నడుం బిగించిన పంచాయతీ ఈవో సిబ్బంది - ప్రజల ఆరోగ్య సంరక్షణ కు సమాజ సేవకు, ఆశయ సాధన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2244 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2279 General Articles and views 2,804,980; 104 తత్వాలు (Tatvaalu) and views 293,718.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Girded Panchayat EO and staff - Community service for public health care, MLA, MP, Dy CM, CM Ashaya Sadhana

*నడుం బిగించిన పంచాయతీ ఈవో మరియు సిబ్బంది కి ధన్యవాదములు - ప్రజల ఆరోగ్య సంరక్షణ కు సమాజ సేవకు, ఎమ్మెల్యే ఎంపీ డిప్యూటి సీయెం మరియు సీయెం ఆశయ సాధనకు - డెంగ్యూ, చికెన్ గున్యా, కరోనా పరంపర వంటి అతి సూక్ష్మ సూక్ష్మ జీవుల వైరల్ వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తలు*

Girded (prepare oneself for something difficult or challenging) Panchayat EO and staff, thanks - Community service for public health care, MLA MP Deputy CM and CM Ashaya Sadhana - Precautions for prevention of micro-organism viral diseases like dengue, chicken gunya, corona parampara/ series

*అన్నిటి కన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యం - ప్రజలను పాలించే తండ్రిగా, ముందు చూపుతో వారి క్షేమం కోసం, కొన్ని మంచి పనులు - గౌరవ బాపట్ల జిల్లా వేటపాలెం మండంలం కొత్తపేట పంచాయితీ అధికారి గారికి అన్న కధనం ముందు చదివారు. దానికి మంచి మనసుల స్పందన, ఇప్పుడు చదవబోతున్నారు.*

Above all else is the health of the people - As a father who rules the people, with a foresight for their well-being, some good works - Respected Bapatla, District, Vetapalem, Mandal, Kothapeta, Panchayat EO garu - you read the article before. You are going to read the Good hearts response to it now. link.

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - 25 Sep 2024

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

*గౌరవ బాపట్ల జిల్లా, వేటపాలెం మండంలం, కొత్తపేట పంచాయితీ అధికారి గారికి*,

ధన్యవాదములు, శిరస్సు వంచి నమస్కారములు. వెంటనే స్పందించి, ప్రజల ఆరోగ్యములను కాపాడినందుకు, అలాగే వారి అనారోగ్యపు అనవసరపు ఖర్చులను మిగిల్చినందుకు.

ప్రజా సంక్షేమ రక్షణకు నడుం బిగించిన పంచాయతీ సిబ్బంది కి విజయోత్సవ శుభాకాంక్షలు - ప్రజల ఆరోగ్య సంరక్షణ కు సమాజ సేవకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ డిప్యూటి సీయెం మరియు సీయెం ఆశయ సాధనకు - డెంగ్యూ, చికెన్ గున్యా, కరోనా పరంపర వంటి అతి సూక్ష్మ సూక్ష్మ జీవుల వైరల్ వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తలు హర్షణీయం అని పలువురు కొనియాడుతున్నారు.

ఎవరో ఒకరు ఎపుడో అపుడు, నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు? అది ఎవరు కావాలి, ఆ మొదటి అడుగు ఎవరిది? మీరు, మేము, మానవత్వం ఉన్న ప్రజలు, విలేఖరులు, అధికారులు, నాయకులు ఎవరైనా కావచ్చును.

ఆ స్పందన ప్రజల నుంచి, సమాజం క్షేమం కోరే వారి నుంచి వచ్చింది. దానికి మన మంచి మనసున్న ప్రభుత్వం యంత్రాంగం స్పందించింది. ముందు జాగ్రత్తలు తీసుకుంది. మరి దాని ఖర్చు, స్తల యజమాని భరించాలి, ప్రజల అందరి ఆరోగ్యం కోసం, తానూ సామాజిక చైతన్యము గల సమాజములో భాగమని అంగీకరించాలి. పంచాయితీ అలాంటి స్తల యజమానులకు గుణ పాఠం నేర్పాలి.

