Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. అందరూ, ఒకటి లేదా రెండు డోసులు, టీకా వేయించుకున్నారా? జనం ఎలా ఉన్నారు, పెద్ద క్యూలా లేక తేలికగా ఉందా?
ఏదో ఒక సమాచారం, మీ నుంచి కూడా ఉండాలి. లేకపోతే బాకీ పడతారు సుమా?
ఆరోగ్యం జాగ్రత్తలు, అరచుకోవడానికి అయినా మనం ఉండాలి. రాక్షసులు మాత్రమే, కరోనా గురువు ను తిడతారు.
అజాగ్రత్త, లెక్క లేనితనం మనది, సంస్కారం లేని పెంపకం మనది. మనల్ని మనం తిట్టుకుని, బుద్ధి మార్చుకుని, నీతి నిజాయితీ మనుషులు గా, ఇకనైనా బతుకుదాం. ఇప్పుడు తప్పించుకున్నా, 3 వ ది వస్తుంది అంట.
అందుకే నన్ను తిట్టేవారిని కూడా, నేరుగా ఫోన్ చేసి తిట్టుకోండి, అని సద అవకాశం ఇస్తుంది. లోన కోపం దాచుకుని పైకి పోతే, నష్టం మీకే.
మరు జన్మ కష్టం గా ఉంటుంది సుమా. ఎటువంటి కోపాలు లేకపోతే నే, నారాయణ నామం గుర్తు వస్తుంది, చివర క్షణంలో. అదీ రోజూ నవ్వుతూ, సాధన చేస్తే.
- - -
మనం ఏదైనా ఇవ్వాలి అంటే, ఈ రోజుల లో ఎవరూ మంచి మనుషులు దొరకరు, దొరకడం లేదు. మామూలు గానే కష్టం, కరోనా సమయంలో ఇంకా కష్టం.
మంచి సంస్కారం ఉన్న వారు తీసుకునేందుకు దొరికితే, విష్ణువు అవతారం వామనుడు తో సమానం. నమస్కారం చేసి, ప్రాధేయపడి, సహాయం చేయాలి.
తాగుబోతు కు తిరుగుబోతు కు తప్పుడు మనిషి కి, తక్కువ లో వెయ్యి రూపాయలు ఇస్తే లేదా ఏదైనా సహాయం చేస్తే, మనకు పుణ్యం రాకపోగా, ఎదురు లక్ష రూపాయల పాపం వస్తుంది, వడ్డీ తో సహా మరువద్దు. అతను చేసే రోజూ పాపాల లో భాగం, మనకూ వద్దు అన్నా, వస్తూనే ఉంటుంది.
తప్పుడు నాయకులు కు, విలువైన ఓటు బాధ్యత లేకుండా వేసిన 20 ఏళ్ల పాపం కు, మనందరం కరోనా సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము. తప్పు మనదే, విడువదు.
ఈరోజు, మా ఇంటి ఎదురుగా, తారు రోడ్డు వేస్తున్నారు మరలా, ఓ 5 మంది పనివారు, ఎర్రటి ఎండ లో, తారు మంట వాసనలో పనిచేస్తున్నారు.
వెంటనే ఆ 5 గురు కి యాపిల్, అరటి పండ్లు ఇప్పించింది అమ్మ. అడగకుండానే, సహాయం చేసే అవకాశం వస్తే, చిన్నది అయినా, వదలవద్దు.
నడి ఎండ లో సాహసం చేస్తున్నారు, అందరు పంచుకోండి అంటే, నమస్కారం చేశాడు. ఎందుకంటే, అందరూ దూరంగా ఉండి చూస్తున్నారే గానీ, పలకరించరు. మనము పలకరిస్తూ ఫలాలు ఇచ్చేసరికి వారికి కొత్త గా ఉంది.
నాకు కాదు, పెద్దావిడ అమ్మ కు చెయ్యి, మా యజమానురాలు, రోజూ ఓ ముద్ద వేసే దయగల తల్లి, మొన్న నే నాకు కొత్త చెప్పులు కొనిచ్చింది, ఎండలో కష్టపడుతున్నారు మీకు ఫలాలు ఇవ్వమని చెప్పింది ఆమె నే, అంటే, అందరూ సంతోషం గా నవ్వుతూ ఉన్నారు.
మన తల్లి దండ్రుల భిక్ష, మన చేతిలో ఉన్న, ఈ నయా పైసా. మన సొంత సంపాదన అని విర్రవీగవద్దు. మొదటి లక్ష మీద, మనం కోటి సంపాదించినా, ఆ మొదట లక్ష రావడానికి, అష్ట కష్టాలు పడింది, వారు.
మామిడి టెంక చిన్నదే పనికి రానిది అనుకుంటాము, కాని దాని నుంచి మహా వృక్షం వస్తుంది కదా, వందకు పైగా ఫలాలతో. అది చిన్న టెంకె గొప్పతనం కాదా, మూలం కాదా?
మనం వాళ్ళ ని కాపాడటం లేదు, వాళ్ళే మనల్ని కాపాడుతున్నారు, కంటికి రెప్పలా.
చెప్పిన కదా, గత ఏలినాటి శని సమయం లో, కారు యాక్సిడెంట్ లో పెద్ద నష్టం జరగకుండా ఆగింది, పక్కన 75 ఏళ్ల అమ్మ ఉండటం వలనే, దేవుడు కి కూడా మనసు రాలేదు, ముదుసలి అమ్మ కు కీడు చేయాలంటే, అందుకే కారు మీద గీతలతో, కేవలం ధన నష్టం తో పోనిచ్చారు. లేకపోతే ఈరోజు, ఈ మెసేజ్ లు జాగ్రత్తలు ఉండవు మీకు.
వచ్చే ఆదివారం, మదర్స్ డే అనుకుంటా. ఆరోజు అన్నా, తల్లి దండ్రుల ను పలకరించి, పక్కన పెట్టుకోండి, బతికి ఉన్నప్పుడే. ఆ తర్వాత కోట్లు పెట్టిన కూడా, తీసుకుని రాలేము వెనక్కు. మన పాప ఫలితాలు విడువవు.
మాకు రోజూ, అమ్మ రోజే. తల్లి చేతి భిక్ష, స్వీకరించే రోజే. కరోనా గురువు పిలిచినా, ఇద్దరం నవ్వుతూ వెళ్ళే రోజే. మీరంతా బాగుంటే, మేమూ బాగుంటాము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,749; 104 తత్వాలు (Tatvaalu) and views 224,984 Dt : 06-May-2021, Upd Dt : 06-May-2021, Category : Politics
Views : 730
( + More Social Media views ), Id : 1155 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mothers day ,
mother ,
hand ,
alms ,
receiving ,
vaccinations ,
asphalt ,
road ,
mom Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments