ముందు మేము తీరిస్తే, ఆ తర్వాత 108 ప్రదక్షిణ లేదా కొండకు వస్తాము అని, మాకు బాకీ పడతారు. ఆ తర్వాత వీలుచూసుకుని చిన్నగా మొక్కు తీరుస్తారు.

మీరేందిరా అమ్మ కొడుకు లు తలనొప్పి గా మాకు, ఇప్పుడు మేమే మీకు 25 వారాల 108 ప్రదక్షిణలకు బాకీ ఉన్నామా? ఇదేమి చోద్యం మేమెక్కడ చూడలేదు.

అందరూ, నా కొడుకు కు అండగా నేను న్నా, నా కోట్ల ఆస్తి ఉంది అంటారు మోహం లో బ్రమలో, రేపు అనేది ఏమిటో తెలియకపోయినా.

మీ అమ్మ మాత్రం, దేవుడా నేనెంత వరకు తోడు ఉండగలను వాడికి, నా వయసు అయిపోయింది నువ్వే దిక్కు అని, ఇన్ని వారాలు ప్రదక్షణలు తిప్పి, జపమాల లెక్క కూడా వేసింది 108 వస్తున్నాయో లేదో అని, నీ కరమాల లెక్కకు తోడుగా.

అంటే నీ బాగోగులుకు మీ అమ్మ తర్వాత, నాదేనా బాధ్యత? ఎంత తెలివిగా, ముందర కాళ్లు కు బంధం వేస్తున్నారు. అమ్మా.

ఈరోజు వర్షములో గొడుగు పట్టుకుని, వేళ్ళతో కరమాల లెక్క కుదరదని, నేను పని ఆపుకుని , మిమ్మల్ని కనిపెట్టి ఉండాల్సివచ్చింది. వాన దేవుని తో చెప్పా, గంట ఓపిక పట్టు అని.

భూదేవి మరియు శ్రీదేవి తో చెప్పా, ప్రదక్షిణ లో నీటికి కాలు జారకుండా బిడ్డను కాపాడే బాధ్యత మనదే అని. గణేషుడు కూడా మామయ్యా, మా తండ్రి శివయ్య కూడా ఉన్నారు గుడి లో, అని ఆయన ఆసక్తిగా సహాయము చేయడానికి చూస్తున్నారు.

మా రామయ్య చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నావు అని, ఆంజనేయుడు కూడా కనిపెట్టుకుని ఉన్నారు, సంతోషం తో. ఆయన తండ్రి వాయు దేవుడు, మేఘాల ను పక్కకు పంపారు, మీకు వర్షము ఇబ్బంది లేకుండా.

కృష్ణుని చక్రం నీ పైన ఉండి, జాగ్రత్తగా చూస్తుంది. ఏరా, మా అందరికీ ఇలా పని కల్పిస్తే ఎలా? మేము స్రుష్టిని నడపడములో తీరిక లేకుండా ఉంటే.

అందరిలా ఏదో మొక్కుబడికి తప్పనిసరై గుడి కి వచ్చామా, ఆర్చుకుని తీర్చుకుని మధ్యాహ్నం, భోజనం లేదా టిఫిన్ చేసి, కొంపలు మునిగి నట్టు పరుగెత్తామా లేదా నలుగురు తో కబుర్లు చెప్పామా లేదా షికారు వచ్చినామా అన్నట్టు ఉండాలి. లక్ష మంది వస్తూ పోతూ ఉంటారు, అప్పుడు మేమూ కూడా అలాగే మిమ్మల్ని పట్టించుకోము.

కానీ ఈ రకంగా మమ్మల్ని ప్రత్యేకముగా ఇబ్బంది పెట్టి, మమ్మల్ని బాకీ దారులను చేయడం ఏం బాగాలేదు. అసలు ఎందుకు తిరుగుతూ ఉన్నావో, ఆ కోరిక ఏందో ఇప్పుడు అయినా చెప్పురా?

ఏమీ అడక్కుండా నే గమ్ముగా తిరుగుతూ, అంతా మీకే తెలుసు అంటారు. జాగ్రత్తలు మరి. ఇలాగే కష్టపడుతూ, మనసును నియంత్రించి, త్రిగుణాలను దాటాలి.

చివరిమాట - మన సంకల్పం గట్టిదైతే, దైవ అనుగ్రహం మనతో ఉంటుంది. లక్ష మంది లో మనం దేవుడు మనల్ని చూసే విధముగా, ఒకరు లాగా స్పష్టముగా ఉండాలి, దైవ భక్తి లో ఎప్పుడు కూడా. చివరకు మనకు దిక్కు పరమాత్మనే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 948 General Articles, 46 Tatvaalu
Dt : 07-Dec-2019, Upd Dt : 07-Dec-2019, Category : Devotional
Views : 371 ( + More Social Media views ), Id : 246 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : pradakshina , god , shiva , narayana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content