ప్రవేటు స్థలము అయినా, యజమాన్య నిర్లక్ష్య ధోరణితో, చెత్త డంపింగ్ యార్డ్ లా తయారు అయినప్పుడు, బాధ్యత లేని చుట్టుపక్కల ప్రజలు ఉన్నప్పుడు, ఆ దోవలో నడిచే మానవ జీవులకు ప్రమాదం అయినప్పుడు, పంచాయితీ కలగ చేసుకుని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంము చేయడము హర్షించతగినది అని పలువురి అభిప్రాయం.

రేపు మన పసి పిల్ల, మన ఇంటి ఆడపడుచు, మన ఇంటి ముదుసలి పెద్దలు ఆ దోవలో నడుస్తున్నారు. కంటికి కనిపించని ఆ సూక్ష్మ జీవి, అక్కడ పేరుకుపోయినా చెత్త గాలి ద్వారా వ్యాపించి, వారిని కుట్టింది. ఆ వ్యాధి నివారణకు జ్వరాలకు, ఆసుపత్రి పాలు అయి, వేలు ఖర్చు అయితే, ఆ నరకయాతన బాధలు ఎవరు భరించాలి? మనమా, ఇతరులా? అందుకే నిర్లక్ష్యముతో చెత్తను ఖాళీ స్తలాలలో వేయరాదు.

ఉద్యోగస్తులు, లాయర్లు, డాక్టర్లు చదువుకున్న పెద్దలే మానసిక చెత్త భావనలతో, తమ ఇంటి చెత్త గ్రామం మీద వేస్తుంటే, ఇంక ఎవరికి ఎవరు చెప్పగలరు నీతి నిజాయితి సామాజిక చైతన్యం?

వాతావరణ మార్పులతో, ప్రజలలో జ్వరాలు రోగాలు పెరుగుతున్నవి, అలాగే ఆసుపత్రుల ముందు క్యూలు అధికమౌతున్నాయి. ప్రజల జేబులకు ఖర్చులతో చిల్లులు పడుతున్నాయి, బతుకులు భారం అవుతున్నాయి. దానిని ఆపే బాధ్యత మన అందరిదీ, ముఖ్యముగా గ్రామ ప్రజలది. దానికి ముఖ్య కారణం, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల అశుభ్రత.

పంచాయితీ ప్రజల ఆరోగ్య క్షేమం కోసం, పంచాయితీ ఈవో గారు నడుము బిగించారు, ప్రభుత్వ పెద్దలు చంద్రన్న పవనన్న ఆశయాలకు, అలాగే స్థానిక ఎమ్మెల్యే కొండయ్య మరియు ఎంపీ క్రిష్ణ ప్రసాద్ ఆదర్శ ప్రజా సంక్షేమ ఆలోచనలు కు అద్దం పట్టే విధము గా, ప్రజలకు వారి ఆరోగ్య రక్షణకు ముందు చూపుతో, మంచి పని చేసారు. దీనికి ప్రతి ఏడాది గుర్తు చేయకుండా, శాశ్వత పరిష్కారం చేస్తారని పలువురు కోరుతున్నారు.

అలాగే మురుగు నీరు పారుదలకు శాశ్వత పరిష్కారము చూపుతారని, చెత్త పన్ను రద్దు చేసి మేలు చేసిన ప్రజా ప్రభుత్వం, రోజూ దాని తొలగింపునకు శ్రద్ద వహిస్తారని, అలాగే పంచాయితీ పన్నులను ఆన్లైన్ లో చెల్లించే అవకాశం కల్పిస్తారని, గ్రామ సభల ఫలితాలను సమావేశాలను ఈమైల్ వాట్సాప్ గ్రూప్ ల ద్వారా అందరికీ పంచాలని, ప్రజలు ఎన్నోమార్లు విన్నపాలు పంపారు. ఈ మన మంచి ప్రభుత్వం లో, అవి త్వరలో సుసాధ్యం అవుతాయని అందరి ఆకాంక్ష.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2279 General Articles and views 2,804,980; 104 తత్వాలు (Tatvaalu) and views 293,718
Dt : 25-Sep-2024, Upd Dt : 25-Sep-2024, Category : General
Views : 395 ( + More Social Media views ), Id : 2162 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : health , people , father , foresight , well-being , good works , Bapatla , District , Vetapalem , Mandal , chirala , Kothapeta , Panchayat , EO
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content