APLatestNews.com top Banner

Social Media links
400 ఏళ్ల చరిత్ర, బ్రహ్మోత్సవాలకు ఏడుకొండల శ్రీవారికి గద్వాల్ ఎరువాడ జోడు పంచెలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

శ్రావణమాసంలో పని ప్రారంభించి 41 రోజుల పాటు, ఎంతో నియమనిష్టలతో ఈ పంచెను నేస్తారు. ఉపవాసాలు, గోవిందనామ స్మరణతో, మగ్గం నేస్తుంటారు. ఎరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. ఈ పంచెలపై రాజా కట్టడాలకు గుర్తుగా, 8 కంచుకోట కొమ్మ నగిషీతో సుందరంగ, కళాత్మకంగా తయారు చేస్తారు.

పంచెతయారీకి 20 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా పనులు సాగవు, మగ్గం కదలదన్న కారణంతో, అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.

గద్వాల్‌ నగరం తుంగభద్ర, కృష్ణా నది మధ్యన ఉన్నందున, ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు నదుల మధ్య ఉండే గద్వాల్‌లోని చేనేత మగ్గాలపై, ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. అలా రెండు ఏరువాడల మధ్యలో తయారయ్యే వీటిని, ఎరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి కెక్కినట్టుగా చెబుతుంటారు.

సహజంగా నేత మగ్గంలను ఇద్దరు కలిసి నేస్తారు. కానీ ఈ మగ్గం ప్రత్యేకత ఏంటంటే, ముగ్గురు ఒకేసారి నేసేలా ఉంటుంది. దీనిని నామాల మగ్గం అంటారు. ఎరువాడ జోడు పంచెల తయారీకి, మండలకాలం పడుతుందని కాబట్టి, దీన్ని ప్రత్యేకంగా చేయిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారికి ఎన్నో కానుకలు అందుతుంటాయి. కానీ గద్వాల నుంచి వచ్చే జోడుపంచెలు, వాటన్నిటిలో ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. పంచెలను తయారు చేయడం, తమ పుణ్యఫలంగా, ఇక్కడి వారు కొలుస్తారు. గద్వాల సంస్థానాదీశుల తరపున, మహంకాళి కరుణాకర్‌, కొన్నేళ్లుగా తన ఇంట్లో ఈ ఎరువాడ జోడు పంచెలను, తయారు చేయిస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజున, శ్రీవారి మూల విరాట్‌ విగ్రహానికి, ఎరువాడ జోడుపంచెలను అలంకరిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో, గతంలో మాదిరిగా హడావుడి లేకుండా పోయింది. భౌతికదూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పంచెలు నేస్తున్నారు.

సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న, తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించనున్నాం. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణయం తీసుకుంటాం అని వైవి సుబ్బా రెడ్డి, చైర్మన్ టీటీడి, తెలిపారు.  
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Chintam, Vetapalem, AP
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 28-Aug-2020, Upd Dt : 28-Aug-2020, Category : General
Views : 112 ( + More Social Media views ), Id : 664 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : gadwal , eruvada jodu panchelu , 400 year history , tirumala , venkanna , brahmotsavas , seven hills
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content