కరోనా లెక్కలు పెంచి, ఫోటోలో బొట్టు తో దండ కోసం, ఆత్రం ఎందుకు మిత్రుమా - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మాకు ఏప్రిల్ 30 దాకా పొడిగించారు, మేము రెండు వారాలు గా చేస్తున్న, కుటుంబ గృహ నిర్భంధ ఉచిత దేశ సేవ వ్రతం. అందరూ మార్చి ఏప్రిల్ లో రాజయోగం అంటే ఏందో ఇంకేందో అనుకున్నారు అంట , కానీ ఇలా ఇంట్లో తిని తొంగోవడం అని ఊహించలేదు అంట. అన్ని రాశుల వారికి వార ఫలితం ఒకటే, ఇంట్లో ఇల్లాలి దగ్గర బాధ్యత నేర్చుకో అని. పిల్లల కు ఆన్లైన్ కోర్సులు పెడుతున్నారు.

మీరూ సిద్ధంగా ఉండండి. మానసిక ధైర్యం కోల్పోవద్దు. ధైర్యే సాహసి అన్నట్లు ఉండాలి, ఎప్పుడు అయినా చీకటి తర్వాత వెలుగులోకి వస్తాం కదా. ఎంతోమంది ఉద్యాగాలు కు, వ్యాపారాల కు, ఆదాయం కు ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, అన్నిటికన్నా ప్రాణం ముఖ్యం, కుటుంబ ఆరోగ్యం ముఖ్యం కదా.

ఇంట్లో జీవిత భాగస్వామి తిట్లు, తన్నులు, ఇంటి పనులు కన్నా, ఆఫీసు లో మేనేజర్ తిట్లే, పనే నయమని, చాలా మందికి కనువిప్పు కలిగింది అంట. భార్య ఆదేశాలు కన్నా, బాస్ ఉపదేశాలు మిన్న అంటున్నారు.

రోడ్లు మీద, ఇంకా పిల్లలు పెద్దలు అబద్ధాలు చెపుతూ, అర్ధం పర్ధం లేని పనులుతో తిరుగుతూ నే ఉన్నారు. వారు బయట రోగాన్ని ఇంటికి తెచ్చి, ఇంట్లో అందరికీ అంటించి, రోగాన పడవేస్తారు జాగ్రత్తలు మరి. ఆ తర్వాత ఆసుపత్రి చుట్టూ, అందరూ తిరగాలి, ఖర్చు చేస్తూ సుమా.

అత్యవసరం అంటే మందులు, ఆసుపత్రి, ముదుసలి వారికి మాత్రమే. కూరలు తేలికగా దొరికితే సరే, లేదంటే వివిధ పప్పు ల లో గుత్తి తిప్పు తూ, మజ్జిగ తాలింపు పెడుతూ, పచ్చడి కందిపొడులు పట్టు. దైవ నవగ్రహ అభిషేకం కూడా, ఆన్లైన్ లో నే చూసాం.

చైనా దెబ్బ కొట్టింది అని ఎందరు అన్నా తిట్టినా, ఏ వస్తువు అయినా 60 రూపాయలే అంటే, లైన్లు లో ముందు మనమే ఉంటాం కదా? రేషన్ దగ్గర, మార్కెట్లు దగ్గర, ప్రజలు దూరం పాటించడం లేదు. కరోనా ని ఇంటికి ఆహ్వానించాలి అనేమో మరి.

మన చేతులారా రోగం తెచ్చుకుని, కరోనా లెక్కలు పెంచి, ఫోటోలో బొట్టు తో దండ కోసం, ఆత్రం ఎందుకు మిత్రుమా.

ఇంటి పట్టున ఉందాం, రోగ నిరోధక శక్తి పెంచుదాం, ఇంపైన ఆరోగ్యం పొందుదాం  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 30-Mar-2020, Upd Dt : 30-Mar-2020, Category : General
Views : 286 ( + More Social Media views ), Id : 458 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , stay at home
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content