నాలుగు పొట్లాలు నాలుగు చుక్కలు తో, కళ్ళు మూసుకుని మన గుర్తు కు ఓటేస్తారు, బాబాయి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,834; 104 తత్వాలు (Tatvaalu) and views 224,991.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాజధాని వడ్డీ రావణ బాబాయి, పుత్రుడు మేఘనాధుడు తో కలసి, ఇంకా చాటుగా ఉంటూ, ముదుసలి తల్లి, పల్లెటూరి తమ్మి, ఊళ్ళో చెల్లి ధనంతో, ఈ ఉగాది కి కూడా ఎప్పుడు లాగే సంబరాలు, సంతోషంగా జరుపుకోబోతున్నారు అనుకుంటా.

ఒకసారి జనం ధనం అలవాటు పడ్డాక, ఆ రుచే వేరు కదూ? ఆ చెమట రక్తం కన్నీళ్లు, ఇవ్వ వదల బుద్ధి కాదేమో, కృష్ణా? వడ్డీ ఇవ్వకుండానే, ఊళ్ళోళ్ళ ధనం దగ్గర పెట్టుకుంటే, మొదట వంచకులు మోసగాళ్ళు దొంగలు అవుతారు.

ఎక్కువ మంది ధనం ఎక్కువ సంవత్సరాలు, దా పెట్టుకుంటే, ముదిరి గజ దొంగలు అవుతారు. ఆ తర్వాత ఊరికి పెద్దలు, ఇంకా ముదిరి, నాయకులు కోటీశ్వరులు అవుతారు.

అంటే తొండ ముదిరి రంగులు మార్చే, ఊసరవెల్లి అవుతారు. నెక్ట్స్ ఆ ఊరు కౌన్సిలర్ ఎమ్మెల్యే ఎంపీ కి బాబాయే లేదా కొడుకు పోటీ నేమో, చెప్పలేము. వారి దాచి దోచే పరిధి పెంచుకోవాలి కదా.

గుడులకు జనాలకు, దానాలు సహాయం, కుల సంఘం అడ్డుపెట్టుకుని, అత్త సొమ్ము అల్లుడి దానం లాగా, ఊళ్ళోళ్ళ ధనం తో. ఓపెనింగ్ లకు పిలుపు లు, దర్జాగా హోదాతో ఊళ్ళోళ్ళ సొమ్ము తో.

బాబూ, మేమూ వందమంది కన్నీళ్లు తో, ఇరవై మంది ని చదివించాము, జీవితం ఇచ్చాము అని ఉత్తుత్తి కబుర్లు.

బాబాయి కుటుంబ విధానం ఇంట బయట వారందరికీ, బిడ్డా నువ్వేం బాధపడకు నీకేం భయం లేదు అండగా మేమున్నాం, 2018 నుంచి కన్నీరు కారుస్తూ ఉండు, నీ అవసరాలకు నీ మిగతా ఆస్తులు అమ్ముకో, వడ్డీ లు కట్టుకో, మమ్మల్ని నమ్మిన పాపం కు, ముక్కు కళ్ళు తుడుచుకుంటూ ఉండు‌ జేబు గుడ్డ కావాలి అంటే అడుగు, నీ నోటికాడ కూడుతో, నా బిడ్డలు ఆస్తి వ్యాపారం హోదా పెంచుతా, మీరంతా దూరముగా చూస్తూ ఆనందించండి.

ఎవరి ధనం ఎవరి దగ్గర ఉంటే ఏమిటి? మేం బాగుంటే మీ అందరికీ చాలదా? మేం తింటే మీరూ తిన్నట్లే కదా?, నవ్వు నవ్వుతూ ఉండండి కన్నీళ్ళు తో, మాకు స్నానం కు, గొంతు తడపడానికి అవసరము కదా అవి. మేము దేవుళ్ళం కనపడము మాట్లాడము. కొత్త బకరాలకు మాత్రమే మా శీఘ్ర దర్శనం, నెత్తిన హస్తం పెట్టాలి కాబట్టి, వారికి ముక్తి ఇవ్వడానికి.

రాత్రి కల వచ్చింది, మేఘనాధుడు రావణుని అడిగాడు, తండ్రి నేను గూడు వదలి దర్జాగా, జనం లో, నాయకుడి గా తిరగాలి, ఏదన్నా దోవచూపించు అని. ఓరి భడవా, నాకా మాత్రం తెలీదా, ఎమ్మెల్యే కు చూస్తున్నా, కుదరకపోతే, కౌన్సిలర్ గా కార్పోరేటర్ గా చూద్దాం లే అన్నారు. తొండ ముదరి ఊసరవెల్లి గా తప్పదు కదా మనలాంటి వారికి కేసుల నుంచి బయటపడాలి అన్నా.

జనకా, మరి మనము ఓడిపోతే?

పిచ్చోడా ఓడిపోతే జనం డబ్బే కదా, మాకు నష్టం వచ్చింది ఎలచ్చన్ లో, మా మేఘనాధుడు ఓడిపోయి, అసలు కూడా లేదు రాంరాం అందాం. నష్టపోయేది ఊరి జనం, మన కేబుల్ ఆస్తులు ఇబ్బంది లేదు కదా.

కానీ అనుమానం లేదు భయపడకు, జనం మనలాంటి గజ దొంగల కే అండ దండలు ఇస్తారు. నాల్గు రూపాయలు విదిలించి, నాలుగు పొట్లాలు నాలుగు చుక్కలు తో, కళ్ళు మూసుకుని మన గుర్తు కు ఓటేస్తారు.

అప్పుడు ఊరు మొత్తం అధికారంగా దోచుకుందాం , మనం డబ్బులు ఎగకొట్టిన బంధువులు కూడా జేజేలు కొడతారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,834; 104 తత్వాలు (Tatvaalu) and views 224,991
Dt : 13-Mar-2020, Upd Dt : 13-Mar-2020, Category : General
Views : 980 ( + More Social Media views ), Id : 405 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : babai , uncle , people money , politics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content